Key posts at the district
-
కావాల్సిన వారికే కీలక పోస్టులు!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే... అన్నచందంగా మారింది పరిపాలనలో కీలకమైన డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారం. ముఖ్య నేత ఆశీస్సులు పొందిన వారికి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యులకు ముడుపులు సమర్పించుకున్న వారికి పనితీరు, సీనియారిటీతో సంబంధం లేకుండా మంచి పోస్టులు కట్టబెడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మిగిలిన వారికి అప్రాధాన్య పోస్టులు ఇవ్వడం... లేదా జీఏడీకి కేటాయించి ఏ పనీ చెప్పకుండా కూర్చోబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం సోమవారం రాత్రి డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి బదిలీలు, పోస్టింగ్‌లపై రెండు జీవోలు జారీ చేసింది. అందులో సిఫారసులు చేయించినవారికి, కాసులిచ్చిన వారికి మంచి పోస్టింగ్‌లు ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన వారికి పనిష్మెంట్ పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్డీవోలుగా పనిచేసిన ఏడుగురు అధికారులకు ఇటీవల పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టిన కూటమి సర్కారు... ఇప్పుడు వారిని సీఆర్డీఏకి కేటాయించడం గమనార్హం.వంద మందికి పైగా జీఏడీకి: గత నెల 24వ తేదీన 30 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయగా, వారిలో 11 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోసారి 70 మందికిపైగా ఆర్డీవోలు, ఇతర కీలక స్థానాల్లో ఉన్న వారిని బదిలీ చేసినప్పుడు సుమారు 30 మందిని జీఏడీకి ఎటాచ్ చేసింది. వీరందరినీ జీఏడీకి పంపడానికి రాజకీయ కారణాలే తప్ప... మరే ఇతర కారణాలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 100 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లు జీఏడీకి ఎటాచ్ అయి ఉన్నారు. వారి సేవలు ఉపయోగించుకోకుండా, కావాలని రాజకీయ ముద్ర వేసి పక్కనపెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. సిఫారసులు, కాసులతోనే: మరోవైపు సీనియారిటీ, పనితీరుతో సంబంధం లేకుండా కొందరు ముఖ్య నేతను ప్రసన్నం చేసుకుని పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడో లూప్ లైన్లో ఉండి హఠాత్తుగా మంచి పోస్టింగ్‌లు దక్కించుకోవడానికి అదే కారణంగా కనిపిస్తోంది. ముఖ్య నేతను కలిసి భారీగా సమర్పించుకున్న వారికి కీలక పోస్టులు దక్కాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్డీవో పోస్టుల కోసం రూ.30 లక్షలకుపైగా కొందరు ఖర్చు చేసి పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. కొన్ని కీలకమైన ఆర్డీవో సీట్లకు అయితే ఏకంగా రూ.కోటి నుంచి రూ.మూడు కోట్లు కూడా ఖర్చు పెట్టి పోస్టింగ్‌లు దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో కీలకమైన ఆర్డీవో, ఇతర ముఖ్యమైన పోస్టింగుల్లో డిప్యూటీ కలెక్టర్లను నియమించడానికి భారీగా డబ్బు తీసుకుని సిఫారసులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సార్లొస్తారా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాస్థాయి కీలక పోస్టులలో ఇన్చార్జులు కొనసాగుతుండటంతో పాలనపై ప్రభావం పడుతోంది. ఖాళీలకు తోడు,ఉన్నతాధికారులు సెలవులో వెళ్లినప్పుడు ఒకే ఉన్నతాధికారి నాలుగైదు పోస్టుల కు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు అధికారులు ఏ పోస్టుకూ న్యాయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇదే పరిస్థి తి నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో స్తబ్దత ఏర్పడింది. జాయింట్ కలెక్టర్, అడిషనల్ జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకు న్న రొనాల్డ్ రోస్ ఈ నెల 15 నుంచి సెలవులో వెళ్లా రు. డీఆర్ఓ తప్ప అన్ని పోస్టులకు జడ్పీ సీఈఓ రా జారాం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబా ద్ ఆర్డీఓ యాదిరెడ్డి ఇన్చార్జి డీఆర్ఓగా వ్యవహరి స్తున్నారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ 19న తిరిగి విధుల లో చేరాలి. కానీ, ఆయన రాకపోవడంతో సెలవు పొ డిగించినట్లు ప్రచారం జరుగుతోంది.కలెక్టర్ క్యాంపు వర్గాలు మాత్రం రోస్ సోమవారం విధులలో చేరుతారని చెబున్నారు. పోలీసు బాస్ ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి కూడ ఈ నెల 15 నుంచి సెలవులో వెళ్లగా అడిషనల్ ఎస్పీ బాలునాయక్ ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల సెలవుపై చర్చ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన పీఎస్ ప్రద్యుమ్నను, బోధ న్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను జూన్ 17న ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రద్యుమ్న స్థానంలో ఎవరినీ ని యమించకుండా, అప్పటి జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావుకు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జులై 30న రొనాల్డ్ రోస్‌ను కలెక్టర్‌గా నియమితులయ్యారు.అదేరోజు జేసీ వెంకటేశ్వర్రావు సైతం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. మరోవైపు అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రి అనారోగ్య కారణాలతో ఏప్రిల్ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో ఆ పోస్టు కూడా ఖా ళీగా ఉంది. రోనాల్డ్ రోస్ జూలై 31న కలెక్టర్‌గా బా ధ్యతలు తీసుకొని సీఎం పర్యటన, సమగ్ర కుటుంబ సర్వేలో చురుకుగా పాల్గొని సీఎం ప్రశంసలు అందుకున్నారు. ఈ లోగా ఐఏఎస్‌ల విభజనలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ యన అక్కడి సీఎస్‌కు రిపోర్టు చేయడం అనివార్యం గా మారింది. రోస్‌ను డిప్యూటేషన్‌పై ఇదే జిల్లాలో కొ నసాగించే విషయమై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషిపై టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు అసంతృప్తిగా ఉండటమే కాకుండా, ఆయన వైఖరిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. జిల్లాలో జరిగిన 41 మంది ఎస్ఐల బదిలీలను ప్రభుత్వం నిలిపి వేయడంపై ఎస్పీ కొం త కలత చెందినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యం లో నే ఇద్దరు ఉన్నతాధికారులు సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.