ఫిక్సింగ్ ఉచ్చులో కివీస్ మాజీలు!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం రేగింది. మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ విచారించిందని కివీస్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం కివీస్, విండీస్ టెస్టు సందర్భంగా కామెంటరీ చేస్తున్న కెయిన్స్, మాజీ ఆటగాళ్లు టఫీ, లూ విన్సెంట్లపై ఫిక్సింగ్ ఆరోపణలున్నాయని, ఈ త్రయాన్ని ఐసీసీ విచారించిందని న్యూజిలాండ్ హెరాల్డ్ అనే పత్రిక పేర్కొంది. అయితే ఫిక్సింగ్‌లో ఈ ఆటగాళ్ల పాత్రను అటు ఐసీసీ ఇటు న్యూజిలాండ్ క్రికెట్ ధృవీకరించలేదు. కానీ తమ సభ్యదేశాలకు చెందిన దేశవాళీ అవినీతి నిరోధక యూనిట్స్‌తో కొంతకాలంగా ఫిక్సింగ్ వ్యవహారాలపై కలిసి పనిచేస్తున్నట్టు ఐసీసీ పేర్కొ ంది. విచారణ కొనసాగుతోందని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది భారత్‌లో కివీస్ పర్యటన!
ముంబై: ప్రస్తుతం కొనసాగుతున్న దక్షిణాఫ్రికా పర్యటన ముగిశాక ధోని సేన వచ్చే జనవరి, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే కివీస్ జట్టు కూడా వచ్చే ఏడాది చివర్లో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.‘2014 అక్టోబర్, నవంబర్‌లో న్యూజిలాండ్ జట్టును భారత్‌లో పర్యటించేలా ప్రయత్నిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.