Keesara Police station
-
కీసర పీఎస్ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్
-
హీరోయిన్లపై కామెంట్స్ : సునిశిత్ అరెస్ట్
-
హీరోయిన్లపై కామెంట్స్ : సునిశిత్ అరెస్ట్
హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్లు తన లవర్స్ అంటూ హంగామా చేస్తన్న సునిశిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సునిశిత్ యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు తనకు తెలుసని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే వారి వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు కూడా చేశాడు. అసభ్య పదజాలంతో వారిని దూషించాడు.(పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి) ఈ క్రమంలోనే సునిశిత్‌పై ఇబ్రహీంపట్నం, కీసర పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కీసర పోలీసులు తాజాగా సునిశిత్ అరెస్ట్ చేశారు. కాగా, తనపై అసత్య ప్రచారం చేస్తున్న సునిశిత్‌పై గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. (ఆ వార్తలో నిజం లేదు: అమితాబ్ బచ్చన్) -
సమాచారం.. బూడిదవుతోంది..
కీసర: ఇళ్లలోకి చేరాల్సిన ఉత్తరాలు, బ్యాంకు చెక్ బుక్కులు, ఆధార్ కార్డులు, నోటీసులు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయి. ఆ తర్వాత ఓ ప్రదేశంలో కాలి బూడిదవుతున్నాయి. గుట్టలు గుట్టలుగా సంచుల్లో వాటిని తగలబెడుతుండగా పోలీసులు సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అహ్మద్‌గూడలో ఉన్న ప్లాట్లకు సంబంధించి రాంపల్లిదాయరకు చెందిన రామిడి రాజిరెడ్డి, చింతల్‌కు చెందిన భిక్షపతి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాస్పద స్థలంలో శుక్రవారం భిక్షపతి పది సంచుల్లో తెచ్చిన ఉత్తరాలు కాల్చివేయడాన్ని గమనించిన రాజిరెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే కొన్ని సంచులను కాల్చివేయగా మిగిలిన వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కూకట్పల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన ఉత్తరాలు, చెక్‌బుక్కులు, ఆధార్ కార్డులు, వివిధ బ్యాంకుల నోటీసు పత్రాలతో పాటు ఇతర పత్రాలు ఉండటంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోస్టల్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంబంధిత అధికారులు శనివారం కీసర పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకొని తీసుకెళ్లారు. విచారణ చేపడతాం.. చిరునామా ప్రకారం సంబంధిత వ్యక్తులకు చేరాల్సిన ఉత్తరాలు, ఆధార్ కార్డులు, ఇతర కవర్లు ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇదే మొదటిసారని సికింద్రాబాద్ తూర్పు డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ (ఏఎస్పీ) పవన్‌కుమార్ తెలిపారు. వాటిని తెచ్చి కాల్చివేయాల్సిన అవసరం భిక్షపతికి ఏంటి? అతడికి ఆ ఉత్తరాలు ఎవరు ఇచ్చారనే విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. -
చెత్తకుప్పలో 10 సంచుల ఉత్తరాలు
సాక్షి, హైదరాబాద్ : నమ్మకంగా ఉత్తరాలను బట్వాడా చేయాల్సిన పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆప్తులకు, అభ్యుర్థులకు చేరాల్సిన ఉత్తరాలను చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. కీసరలోని బండ్లగూడ సమీపంలో ఉన్న ప్రజాసాయి గార్డెన్స్ గేట్ పక్కన వేలకొద్దీ ఉత్తరాలు చెత్తకుండీలో లభ్యమయ్యాయి. 10 సంచుల్లో ఉన్న లెటర్స్‌ను రాజిరెడ్డి అనే వ్యక్తి ముందుగా గుర్తించాడు. ఆయన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఉత్తరాల్లో ఎక్కువ భాగం కూకట్పల్లి, షాద్‌నగర్, బాలానగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల అడ్రస్‌లతో ఉండటం గమనార్హం. ఎవరైనా కావాలని చేశారా, డ్యూటీ చేయలేక పోస్టల్ సిబ్బందే నిర్లక్ష్యంతో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. లెటర్స్‌ను బట్వాడా చేయకపోవంతో కొందరు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని సీఐ నరేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. -
కీచక ప్రిన్సిపాల్!
కీసర: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ వివేకం కోల్పోయాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కీసర మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంకిరెడ్డిపల్లిలో కేఆర్కే డీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ సాంబారెడ్డి కొంతకాలంగా విద్యార్థినులతో వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థినులను తన కార్యాలయంలోకి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించసాగాడు. వారి సెల్ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వికృతానందం పొందుతున్నాడు. విషయం ఎవరికైనా చెబితే హాజరుశాతం లేదని ఫెయిల్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ విషయం విద్యార్థులు కళాశాల డెరైక్టర్ రాధాకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేఆర్కే డీఎడ్ కళాశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. ఆరోపణలు అవాస్తవం విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండటంతో ప్రిన్సిపాల్ కఠినంగా వ్యవహరించారని, ఇది మింగుపడని విద్యార్థులు అనవసరమైన అభాండాలు వేస్తున్నారని కేఆర్కే డీఎడ్ కళాశాల చైర్మన్ రాధాకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. విద్యార్థుల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు.