Keshava Reddy Victim
-
వైఎస్ జగన్‌ను కలిసిన మోడల్ స్కూల్ టీచర్స్
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 317వరోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఆదివారంపేట నుంచి ప్రారంభించారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రభుత్వ మోడల్ స్కూల్ అధ్యాపకులు వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రభుత్వం కార్పొరేట్‌తో లాబీయింగ్ చేసి మోడల్ స్కూల్స్‌ను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిట్‌దారులు ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిట్‌దారులు కలిశారు. ఒక్కో విద్యార్థి నుంచి రెండున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు జననేతకు తెలిపారు. సీఐడీ విచారణ చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం ఐదేళ్లైనా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్సీ డిపార్ట్మెంట్కు చెందిన మహిళలు కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు. అకారణంగా తమను ఉద్యోగం నుంచి తొలగించారని మహిళ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసిన 104 ఉద్యోగులు.. తమ సమస్యలను ఆయనకు వివరించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతులు కూడా జననేతను కలిశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో తమకు రవాణా ఖర్చులు ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుతం రైతులకు ఎలాంటి చార్జీలు ఇవ్వడం లేదని జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్ర రాగోలు చేరుకున్న సమయంలో గ్రామానికి చెందిన మహిళలు ఆయన్ని కలిశారు. తెలగా కులానికి చెందిన తమని బీసీలలో కలపాలని కోరారు. వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతించిన గిరిజన ఉద్యోగ సమైక్య జననేత ప్రకటించిన ఉద్యోగ కల్పన ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ఉద్యోగ సమైక్య కూడా వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతించింది. ఉద్యోగ సమైక్య ప్రతినిధులు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. -
ఇంకెన్నాళ్లు నాన్చుతారు?
సాక్షి, కర్నూలు: గడచిన మూడేళ్ళుగా తమకు ఏవిధమైన న్యాయం జరగలేదని కేశవరెడ్డి బాధితులు వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, మలికి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సీఐడీ ఏఎస్పీని కలిశారు. తమకు డబ్బులు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కేశవరెడ్డి ఆస్తులు సీఐడీ స్వాధీనంలో ఉన్నాయని న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం, అధికారులు కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ఆదాయం సుమారు రూ. 100కోట్లు పైనే అని, ఆ మొత్తం ఎటు వెళ్లిందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మొత్తం తమకు చెల్లించినా కొంత ఊరట కలిగేదన్నారు. వందల కోట్ల రూపాయల మోసం చేసిన కేశవరెడ్డి కుమారునికి స్కూల్ నిర్వహణ బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ కేశవరెడ్డి, ఆయన వియ్యంకుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగాగే బాధితులకు డబ్బు కట్టకుండా ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, జగోపాల్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. బాధితులను బెదిరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. -
చంద్రబాబు నివాసం వద్ద కలకలం
-
చంద్రబాబు నివాసం వద్ద కలకలం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శుక్రవారం ఉదయం ‘కేశవరెడ్డి’ బాధితుడొకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి భార్యా పిల్లలతో కలిసి సీఎం కలిసేందుకు వచ్చిన గంగుల శ్రీనివాసరెడ్డికి 10 రోజులైనా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లభించకపోవడంతో.. సీఎం నివాసం ఎదుట బలవన్మరణానికి యత్నించాడు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని అడ్డుకొని అతని వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరెడ్డి ఇద్దరు పిల్లలు హృద్రోగంతో బాధపడుతున్నారు. వారికి చికిత్స చేయించడానికి డబ్బు లేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డికి అప్పుగా ఇచ్చిన రూ. 5 లక్షలను ఇప్పిస్తే.. వాటితో పిల్లలకు చికిత్స చేయించుకుంటానని అతడు వేడుకుంటున్నాడు. 2012లో కేశవరెడ్డి తన దగ్గర నుంచి 5 లక్షలు రూపాయలు అప్పుగా తీసుకున్నాడని బాధితుడు తెలిపాడు. తన పిల్లల చికిత్స కోసం డబ్బులు అవసరం కావడంతో అప్పు చెల్లించాలని కోరగా కేశవరెడ్డి స్పందించలేదని వాపోయారు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో తనగోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చానని చెప్పాడు. పదిరోజులైనా సీఎంను కలిసే అవకాశం రాకపోడంతో కలతచెంది ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిపాడు. కేశవరెడ్డి నుంచి తన డబ్బులు ఇప్పించాలని వేడుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.