kgbv students
-
భోజనం తినాలంటే భయమేస్తోంది
నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రతిరోజూ భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, ఆ తిండి తినలేక అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఉదయం అల్పాహారాన్ని బహిష్కరించి విద్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు. విద్యార్థినులు రోడ్డుపైకి వెళ్లి బైఠాయించేందుకు ప్రయత్నించగా స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) అమూల్య వారిని అడ్డుకుని గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ రమాదేవి, ఎస్సై రాజశేఖర్ పాఠశాలకు చేరుకుని మూసిఉన్న మెయిన్ గేట్‌ను తెరిపించి లోపలికి వెళ్లారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించకుండా నిత్యం కిచిడీ, టమాటా, నీళ్ల పప్పు, చాలీచాలని అన్నం పెడుతున్నారని విద్యార్థినులు రోదించారు. టిఫిన్ బాగుండడం లేదని ఎస్ఓకు చెబితే ‘ఇంటివద్ద టిఫిన్ తింటారా’ అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ టీచర్ పద్మ నుంచి సెల్‌ఫోన్ లాక్కొని తామందరినీ గదిలో నిర్బంధించారని సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఎస్ఓ అమూల్యపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లిలో ఇలానే ప్రవర్తించడంతో సస్పెన్షన్ వేటు పడిందని, మానవతా దృక్పథంతో నెన్నెలకు పంపిస్తే ఇక్కడా అదే పద్ధతి అయితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఓను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ, కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. -
అదరగొట్టారు..!
సాక్షి, హైదరాబాద్: వారంతా అభాగ్యులు.. ఆర్థికంగా, సా మాజికంగా ఏ ఆసరా లేని వా రే. కొందరు అనాథలైతే మరికొందరు ఏ చేయూత లేని, తల్లి లేదా తండ్రి లేని వారు.. ఇం కొందరైతే ఇళ్లు గడవక, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదు వు మానేసి ఆ తర్వాత మళ్లీ స్కూళ్లలో చేరిన వారు. పైగా అంతా బాలికలే.. ప్రభుత్వం, టీచర్లు, విద్యాశాఖ అధికారుల తోడ్పాటుతో రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయా (కేజీబీవీ)ల్లో చదువుకుంటున్న వా రు ఇంటరీ్మడియట్‌లో తమ సత్తాచాటారు. ఇ బ్బందులు, అసమానతలు తమ ప్రతిభకు అడ్డుకాదని నిరూపించారు. టీచర్ల పోత్సాహంతో మంచి మార్కులతో భేష్ అనిపించుకున్నారు. మట్టిలో మాణిక్యాలుగా.. ఇంటరీ్మడియట్ వొకేషనల్‌లో 1,000 మార్కులకు 977 మార్కులను (98 శాతం) సాధించి మంచిర్యాల జిల్లా తాండూరు కేజీబీవీ విద్యారి్థని సీహెచ్ చంద్రకళ కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులతోనూ పోటీ పడి అత్యధిక మార్కులు సాధించింది. కరీంనగర్ జిల్లా గాంధార కేజీబీవీ విద్యార్థిని ఎం.శిరీష, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ కేజీబీవీ విద్యార్థి ఇఖ్రా షహవర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేజీబీవీ విద్యారి్థని యు.అనూష 967 మార్కులు సాధించారు. వారే కాదు ఎంపీసీ, బైపీసీల్లోనూ 963 మార్కులతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేజీబీవీ విద్యారి్థని భూక్యా రజిత, 961 మార్కులతో గద్వాల కేజీబీవీ విద్యార్థి అంజలి, 957 మార్కులతో నల్లగొండ జిల్లా మునుగోడు కేజీబీవీ విద్యార్థి పి.అంకిత, సంగారెడ్డి జిల్లా ఆందోల్ కేజీబీవీ విద్యారి్థని ఎం.గంగ, 940 మార్కులతో నాగర్‌కర్నూల్ జిల్లా బాల్మూర్ కేజీబీవీ విద్యారి్థని చాపల శ్రీవాణి భేష్ అనిపించుకున్నారు. మట్టిలో మాణిక్యాలై వెలిగారు. ఇక ఈసారి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 88 కేజీబీవీ స్కూళ్ల నుంచి 4,483 మంది విద్యార్థినిలు హాజరుకాగా 3,531 మంది (78.76 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 170 స్కూళ్ల నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలకు 8,580 మంది విద్యార్థులు హాజరు కాగా 6,103 మంది (71.13 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మంత్రి సబిత, చిత్రారామ్‌చంద్రన్అ భినందనలు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ ఉత్తీర్ణత 68.86 శాతం కంటే కేజీబీవీలు ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ అభినందనలు తెలియజేశారు. ప్రథమ సంవత్సరంలోనూ రాష్ట్ర యావరేజ్ 60.01 శాతం కాగా కేజీబీవీల్లో ఉత్తీర్ణత 71.13 శాతముందని, అందుకు కృషి చేసిన టీచర్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఏడింటిలో 100% ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం, జనగామ జిల్లా పాలకుర్తి కేజీబీవీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ప్రథమ సంవత్సరంలో జనగామ జిల్లా పాలకుర్తి, భద్రాద్రి జిల్లా గుండాల, చర్ల, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ద్వితీయ సంవత్సరంలో 61 కేజీబీవీలు, ప్రథమ సంవత్సరంలో 79 కేజీబీవీలు 90 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి. పీవీ శ్రీహరి, కేజీబీవీల అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ -
కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, కేశంపేట : పాడైన కూరగాయలతో చేసిన వంటల కారణంగా ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాటిగడ్డలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని పాటిగడ్డ కస్తూర్బా పాఠశాలలో 262 మంది చదువుకుంటున్నారు. వీరికి నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నిర్వాహకులు మాత్రం తమ ఇష్టానుసారం వండిపెడుతన్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. ఈ భోజనం తిన్న బాలికలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు స్కూల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాష్‌బేషిన్ల వద్ద నాచు పేరుకుపోయింది. మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. పాఠశాల లోపల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ విషయమై కేజీబీవీ ప్రత్యేక అధికారి గౌసియాను అడగగా.. ఉదయం విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఆయాలు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. దీంతో మూత్రశాలలను శుభ్రం చేయలేదన్నారు. నాయకుల సందర్శన.. విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలు కుల సంఘాల నాయకులు కేజీబీవీని సందర్శించారు. వంటలు, కిచెన్, బాత్రూంలను పరిశీలించారు. పలువురు విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెనూ పాటించడం లేదని, బాత్రూంలను శుభ్రం చేయడం లేదని విద్యార్థులు వీరికి వివరించారు. ఇదిలా ఉండగా బాలికలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అందించిన వాటర్ ఫిల్టర్ నిరుపయోగంగా ఉంది. నిత్యం కేశంపేట, సంతాపూర్ నుంచి ఫిల్టర్ వాటర్ తెస్తున్నారు. -
వాచ్‌వుమన్ ఫోన్ పోయిందని విద్యార్థినులపై..
మోమిన్‌పేట: వాచ్‌ఉమన్ ఫోన్ పోయిందని కేజీబీవీ ప్రత్యేకాధికారి విద్యార్థినులను మిట్ట మధ్యాహ్నం ఎండలో బండలపై కూర్చోబెట్టింది. ఎండకు కాళ్లు కాలడంతో కదిలిన విద్యార్థినులను కర్రతో కొట్టింది. కాళ్లకు బొబ్బలు రావడంతో విద్యార్థినులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ సంఘటన మోమిన్‌పేటలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆదివారం సోమవారం వెలుగుచూసింది. విద్యార్థినుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని చంద్రా యన్‌పల్లిలో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాలలో దాదాపు 160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి నైట్ వాచ్‌ఉమన్ నర్సమ్మ ఫోన్ పోయింది. ఈ విషయం ఆదివారం ఉద యం ఆమె ప్రత్యేకాధికారి(స్పెషల్ ఆఫీసర్) శైలజకు తెలిపింది. దీంతో ఎస్ఓ విద్యార్థినులను పిలిచి ఫోన్ తీసుకొన్నవారు మర్యాదగా అప్పగించండి.. లేదంటే అందరికి మధ్యాహ్నం భోజనం బంద్ అంటూ బెదిరించింది. విద్యార్థులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఎండలో పాఠశాల ఆవరణలో బం డలు వేసిన ప్రదేశంలో వారిని కూర్చోబెట్టింది. ఎండకు తాళ లేక విద్యార్థినులు అంద రూ రూ.10 చొప్పున పోగేసి ఫోను కొనిస్తామని వేడుకున్నా ప్రత్యేకాధికారి వినిపించుకోలేదు. ఎండ వేడిమికి విద్యార్థులు కదలడంతో వారిని కర్రతో దండించింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ఎస్ఓ వారిని బెదిరించింది. కాళ్లకు బొబ్బలు రావడంతో ప్రత్యేకాధి కారి విద్యా ర్థులను సోమ వారం మండల కేంద్రం లోని ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం మధ్యాహ్నం నగరంలోని తన ఇంటికి వెళ్లిపోయింది. పాఠశాల ప్రత్యేకాధికారి శైలజ భర్త మధుసూదన్ సైతం తరచూ రాత్రి వేళలో పాఠశాలలోనే బస చేస్తాడని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి సైతం మధుసూదన్ వచ్చాడని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో పురుషులు హాస్టల్‌కు రాకూడదని, ఎస్ఓ భర్త తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, నైట్ వాచ్‌ఉమన్ నర్సమ్మ నిత్యం రాత్రి పాఠశాలకు కల్లు తీసుకొచ్చి తాగుతుందని విద్యార్థినులు ఆరోపించారు.రాత్రి సమయంలో బయటకు వెళ్లా ల్సి వచ్చినా.. ఆమె స్పందించేది కాదని చెప్పారు. వివరాలు సేకరించిన అధికారులు పాఠశాలలో జరిగిన సంఘటనపై పలువురు అధికారులు సోమవారం వివరాలు సేకరించారు. జిల్లా బాలికల, పిల్లల అభివృద్ధి అధికారి వసుం ధర, ఎంపీడీఓ శైలజారెడ్డి, ఎంఈఓ శంకర్ పాఠశాలను సందర్శించి జరిగిన సంఘటనను విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకొన్నారు. చిన్న విషయానికే కఠినంగా శిక్షించే ప్రత్యేకాధికారి తమకు వద్దని విద్యార్థులంతా అధికారులకు తెలిపారు. ప్రత్యేకారిని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయా లని కోరారు. ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. అయితే, ప్రత్యేకాధికారి శైలజను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించే యత్నం చేయగా ఫోన్ స్విఛాఫ్ వచ్చింది. ప్రత్యేకాధికారి సస్పెన్షన్ సోమవారం సాయంత్రం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ ఇబ్బందులను డీఈఓతో వెల్లబోసుకున్నారు. ప్రతి చిన్న విషయానికి ప్రత్యేకాధికారి శైలజ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఆమెను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. వివరాలు సేకరించిన డీఈఓ ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత
కొమురవెల్లి(సిద్దిపేట) : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ కస్తూరిబా బాలికల పాఠశాలలో 9 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో వారిని సోమవారం హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వివరాలు... మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులున్నారు. కాగా మూడు రోజుల క్రితం పూజిత అనే విద్యార్థిని దగ్గుతూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఇంటికి పంపించారు. పూజిత ఆదివారం తిరిగి కస్తూరిబా పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో పూజితతో కలిసి ఉన్న రూమ్‌లోని హారిక, శ్రీవాణిలకు తీవ్రమైన దగ్గు సోకింది. దీంతో పూజితతో పాటు హారిక, శ్రీవాణిలను చికిత్స కోసం స్థానిక ఆర్ఎంపీల వద్దకు తీసుకెళ్లారు. ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటనే వారిని పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ రాములు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషయమించడంతో వారిని వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. 6వ తరగతికి చెందిన కె. పూజిత, సీహెచ్.అంజలి, 7వ తరగతి చదివే ఈ.అంజలి, ఏ.రేఖ, జి.అశ్విత, 8వ తరగతి చదువుతున్న పి. భాను, ఎస్.అంబికలతో పాటు హైదరాబాద్‌కు తరలించిన 7వ తరగతి విద్యార్థిని టి.హరిక, 8వ తరగతికి చెందిన శ్రీవాణిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కస్తూరిబా పాఠశాలలో ఆదివారం ఉదయం విద్యార్థులకు చపాతీ, మధ్యాహ్నం చికెన్, రాత్రి క్యాబేజీ వండి పెట్టారు. ఉదయం అల్పాహారం కోసం పులిహోర చేసి పెట్టారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నీరజను వివరణ కోరగా కేజీబీవీ పాఠశాల చుట్టూ వరి పొలాలకు వాడిన రసాయన ఎరువుల ప్రభావగంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ భిక్షపతి పాఠశాలకు చేరుకుని మిగతా విద్యార్థులకు వ్యాధి సోకకుండా స్థానిక పీహెచ్సీ వైద్యులతో మాట్లాడి మందులను పంపిణీ చేశారు. అందరికీ మాస్క్‌లు అందించారు. -
నిస్సత్తువ
- కేజీబీవీ విద్యార్థినులను వేధిస్తున్న రక్తహీనత - 31 మందిలో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ శాతం - 8,130 మందిలో సాధారణం కంటే తక్కువ అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థినుల్లో అధిక శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కేజీబీవీల్లో చదువుతున్న అమ్మాయిల్లో సమస్య మరీ ఎక్కువగా ఉంది. తరచూ వైద్య పరీక్షలు చేసి.. రక్తహీనతను నివారించాల్సిన అధికారులు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 6–18 ఏళ్ల బాలికల్లో హిమోగ్లోబిన్ శాతం 11.5 నుంచి 16 శాతం మధ్య ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అమ్మాయిల్లో 12 ఏళ్లు మొదలుకుని 18 ఏళ్లు వచ్చేసరికి శారీరకంగా పలు మార్పులు జరుగుతాయి. హార్మోన్ల పనితీరు చురుగ్గా అవుతుంది. పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. హిమోగ్లోబిన్ శాతం తక్కువ కాకుండా చూసుకోవాలి. అయితే.. కేజీబీవీల విద్యార్థినుల పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతోంది. అనాథ, పేద, డ్రాపౌట్స్ బాలికల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీల నిర్వహణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వీటిల్లో చదువుతున్న బాలికలంతా నిరుపేదలే. వీరిని దృష్టిలో ఉంచుకుని పౌష్టికారంతో కూడిన ప్రత్యేక మెనూను రూపొందించారు. ఇది కచ్చితంగా అమలైతే రక్తహీనత సమస్యే ఉత్పన్నం కాదు. జిల్లా వ్యాప్తంగా 31 మంది కేజీబీవీ విద్యార్థినుల్లో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ శాతం ఉంది. 8,130 మందిలో ఏడు కంటే పైన, సాధారణ కంటే తక్కువగా ఉంది. తరగతుల వారీగా చూస్తే ఏడు గ్రాములకంటే తక్కువ ఉన్న విద్యార్థినులు ఆరో తరగతిలో తొమ్మిది మంది, ఏడులో ఐదుగురు, ఎనిమిదో తరగతిలో తొమ్మిది మంది, టెన్త్‌లో ముగ్గురు ఉన్నారు. అలాగే 7–11 శాతం ఉన్న బాలికలు ఆరో తరగతిలో 1,640 మంది, ఏడులో 1,821 మంది, ఎనిమిదిలో 1,748 మంది, తొమ్మిదిలో 1,508 మంది, పదో తరగతిలో 1,413 మంది ఉన్నారు. ఈ లెక్కలు చూస్తుంటే అమ్మాయిలకు పౌష్టికాహారం అందడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆరో తరగతిలో కొత్తగా చేరిన అమ్మాయిల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వారు పదో తరగతికి వచ్చేసరికి నాలుగేళ్లు పూర్తవుతుంది. పౌష్టికాహారం అందించి ఉంటే ఆలోపైనా వారి పరిస్థితి మెరుగుపడేది. కానీ అలా జరగలేదు. నిర్వహణ బిల్లులు సక్రమంగా ఇవ్వలేదన్న సాకుతో మెనూకు మంగâýæం పాడుతున్నారు. దీనిపై సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు ఆఫీసర్ దశరథరామయ్యను వివరణ కోరగా.. విద్యార్థినుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక కార్యక్రమం చేపడతామన్నారు. త్వరలోనే మరోసారి వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పారు. అలాగే మెనూ సక్రమంగా అమలు చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రెజ్లింగ్‌లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక కలిగిరి : కలిగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో జరిగిన రెజ్లింగ్(కుస్తీ) పోటీల్లో సత్తాచాటారు. స్థానిక కేజీబీవీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు గురువారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఈటీ కే.కిరణ్మయి మాట్లాడుతూ విజయవాడ సమీపంలోని పేళ్లప్రోలులో ఈ నెల 12 నుంచి 14 వరకు రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు జరిగాయని, 66 కేజీల విభాగంలో పి.అన్విత, 43 కేజీల విభాగంలో ఎస్కే తస్లీమ ప్రథమ స్థానంలో, 38 కేజీల విభాగంలో ఎన్సుజిత ద్వితీయ స్థానంలో, 49 కేజీల విభాగంలో ఆర్.వెంగమ్మ తతీయ స్థానంలో నిలిచారని తెలిపారు. నవంబర్‌లో పుణేలో నిర్వహించే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనడానికి పి.అన్విత, ఎస్కే.తస్లీమ ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
‘కస్తూర్బా’కు చలిజ్వరం
కళ్లు తిరిగి పడిపోతున్న విద్యార్థినులు సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స 8 మందికి పైగా జ్వరాలు మునిపల్లి: తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చలి జ్వరం పట్టుకుంది. ఉన్నట్టుండి విద్యార్థినులు కళ్లు తిరిగి పడిపోతున్నారు. కొందరైతే శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కృష్ణవేణి అనే విద్యార్థినిని శ్వాసతీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. తాటిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్ సంగారెడ్డికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆ విద్యార్థినిని హుటాహుటిన సంగారెడ్డికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోందని పాఠశాల ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. మరో ఐదుగురు విద్యార్థినులు చలి జ్వరంతో బాధ పడుతున్నారు. వారిని కూడా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా ఒకరి తరువాత ఒకరు కళ్లు తిరిగి పడిపోతుండటంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. జ్వరంతో తీవ్రంగా బాధపడుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తున్నట్టు వారు తెలిపారు. -
ఎమ్మెల్యే గారు.. మా సమస్యలు వినండి
‘కొప్పుల’తో కేజీబీవీ విద్యార్థుల మొర ధర్మపురి : ‘ఎమ్మెల్యే గారు.. మా సమస్యలు వినండి.. ఇబ్బందులు తీర్చండి.. ఒక్కసారి వినరా..’ అంటూ ధర్మపురి కసూర్తిబా పాఠశాల విద్యార్థినులు ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌తో తమ గోడు వెల్లబోసుకున్నారు. పాఠశాలలో భోజనం సరిగా పెట్టడంలేదని, వంట మనిషి లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సరిపడా ఫిల్టర్ నీరందించడం లేదని తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు నిత్యం బెత్తంతో కొడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారినుంచి తమను రక్షించాలని కన్నీరు పెట్టుకున్నారు. వారు తమకు వద్దంటూ ప్రాథేయపడ్డారు. సరిపడా ఉపాధ్యాయులు లేరని వివరించారు. స్పందించిన చీఫ్ విప్ ఈశ్వర్ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చదువుపై దృష్టిసారించాలని సూచించారు. సమస్యలపై ప్రిన్సిపాల్ చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగనివ్వమని, నాణ్యమైన భోజనం ప్రిన్సిపాల్‌హామీ ఇచ్చారు.