kerala highcourt
-
లైంగిక వేధింపుల కేసు.. హీరోకు షాకిచ్చిన హైకోర్టు!
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుతో సెటిల్మెంట్ కుదిరిందని ఊహగానాలు కూడా వచ్చాయి. (ఇది చదవండి: 'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కాగా.. 2017 ఆగస్టు 23న సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబరు 15, 2017లో పోలీసులకు ఫిర్యాదులో చేశారు. అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సెటిల్మెంట్లో ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు. ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆయనకు కోర్టుల్లో చుక్కెదురైంది. దీంతో నటుడు తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాడు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) కాగా.. నటుడు చివరిసారిగా 'మలికాపురం చిత్రంలో కనిపించారు. 2011లో 'సీడన్' అనే తమిళ సినిమాతో ముకుందన్ తెరంగేట్రం చేశారు. అతను మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించారు. 2020లో ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్‌ని ప్రొడక్షన్ బ్యానర్ నడుపుతున్నాడు. -
వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల పోస్టులు.. అడ్మిన్ బాధ్యతపై హైకోర్టు వ్యాఖ్యలు ఇవే..
తిరువనంతపురం: వాట్సాప్ గ్రూపుల్లో అభ్యంతరకర కంటెంట్ పోస్టులపై గ్రూపు అడ్మిన్ బాధ్యత వహించడంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి పోస్టులకు అడ్మిన్ బాధ్యులు కాదంటూ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ తన తీర్పును వెలువరించారు. అయితే, మార్చి 2020లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసు విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్ ‘ఫ్రెండ్స్’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో అతడితో పాటు మరో ఇద్దరు అడ్మిన్లు ఉండగా.. వారిలో ఒకరు గ్రూపులో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 బి, పోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14, 15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పిటిషనర్ గ్రూపును క్రియేట్ చేసినప్పటి నుంచి ఈ కేసులో ఏ2గా ఉన్నాడు. ఈ పోస్టు విషయంలో తనకు ప్రమేయం లేదంటూ అతను కోర్టును ఆశ్రయించాడు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా హైకోర్టు.. గ్రూప్‌లోని మెంబర్ పోస్ట్ చేసిన అభ్యంతకర పోస్టులకు గ్రూపు అడ్మిన్ బాధ్యులుకారని పేర్కొంది. అలా వారిని బాధ్యులుగా పరిగణించడం క్రిమినల్ చట్టంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ కోర్టు పేర్కొంది. -
విడాకుల కేసులో కేరళ హైకోర్టు ‘క్రూరత్వం’ వ్యాఖ్యలు
కొచ్చి: కేరళ హైకోర్టు ఓ విడాకుల కేసు తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భర్తగానీ, భార్యగానీ విడాకుల కోసం ఒకరిపై మరొకరు సంసార జీవితంపై తప్పుడు ఆరోపలు చేయడం హింసించడం కిందకే వస్తుందని పేర్కొంది. గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ముహమ్మద్ ముస్తక్, జస్టిస్ కసర్ ఎడపగ్గత్ ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. సంసారానికి పనికి రారని, అంగస్తంభన లాంటి దిగజారుడు ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకుని విడాకులు తీసుకోవాలనుకోవడం క్రూరత్వం మాత్రమే కాదు.. నేరం కూడా. ఇది వైవాహిక వ్యవస్థను చులకన చేయడమే కాదు.. భార్యాభర్తల బంధాన్ని అవహేళన చేసినట్లే అని ద్విసభ్య న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో తప్పుడు ఆరోపణలు చేసే వాళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్న విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని బెంచ్ అభిప్రాయపడింది. కాగా, కేరళ ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఇద్దరు మెడికల్ గ్రాడ్యుయేట్స్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం బాగోలేదని తనకు విడాకులిప్పించాలని అబ్బాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో తన భర్తకి అంగస్తంభన సమస్య ఉందని అమ్మాయి ఆరోపించింది. ఇది ముదిరి పరస్పర ఆరోపణలతో మరీ పచ్చిగా కోర్టుకు స్టేట్మెంట్ సమర్పించింది ఆ జంట. దీంతో బెంచ్ అవాక్కయ్యింది. అయితే అమ్మాయి ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో బెంచ్ పైవ్యాఖ్యలు చేసింది. ఇక ఆ ఆరోపణల ఫలితంగా జంట కలిసి ఉండే అవకాశం లేదన్న ఉద్దేశంతో విడాకుల మంజూరీకే మొగ్గుచూపింది. -
పార్టీల ముసుగులో మనీలాండరింగ్..
సాక్షి, అమరావతి: ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రతీ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 2,099 పార్టీలు రిజిష్టర్ చేసుకున్నాయి. ఇందులో 97 శాతం పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు లేదు. ఏడు జాతీయ పార్టీలు కాగా, 58 రాష్ట్ర పార్టీలు. ఈ 97 శాతం పార్టీల్లో అత్యధిక పార్టీలు మనీలాండరింగ్‌కు, పన్నుల ఎగవేతకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఎందుకంటే రిజిస్టర్ అయిన పార్టీల్లో అత్యధిక శాతం ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వర్తించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని ఎంతో కాలంగా ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తూ వస్తోంది. కొన్ని పార్టీల విషయంలో పన్నుల ఎగవేత ఆరోపణలు నిరూపితమయ్యాయి. బంద్‌లు, రాస్తారోకోలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని, రాస్తారోకోలు నిర్వహించిన సీపీఎంకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ రిజిస్ట్రేషన్(డీ రిజిస్టర్) ఎందుకు చేయరాదో తెలిపాలని ఆదేశించింది. దీనిపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు 2002లో తీర్పునిస్తూ పార్టీల రిజిస్టర్‌కు ఎన్నికల సంఘానికి అధికారం ఉందని, అయితే డీ రిజిస్టర్ చేసేందుకు మాత్రం అధికారం లేదని స్పష్టం చేసింది. ఒక పార్టీని రిజిస్టర్ చేసిన తర్వాత, తిరిగి దానిని పునఃసమీక్షించే అధికారం చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని డీ రిజిస్టర్ చేయడమన్నది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. 2010లో ఎన్నికల సంఘం మరోసారి పార్టీల డీ రిజిస్టర్ విషయంలో తమకు అధికారాలు ఇవ్వాలని కోరింది. ఆ మేర చట్ట సవరణ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఎన్నికల సంఘం, పార్టీల డీ రిజిస్టర్‌కు తమకు అధికారాన్ని ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరింది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. -
ఆ తీర్పే సుప్రీం..
కొచ్చి : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చికి చెందిన గోవింద్ మధుసూధన్ బెయిల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిరసనలు తెలపడం సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని పేర్కొంది. శబరిమల వద్ద సమ్మెలు చేపట్టడం సమ్మతం కాదని అక్కడ మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే క్రమంలో అరెస్ట్ అయిన నిరసనకారుల్లో ఒకరైన కొచ్చి నివాసి మధుసూధన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మధుసూధన్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు 3500 మంది నిరసనకారులను అరెస్ట్ చేయగా, వీరిలో 540 మందిపై కేసు నమోదు చేశారు. దాదాపు 100 మంది వరకూ ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించే లక్ష్యంతో బీజేపీ గురువారం రథయాత్రను ప్రారంభించింది. ఇక ఈ వివాదాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ విపక్ష కాంగ్రెస్ సైతం కాసర్గాడ్, అలప్పుజ, తిరువనంతపురంల నుంచి యాత్రలను ప్రారంభిస్తోంది. -
క్లాస్‌లో అమ్మాయిని కౌగిలించుకున్న విద్యార్థి..!
తిరువనంతపురం : కేరళలోని ఓ పాఠశాల్లో 16 ఏళ్ల విద్యార్థి ఓ అమ్మాయిని హగ్ చేసుకోవడమే కాకుండా.. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన ఐదు నెలల క్రితం జరగగా.. కొడుకు జీవితం కోసం ఆ తండ్రి ఉద్యోగం మానేసి మరీ కోర్టుల చుట్టు తిరిగాడు. తిరువనంతపురంలోని సెయింట్ థామస్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి 11వ క్లాస్‌కు చెందిన అమ్మాయిని కౌగిలించుకొని, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థిని సస్పెండ్ చేయడంతో పాటు బోర్డు పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించింది. తన కొడుకు జీవితం పాడవుతుందని భావించిన ఆ విద్యార్థి తండ్రి స్కూల్ సస్పెన్షన్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ గత ఆగస్టులో కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా కోర్టు ఆ సస్పెన్షన్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ.. . విద్యార్థుల క్రమశిక్షణ విషయం పాఠశాల ప్రతిష్టపై ఆధారపడి ఉంటుందే కానీ, పరీక్షలు రాయకుండా సస్పెండ్ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది. అవసరమైతే విద్యార్థుల తల్లితండ్రులకు జరిమానా సూచిస్తూ తీర్పునిచ్చింది. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ విద్యార్థిని పరీక్షలకు అనుమతించే అంశం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. ‘ఈ విషయంలో క్షమాపణ చెప్పినప్పటికీ నన్ను ఓ రేపిస్టు అని పిలుస్తున్నారు. పరీక్షలు రాయకుంటే ఒక ఏడాది వృథా అవుతుంది. అది నేను ఊహించలేను. నాకు బోర్డు పరీక్షలు రాయలనుంద’ని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. చదువుకునే హక్కు రాజ్యంగం కల్పించిందని, తన కుమారుడి వ్యక్తిగత హక్కును ఉల్లంఘిస్తూ పాఠశాల యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుందని విద్యార్థి తండ్రి వాపోయాడు. -
ఎందుకు అడ్డుకోలేకపోయారు?
కొచ్చి: పుట్టింగల్ ఆలయ అగ్నిప్రమాద ఘటనపై సీబీఐతో దర్యాపు జరపాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పుట్టింగల్ దుర్ఘటనపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. చట్టవిరుద్ధంగా బాణసంచా పేలుళ్లు నిర్వహించారని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆలయ ప్రాంగణంలో బాణసంచా కాల్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని హైకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది. అనుమతి ఇవ్వకుంటే బాణసంచా ఎలా కాల్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అనుమతి లేనప్పుడు ఆలయ ప్రాంగణంలోని బాణసంచాను పోలీసులు ఎందుకు పట్టుకురానిచ్చారని, కాల్పులను ఎందుకు అడ్డుకోలేకపోయారని సూటిగా నిలదీసింది. పేలుళ్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం విధుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ ఘోర విపత్తుకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు, కొల్లాం జిల్లా అధికార యంత్రాగం వేర్వేరుగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. పుట్టింగల్ ఆలయ ప్రాంగణంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా కాల్పులు సందర్భంగా పేలుడు సంభవించడంతో 109 మంది మృతి చెందగా, 300 మందిపైగా గాయపడ్డారు. -
నా భార్య ఆస్తులేవీ తీసుకోలేదు: శశి థరూర్
తన దివంగత భార్య సునందా పుష్కర్ ఆస్తులు వేటినీ తాను తీసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కేరళ హైకోర్టుకు తెలిపారు. దివంగత భార్య వల్ల వచ్చిన ఆస్తులను వెల్లడించనందుకు లోక్‌సభకు ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌కు సమాధానంగా ఆయనీ వివరాలు చెప్పారు. అసలు తన భార్య కెనడా పౌరురాలని, అందువల్ల హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తులను తాను పొందే అవకాశమే లేదని శశి థరూర్ అన్నారు. సురేష్ కుమార్ అనే బీజేపీ కార్యకర్త శశి థరూర్ మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. అసలు ఇంతవరకు సునందా పుష్కర్ స్థిర, చరాస్తులు ఏవేంటన్నవి ఇంతవరకు అంచనా వేయలేదని, అలాగే ఆమె వారసత్వ హక్కులు ఎవరికి వెళ్తాయన్నది కూడా ఇంతవరకు నిర్ధారించలేదని శశి థరూర్ కేరళ హైకోర్టుకు చెప్పారు. ఆమె జీవించి ఉండకపోవడం వల్ల మాత్రమే ఆమె ఆస్తి వివరాలను ఎక్కడా తాను అఫిడవిట్లో చెప్పలేదు తప్ప.. తనకు ఎలాంటి దురాలోచన లేదని ఆయన అన్నారు. ఆమె భారత పౌరురాలు కాకపోవడం, హిందూ వారసత్వ చట్టం కూడా ఆమెకు వర్తించకపోవడం వంటి విషయాలు గుర్తించాలని థరూర్ అన్నారు. కెనడా పౌరురాలైన ఆమె.. వ్యాపార రీత్యా యూఏఈకి వెళ్లిపోయారని తెలిపారు.