
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 317వరోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఆదివారంపేట నుంచి ప్రారంభించారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రభుత్వ మోడల్ స్కూల్ అధ్యాపకులు వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రభుత్వం కార్పొరేట్‌తో లాబీయింగ్ చేసి మోడల్ స్కూల్స్‌ను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌ను కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిట్‌దారులు
ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిట్‌దారులు కలిశారు. ఒక్కో విద్యార్థి నుంచి రెండున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు జననేతకు తెలిపారు. సీఐడీ విచారణ చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం ఐదేళ్లైనా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌సీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మహిళలు కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు. అకారణంగా తమను ఉద్యోగం నుంచి తొలగించారని మహిళ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసిన 104 ఉద్యోగులు.. తమ సమస్యలను ఆయనకు వివరించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతులు కూడా జననేతను కలిశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో తమకు రవాణా ఖర్చులు ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుతం రైతులకు ఎలాంటి చార్జీలు ఇవ్వడం లేదని జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్ర రాగోలు చేరుకున్న సమయంలో గ్రామానికి చెందిన మహిళలు ఆయన్ని కలిశారు. తెలగా కులానికి చెందిన తమని బీసీలలో కలపాలని కోరారు.
వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతించిన గిరిజన ఉద్యోగ సమైక్య
జననేత ప్రకటించిన ఉద్యోగ కల్పన ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ఉద్యోగ సమైక్య కూడా వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతించింది. ఉద్యోగ సమైక్య ప్రతినిధులు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment