kaveri water
-
కావేరి జలాల వివాదం.. నేడు బెంగళూరు బంద్
బెంగళూరు: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వివిధ కన్నడ సంఘాలు తప్పుపడుతున్నాయి. తమిళనాడుకు 15 రోజులపాటు రోజూ 5 వేల క్యూసెక్కుల కావేరి నీటినివిడుదల చేయాలని కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ) ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాదాపు 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతు నాయకుడు కురుబూర్ శాంతకుమార్ నేతృత్వంలోని రైతు సంఘాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ‘కర్ణాటక జల సంరక్షణ సమితి’ పేరుతో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆందోళన కారుల పిలుపు మేరకు బెంగుళూర్ బంద్ కొనసాగుతోంది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. దీంతో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు 144 సెక్షన్ విధించారు. అలాగే నేడు నగరంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతులు లేవని తేల్చిచెప్పారు. స్వచ్చందంగా బంద్‌ను పాటించాలని, బలవంతంగా బంద్‌ను అమలు చేయకూడదని బెంగళూరు పోలీస్ కమిషనర్ సూచించారు. స్కూల్స్, కాలేజీలు బంద్ బంద్ నేపథ్యంలో మంగళవారం బెంగుళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరు అర్భన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దయానంద్ కేఏ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా ఆటోలు, ట్యాక్సీ యూనియన్లు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. మెట్రో, ఆర్టీసీ సేవలు యధాతథం అయితే మెట్రో సేవలు బంద్ పిలుపుతో ప్రభావితం కాకుండా యథాధావిధిగా పనిచేయనున్నాయి. ఓలా, ఉబర్ వంటి సర్వీసులు సైతం పనిచేయనున్నాయి. తాము బంద్‌కు మద్దతు తెలపడం లేదని, తమ సర్వీసులు పనిచేస్తాయని ఓలా ఉబర్ యాజమాన్యాలు ప్రకటించాయి. హోటళ్ల యజమానుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల కూడా తెరుచుకొని ఉండనున్నాయి. #WATCH | Karnataka: Bengaluru Bandh has been called by various organizations regarding the Cauvery water issue. According to BMTC, all routes of Bengaluru Metropolitan Transport Corporation will be operational as usual. (Visuals from Majestic BMTC Bus stop, Bengaluru) pic.twitter.com/fSZSeLyKMh — ANI (@ANI) September 26, 2023 వీటితోపాటు బెంగుళూరు ఆర్టీసీ బస్సులు కూడా బంద్‌తో సంబంధం లేకుండా యథావిధిగా తమ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో మాత్రం తమిళనాడు బస్సుల ప్రవేశాన్ని నిలిపివేశారు. బెంగళూరు బంద్ దృష్ట్యా తమ ప్రయాణాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని విమాన ప్రయాణికులను అభ్యర్థిస్తూ బెంగళూరు విమానాశ్రయం ఓ ప్రకటన విడుదల చేసింది. #WATCH | An auto driver at Majestic BMTC Bus stop, Bengaluru, Naseer Khan says "We support the bandh called by various organisations. When the Cauvery water issue comes, we have a very clear stand that Karnataka will not provide water to anyone. Only night drivers are here, autos… pic.twitter.com/jMeVz3GeB8 — ANI (@ANI) September 26, 2023 విమానాశ్రయానికి ప్రయాణించేటప్పుడు విలైనంత త్వరగా బయలుదేరాలని ఇండిగో సూచించింది. బంద్ కారణంగా సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని.. డొమెస్టిక్ ప్రయాణానికి రెండున్నర గంటల ముందు, అంతర్జాతీయ ప్రయాణానికి మూడున్నర గంటల ముందు చేరుకోవాలని ట్విటర్లో తెలిపింది. కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మంగళవారం బంద్‌కు మద్దతు తెలిపింది. బెంగళూరు బంద్‌కు జేడీఎస్ కూడా మద్దతు తెలిపింది. బంద్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కాగా, తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో మంగళవారం చేపట్టిన నిరసనలను నిషేధించేలా కేంద్రం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు కావేరి రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిరసనలకు ప్రభుత్వం అనుమతి అయితే బెంగళూరు బంద్‌కు కర్ణాటక ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమ ప్రభుత్వం నిరసనలను అడ్డుకోబోమని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఆందోళనలను కట్టడి చేయబోమని హామీ ఇచ్చింది. అయితే బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కూడా ముఖ్యమని చెప్పారు. కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నది. ఏంటీ కావేరి వివాదం? తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నీటిని విడుదల చేయడానికి వీలులేదంటూ కర్నాటకలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కర్నాకట ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు ప్రజాసంఘాలు బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. -
ఇచ్చంపల్లికే మొగ్గు !
సాక్షి, హైదరాబాద్ : నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా జలాలను కావేరీకి తరలించే క్రమంలో ఇచ్చంపల్లి నుంచే నీటి తరలింపునకు కేంద్రం మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన అకినేపల్లి ప్రతిపాదనను, జనంపేట నుంచి పైప్‌లైన్ ద్వారా నీటి తరలింపు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించడంతో ఇచ్చంపల్లి నుంచి నీటిని నాగార్జునసాగర్‌కు తరలించే ప్రతిపాదనకు పదును పెడుతోంది. అనుసంధాన ప్రక్రియపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇచ్చంపల్లి నుంచి నీటి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చిన ఎన్‌డబ్ల్యూడీఏ.. దీనిపై తెలంగాణ అభిప్రాయాలు కోరింది. నిజానికి ఎన్‌డబ్ల్యూడీఏ మొదట 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరీకి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలపడంతో జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూసేకరణ తగ్గించేలా పైప్‌లైన్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. అయితే పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తే వ్యయం ఏకంగా రూ.90 వేల కోట్ల మేర ఉంటోంది. కాల్వల ద్వారా అయితే రూ.60 వేల కోట్ల వరకే వ్యయం ఉంటోంది. అయినా ఈ ప్రతిపాదనతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. ఈ అనుసంధానం ద్వారా ఎస్సారెస్పీ–2లోని కాకతీయ కాల్వల ఆయకట్టు, ఎస్ఎల్బీసీ ఆయకట్టు, డిండి ఆయకట్టుకు కలిపి మొత్తం 9 లక్షల హెక్టార్లు (25 లక్షల ఎకరాలు) ఆయకట్టుకు నీరు అందించొచ్చని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.73 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కోరింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నీటిని కృష్ణాకు తరలించే అంశమై చర్చలు జరుగుతున్న దృష్ట్యా, దీనిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్రం చేస్తున్న ప్రతిపాదనపై స్పష్టత ఇస్తామని తెలంగాణ తెలిపింది. -
మాకే నీళ్లు లేవు!
సాక్షి, చెన్నై : తమకే నీళ్లు లేవు అని, కావేరిని తమిళనాడుకు విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక నీటి పారుదల శాఖ మత్రి ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు డెల్టా అన్నదాతల్లో ఆందోళనకు దారి తీసింది. సంబా పంట ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తిరుచ్చి, తదితర డెల్టా జిల్లాల్లో సాగు కావేరి నీటి రాక మీదే ఆధార పడి ఉన్న విషయం తెలిసిందే. కావేరి ట్రిబ్యునల్ ఒప్పందాల మేరకు క్రమం తప్పకుండా నీటిని కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది. అయితే, కొన్నేళ్లుగా నీటి విడుదలలో సాగుతున్న వివాదం డెల్టా అన్నదాతల్ని కన్నీటి మడుగులో ముంచింది. లక్షలాది ఎకరాల్లో సాగుబడి ఒకప్పుడు జరిగితే, ప్రస్తుతం గణనీయంగా సాగుబడి తగ్గుతోంది. ఇందుకు కారణం కావేరి జలాలు సకాలంలో అందకపోవడమే. ప్రస్తుతం కొన్ని లక్షల ఎకరాల్లో సంబా సాగుబడి సాగుతూ వస్తున్నది. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కొంత మేరకు సాగుబడి మీద దృష్టిపెట్టారు. అయితే, సంబా చేతికి రావాలంటే, మరింతగా నీళ్లు తప్పనిసరి కానున్నాయి. ఈ దృష్ట్యా, తమిళనాడుకు వాటాగా ఇవ్వాల్సిన నీటిని విడుదల చేయాలని కర్ణాటకను డిమాండ్ చేసే పనిలో పాలకులు నిమగ్నమయ్యారు. అయితే, పాలకుల పిలుపునకు కర్ణాటకలో స్పందించే వాళ్లు లేరని చెప్పవచ్చు. దీంతో కావేరి కోసం అన్నదాత రోడ్డెక్కాల్సిన పరిస్థితి. వారం రోజులుగా డెల్టాలో కావేరి జాలల నినాదం మార్మోగుతోంది. అన్నదాతలు ఆందోళనలు సాగిస్తూ రావడంతో సీఎం పళనిస్వామి మేల్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీకి సిద్ధపడ్డారు. అయితే, ఈపర్యటన ఎప్పుడు సాగుతోందోనన్న ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో నీళ్లు లేనే లేవంటూ ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి స్పష్టం చేయడం గమనార్హం. నీళ్లు లేవు: తమకే నీళ్లు లేవు అని, ఇక తమిళనాడుకు ఎక్కడి నుంచి విడుదల చేయాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పటిల్ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి వస్తే, ఆయన్ను దగ్గరుండి మరీ తీసుకెళ్లి, తమ రాష్ట్రంలో నీటి కోసం పడుతున్న పాట్లు, కావేరిలో పరిస్థితి గురించి వివరిస్తామని వ్యాఖ్యానించారు. అంతేగానీ, తమిళనాడుకు నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని,అస్సలు నీళ్లే లేవని ఆయన స్పందించడం డెల్టా అన్నదాతల్లో ఆందోళనకు దారి తీసింది. గతంలో వలే ఈ సారి కూడా సంబాను కోల్పోవాల్సిందేనా అన్న వేదనలో మునిగారు. అసలే అప్పుల ఊబిలో ఉన్న తమకు ఇక, ఆత్మహత్యలే శరణ్యం అన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంగా తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ పేర్కొంటూ, తమిళ అన్నదాతల్ని ఆదుకునే రీతిలో కర్ణాటక నీటిని విడుదల చేయాలని కోరారు. అసలే రైతన్నలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, పరిస్థితి మరో రకంగా మారేలోపు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధ పడాలని విజ్ఞప్తి చేశారు. -
కావేరీ నీటిని వదిలేది లేదు: కర్ణాటక సీఎం
నేటి భేటీ తర్వాత తదుపరి నిర్ణయం: కర్ణాటక సీఎం సాక్షి, బెంగళూరు: ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరి నీటిని వదిలేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన గురువారం జరిగే ఉన్నతస్థాయి సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పన ఈ నెల 30 వరకూ నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటకను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం 9.30 గంటలకు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలపై చర్చించడానికి తర్వాత మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. రెండు సమావేశాల్లోనూ మెజారిటీ సభ్యులు తమిళనాడుకు నీటిని వదలకూడదని తేల్చిచెప్పారు. -
ట్రిబ్యునల్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు
-
కర్ణాటకలో కావే రి మంటలు
-బెంగళూరు, మాండ్య, మైసూరు జిల్లాల్లో బంద్ -కృష్ణరాజసాగర్ డ్యాంలోకి దూకిన రైతులు -జోక్యం చేసుకోవాలని ప్రధానికి సిద్ధరామయ్య లేఖ సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై కర్ణాటక మరోసారి భగ్గుమంది. శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌తో సామాన్య జనజీవనం స్తంభించింది. బెంగళూరు సహా, కావేరీ పరీవాహక ప్రాంత జిల్లాల్లో బంద్ విజయవంతం కాగా... మిగతా జిల్లాల్లో మిశ్రమ స్పందన లభించింది. కావే రి ఆందోళనలకు ముఖ్య కేంద్రమైన బెంగళూరు, మాండ్యలతో పాటు సరిహద్దు జిల్లా మైసూరుల్లో భారీ స్థాయిలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. రైతులతో పాటు వ్యాపారులు రోజువారీ కార్యకలాపాలను నిలిపివేసి బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులున్నా... తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కన్నడ హిత రక్షణ వేదిక నేతృత్వంలో 800 కన్నడ సంఘాలు బంద్‌లో పాల్గొనగా విపక్షాలైన బీజేపీ, జేడీఎస్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బళ్లారి, కొప్పాలా, చిక్బళ్లాపురా, ధార్వాడ్, కోలా ర్జిల్లాల్లో బంద్‌కు సానుకూల స్పందన లభించింది. మాండ్య జిల్లాలో బెంగళూరు-మైసూరు రహదారిపై పలుచోట్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. కృష్ణరాజసాగర్ డ్యాంలోకి ప్రవేశించేందుకు రైతులు యత్నించగా పోలీసులు లాఠీచార్జ్‌తో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు రైతులు గాయపడ్డారు. కొందరు డ్యాంలోకి దూకగా.. వారిని రక్షించారు. పలుచోట్ల సీఎం సిద్ధరామయ్య, ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం జయల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. బెంగళూరులో సర్వం బంద్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం టెర్మినల్, రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని టౌన్‌హాలు నుంచి ఫ్రీడం పార్కు వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఒక వ్యక్తి కత్తితో తీవ్రంగా గాయపర్చుకోగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా, ఆటోలు, క్యాబ్ యజమానులు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో రవాణా పూర్తిగా స్తంభించింది.మెట్రో సర్వీసులూ రద్దయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.పెట్రోల్ బంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కన్నడ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ తమిళ చానళ్ల ప్రసారాన్ని నిలిపివేశాయి. మాండ్య, మైసూరు జిల్లాల్లో పలు చోట్ల కర్ణాటక, సిద్ధరామయ్య, జయ మాస్క్‌లతో కూడిన దిష్టిబొమ్మలకు పెళ్లి జరిపించి నిరసన వ్యక్తం చేశారు. బంద్ నేపథ్యంలో కర్ణాటకలో భద్రతను ముందుగానే కట్టుదిట్టం చేశారు . ప్రతిష్టంభనకు తెరదించండి.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తక్షణం ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ న్విహించి ప్రతిష్టంభనకు ముంగిపు పలకాలంటూ ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితమవుతుందని, దేశానికి భారీ ఆదాయం, విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొస్తున్న ఐటీ పరిశ్రమ దెబ్బతింటుందని పేర్కొన్నారు.. 1995లో ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు సమస్యను పరిష్కరించాలంటూ ప్రధానమంత్రిని సుప్రీంకోర్టు కోరిందన్న విషయాన్ని గుర్తు చేశారు. -
తమిళనాడుకు కావేరి నీరు
మండ్య జిల్లాలో నిరసనలు సాక్షి ప్రతినిధి/బెంగళూరు/మండ్య : మండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర (కేఆర్ఎస్) జలాశయంలో నీటి మట్టం దారుణంగా పడిపోయిన పరిస్థితుల్లో కూడా తమిళనాడుకు వదిలే నీటి పరిమాణాన్ని పెంచడంపై ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. గత మూడు రోజులుగా కొడగు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా కేఆర్‌ఎస్‌లో ఇన్‌ఫ్లో 20,106 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే అధికారులు 8,052 క్యూసెక్కులను విడుదల చేయడం ప్రారంభించారు. జలాశయం నిండడానికి ముందే ఇలా నీటిని విడుదల చేయడంపై రైతులు మండిపడుతున్నారు. పంటలు కాపాడుకోవడానికి విశ్వేశ్వరయ్య కాలువకు నీటిని విడుదల చేయాలని ఆందోళన చేపట్టినా, కాలువల ఆధునికీకరణ పేరిట జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడుకు నీటి విడుదలను నిరసిస్తూ కేఆర్ఎస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నీటి విడుదల విషయం తెలిసిన వెంటనే రైతు సంఘం కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద గుమికూడారు. కొద్ది సేపు రాస్తా రోకో నిర్వహించారు. సీఎం సిద్ధరామయ్య, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరుగుతున్న నీటి మట్టం కేరళలోని వైనాడులో భారీ వర్షాల కారణంగా మైసూరు జిల్లాలోని కబిని జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. గరిష్ట నీటి మట్టం 2,284 అడుగులు కాగా ప్రస్తుతం 2,279 అడుగులకు చేరుకుంది. జలాశయం దాదాపుగా నిండిపోతున్నందున, నదిలోకి వదిలే నీటి పరిమాణాన్ని పెంచారు. అయితే జలాశయం నుంచి అధికంగా నీటిని విడుదల చేయడం లేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కేఆర్ఎస్, కబిని ఆయకట్టు రైతులు జలాశయాలు నిండుతాయనే ఆశతో చెరకు, వరి, రాగి, పంటలను పెట్టారు. నైరుతి రుతు పవనాలు ఆలస్యమవడంతో పంటలను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తమిళనాడుకు నీటిని విడుదల చేయడంపై రైతుల గుండెలు మండిపోతున్నాయి. కాగా కేఆర్ఎస్ జలాశయంలో గరిష్ట నీటి మట్టం 124.80 అడుగులు కాగా ప్రస్తుతం 86.65 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.