Kavali Municipality
-
వార్డు హద్దులు.. ఓటర్ల సంఖ్య మారుతున్నాయ్
సాక్షి, కావలిః కావలి మున్సిపాలిటీలో వార్డుల సరిహద్దులు, ఓటర్లు సంఖ్య మారుతున్నాయి. పట్టణంలో పురుషులు – 46,655, మహిళలు– 49,406 , థర్డ్ జెండర్– 21 ఓటర్లుగా ఉన్నారు. కాగా కావలి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యపై అయోమయం కొనసాగుతోంది ఉంది. రానున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్య 40 యథాతదంగానే ఉంటుందా, సంఖ్యలో మార్పు చోటు చేసుకొంటుందా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. 2014లో ఎన్నికలు జరిగినప్పుడు కావలి మున్సిపాలిటీ ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ఉండింది. ఈ ప్రకారం 40 వార్డులు చేసి ఎన్నికలు నిర్వహించడంతో ప్రస్తుత పాలకవర్గం అధికారంలో ఉంది. కాగా రెండేళ్ల క్రితం కావలి మున్సిపాలిటీని ప్రభుత్వం మొదటి శ్రేణి మున్సిపాలిటీగా హోదా పెంచింది. కావలి: ప్రస్తుతం అమల్లో ఉన్న మున్సిపల్ చట్టం ప్రకారం మొదటి శ్రేణి మున్సిపాలిటీగా పరిగణలోకి తీసుకొని, పట్టణంలో ఉన్న జనాభా ప్రకారం ( 2011 జనాభా లెక్కలు ప్రకారం) 35 వార్డులు కానీ, 37 వార్డులు కానీ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో మున్సిపాలిటీ అత్యున్నత స్థాయి వర్గాలు పట్టణాలలో వార్డుల సంఖ్య అవకాశం ఉన్నంత మేరకు పెంచాలని, దానివల్ల పరిపాలన సౌలభ్యత పెరుగుతుందని నిర్ణయించారు. అలాగే పట్టణంలో ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా నాణ్యమైన సేవలు అందించడానికి దోహదపడుతుందని నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఈ నిర్ణయం కావలి మున్సిపాలిటీలో అమలు పరిస్తే 42 వార్డులు చేయాల్సి ఉంది. ఇలా మున్సిపాలిటీలో వార్డు సంఖ్యపై అస్పష్టత కొనసాగుతుండగానే, స్థానిక మున్సిపాలిటీ అధికారులు వార్డులు వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలో 75,388 ఓటర్లు ఉండగా, ఇప్పుడు 96,082 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో వార్డుకు గతంలో గరిష్టంగా 2,485 ఉండగా, తాజాగా ప్రకటించిన ఓటర్లు జాబితా ప్రకారం వార్డుకు గరిష్టంగా 3,336 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే గతంలో వార్డుకు కనిష్టంగా 1,259 ఓటర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం వార్డుకు కనిష్టంగా1,661 మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికల నాటి కంటే ఇప్పుడు పట్టణంలో ఓటర్లు 20,699 మంది పెరగడంతో, ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగారు. ఈ అంశాలను కావలి మున్సిపాలిటీ అధికారులు నిర్దిష్టంగా రాష్ట్ర మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో, అసలు కావలి మున్సిపాలిటీ మొదటి శ్రేణి అయిన అంశాన్ని కూడా రాష్ట్ర స్థాయి మున్సిపల్ అత్యున్నత వర్గాలు గమనించలేదు. అందుకే 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల నాటి నుంచి ఎటువంటి మార్పులు చోటుచేసుకుని మున్సిపాలిటీల జాబితాలో కావలి మున్సిపాలిటీ చేరింది. అందుకే అప్పట్లో రాష్ట్రస్థాయిలో వార్డుల పునర్విభజన చేయాల్సిన మున్సిపాలిటీల జాబితాలో కావలి మున్సిపాలిటీకి చోటు దక్కలేదు. కాగా తాజాగా ప్రభుత్వం కావలి మున్సిపాలిటీలో వార్డుల సరిహద్దులను, ఓటర్ల సంఖ్యను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 11వ తేదీలోగా ప్రజలు ఇప్పుడు అమల్లో ఉన్న వార్డుల సరిహద్దులపై అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా మున్సిపాలిటీల కార్యాలయంలో తెలియజేయాలని కమిషనర్ కె.వెంకటేశ్వరరావు ప్రకటించారు. పట్టణంలో ప్రస్తుతం మొత్తం 96,082 ఓటర్లు ఉండగా, అసలు డోర్ నంబర్లు లేనివి ఉండగా 2,000 ఓట్లు, మరో 2,000 ఓటర్లు 11–33 డోర్ నెంబర్‌తో ఉన్నాయి. ఇప్పుడున్న వార్డులలో ఓటర్లు సంఖ్య కూడా గందరగోళంగా ఉంది. దీనిని కూడా సరిదిద్దే ప్రయత్నం జరగనున్నది. -
మున్సిపల్ సమావేశం రసాభాస
అలేఖ్య మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విధుల నిర్వహణపై నిరసన సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒంటెద్దు పోకడ తగదన్న భరత్‌కుమార్ కావలి అర్బన్: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. అజెండాలోని అంశాలు పూర్తిగా చదవకుండానే అప్పటికప్పుడే అందులోని అంశాలను ఆమోదించి సభ నుంచి వెళ్లిపోయారు. అలేఖ్య చైర్పర్సన్ హోదాలో ఎందుకు వ్యవహరిస్తున్నారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఒంటెడ్డు పోకడపై బీజేపీ ధ్వజం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒంటెద్దు పోకడకు వెళ్లడం తగదని బీజేపీ కౌన్సిలర్ గుండ్లపల్లి భరత్‌కుమార్ అన్నారు. సమావేశం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది, భరత్‌కుమార్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, అధికారులు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 30 నిమిషాల ఆలస్యంగా టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అప్పటికే కౌన్సిలర్ అలేఖ్య మున్సిపల్ చైర్పర్సన్ సీట్లో కూర్చున్నారు. అజెండాలో ఉన్న 13 అంశాలను చదివి వినిపించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకట నారాయణ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కమిషనర్‌కు వినతి ప్రతం ఇచ్చేందుకు ఆయన కూర్చున్న సీటు వద్దకు వెళ్లారు. సమావేశం మందిరంలో చైర్పర్సన్ ఉండగా తనకు వినతిపత్రం ఇవ్వరాదని, తన చాంబర్లో ఇవ్వాల్సిందిగా కమిషనర్ సమాధానం ఇచ్చారు. అనంతరం పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. సమావేశాన్ని 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశానికి తిరిగి వచ్చిన అలేఖ్య అధికారులు అంశాలను చదువుతుండగానే 2, 3 అంశాలు మినహా అన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. నిబంధనల అతిక్రమణపై నిరసన చైర్పర్సన్ సీట్లో కౌన్సిలర్ పోతుగంటి అలేఖ్య కూర్చొని సమావేశం జరపడం నిబంధనలకు వ్యతిరేకమని, చైర్పర్సన్ పదవికి అనర్హురాలని కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని కమిషనర్‌కు వివరించారు. ఇన్చార్జి చైర్ పర్సన్‌గా భరత్‌కుమార్ విధులు నిర్వహించారని గుర్తు చేశారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేంత వరకు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేపట్టనివ్వద్దని వివరించారు. పక్షపాతధోరణి తగదు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అధికార సభ్యులు ఒంటెద్దు పోకడకు వెళ్లడం తగదని మున్సిపల్ వైస్ చైర్మన్ గుండ్లపల్లి భరత్‌కుమార్ పేర్కొన్నారు. టీడీపీ కౌన్సిలర్లు సభ్యతగా వ్యవహరించాలని కోరారు. పట్టణాభివృద్ధిలో భాగమైన రూ.7 కోట్ల నిధులతో నిర్మించాల్సిన రోడ్లు ఎందుకు వాయిదా వేసుకున్నారో తెలియడంలేదని ఆవేదన చెందారు. అన్నపూర్ణ మార్కెట్ వ్యాపారులను దెబ్బకొట్టి దారిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉందో ఆలాగే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ కౌన్సిలర్లు పొనుగోటి అనూరాధ, కేతిరెడ్డి శ్రీలత, చేవూరి తిరుపాలు, కనపర్తి రాజశేఖర్, కుందుర్తి సునీత, సురే మదన్మోహన్ రెడ్డి, మాల్యాద్రి, పేరం లలితమ్మ, మొలతాటి శేషమ్మ, మంద శ్రీనివాసులు, డేగా రామయ్య, పుష్పావతి హాజరయ్యారు. -
కావలి మున్సిపాలిటీలో నకిలీలలు
♦ జీతాల పేరిట ఏడాదికి రూ16.32 లక్షలు డ్రా ♦ విచారిస్తామంటున్న కమిషనర్ కావలి : వారు ఎవరో తెలియదు, ఎప్పుడూ విధులకు రారు.. కానీ వేతనాలు మాత్రం పొందుతున్నారు. ఈ తతంగం కావలి మున్సిపాలిటీలో ఏళ్లుగా సాగుతోంది. నకిలీల కారణంగా మున్సిపాలిటీలో ఏడాదికి రూ.16.32 లక్షలు గోల్మాల్ అవుతున్నాయి. మున్సిపాలిటీలోని కొందరు ఉద్యోగులు, పెద్దలు ఈ గోల్‌మాల్‌లో భాగస్వామ్యులైనట్లు ఆరోపణలున్నాయి. సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా ఇదే రీతిలో మున్సిపాలిటీలో వేతనాల గోల్మాల్ జరుగుతుందని సమాచారం. నోటీసులలో 39 మంది మున్సిపల్ రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు ఉన్నట్లు వారి పేర్లను కూడా అందులో ఉంచారు. పట్టణంలో మూడు డివిజన్ల కింద పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 165 మంది వరకు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉండగా మరో 28 మంది రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె చేస్తున్న మున్సిపల్ రెగ్యులర్ కార్మికులకు అధికారులు ఇచ్చిన నోటీసులలో అదనంగా మరో 11మందిని చేర్చారు. ఆ 11 మంది పేరున నెలకు రూ. 1.36 లక్షలు డ్రా అవుతున్నాయి. పదేళ్లకుపైగా ఈతంతు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా రూ. కోట్లలో ప్రజాధనాన్ని వేతనాల పేరిట కొందరు భోంచేశారు. నకిలీలను చూపి మున్సిపాలిటీలో పాతుకుపోయిన కొందరు ఉద్యోగులు, పెద్దలు వ్యవహారం నడిపినట్లు ఆరోపణలున్నాయి. విధులకు రాకున్నా జీతాలు డ్రా 11 మంది పారిశుధ్య కార్మికులు విధులకు రాకున్నా వారి పేరిట జీతాలను కొందరు అధికారులు డ్రా చేస్తున్నారని మున్సిపల్ పర్మినెంట్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు చేవూరి కొండయ్య, కార్యదర్శి పాముల సుబ్బరాయుడు తెలిపారు. వారి పేరిట నెలకు రూ.1.36 లక్షలు డ్రా అవుతున్నాయి. నకిలీ ఉద్యోగుల పేరిట వేతనాలు డ్రా చేస్తున్న వారిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విచారణ చేస్తాం: -శ్రీనివాసులు, కమిషనర్ కావలి ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం. పూర్తిస్థాయిలో విచారిస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావు. దీనికి సంబంధించి వివరాలను తీసుకుంటున్నాను.