Kerala visit
-
మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం
కొచ్చిన్: ఈనెల 24, 25వ తేదీల్లో కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీని సూసైడ్ బాంబర్‌తో చంపేస్తామన్న బెదిరింపులపై పోలీసులు, కేంద్ర నిఘా విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి గత వారం రాష్ట్ర బీజేపీ విభాగానికి అందింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.సురేంద్రన్ దానిని పోలీసులకు అందజేశారు. ప్రధాని పర్యటన, బందోబస్తులో ఉండే అధికారుల వివరాలతో అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) తయారు చేసిన నివేదిక శనివారం వైరల్ అవుతోంది. అందులోనే బెదిరింపు లేఖ అంశం ఉంది. మలయాళంలో ఉన్న ఆ లేఖను కొచ్చిన్‌కు చెందిన ఎన్జే జానీ రాసినట్లుగా ఉంది. లేఖలో వాస్తవికత, దాని వెనుక ఉన్న వ్యక్తిపై విచారణ జరుపుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ పరిణామంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ స్పందించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన ముఖ్య విషయాలను లీక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీరియస్ వ్యవహారమని, సీఎం విజయన్ స్పందించాలని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. అనుమానితుడిగా పేర్కొంటున్న ఎన్జే జానీ శనివారం మీడియాతో మాట్లాడారు. సదరు బెదిరింపు లేఖతో తనకు సంబంధం లేదన్నారు. పోలీసులడిగిన అన్ని వివరాలను అందించానన్నారు. చర్చి వ్యవహారానికి సంబంధించి తనతో శత్రుత్వం ఉన్న వారే దీని వెనుక ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
దక్షిణ పర్యటనకు అమిత్ షా
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన పర్యటనను ముమ్మరం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రణళికలను సమీక్షించేందుకు అమిత్ షా మంగళవారం కేరళలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కార్యకర్తలతో, రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె. రాజశేఖరన్‌ను అనూహ్యంగా మిజోరం గవర్నర్‌గా నియమించడంతో రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కేవలం ఆరు శాతమే ఉన్న బీజేపీ ఓట్లశాతం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికలలోపు రాష్ట్రంలో మరింత బలపడాలని కమళదళం ప్రయత్నిస్తోంది. ప్రధాన మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేనాతో (బీడీజేఎస్) కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనుంది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌గోపాల్ ఒక్కరు మాత్రమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ప్రధానంగా సీపీఎం నేతృత్వంలోని (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని(యూడీఎఫ్) బలంగా ఉన్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏవిధమైన వ్యూహం అమలు చేస్తుందో వేచి చూడాలి. -
కేరళ పర్యటనకు బ్రిటన్ యువరాజు
బ్రిటన్ యువరాజ్ చార్లెస్, ఆయన భార్య కెమిల్లా పార్కర్ సోమవారం నుంచి కేరళలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. చార్లెస్ దంపతులు కేరళను సందర్శించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చార్లెస్ దంపతులు డెహ్రాడూన్, న్యూఢిల్లీ, ముంబై, పుణె పర్యటనను ముగించుకుని కోచి వెళతారు. బ్రిటన్ యువరాజు రాక సందర్భంగా కేరళలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కోచితో పాటు చార్లెస్ సందర్శించే పలు ప్రాంతాల్లో దాదాపు వెయ్యిమంది భద్రత సిబ్బందిని మోహరించారు. చార్లెస్ గౌరవార్థం కేరళ గవర్నర్ నిఖిల్ కుమార్ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో వ్యాపారవేత్తలు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కేరళ పర్యటన ముగిసిన అనంతరం చార్లెస్ దంపతులు కొలంబో వెళ్లనున్నారు.