సాక్షి, హైదరాబాద్: వారంతా అభాగ్యులు.. ఆర్థికంగా, సా మాజికంగా ఏ ఆసరా లేని వా రే. కొందరు అనాథలైతే మరికొందరు ఏ చేయూత లేని, తల్లి లేదా తండ్రి లేని వారు.. ఇం కొందరైతే ఇళ్లు గడవక, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదు వు మానేసి ఆ తర్వాత మళ్లీ స్కూళ్లలో చేరిన వారు. పైగా అంతా బాలికలే.. ప్రభుత్వం, టీచర్లు, విద్యాశాఖ అధికారుల తోడ్పాటుతో రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయా (కేజీబీవీ)ల్లో చదువుకుంటున్న వా రు ఇంటరీ్మడియట్‌లో తమ సత్తాచాటారు. ఇ బ్బందులు, అసమానతలు తమ ప్రతిభకు అడ్డుకాదని నిరూపించారు. టీచర్ల పోత్సాహంతో మంచి మార్కులతో భేష్ అనిపించుకున్నారు.
మట్టిలో మాణిక్యాలుగా..
ఇంటరీ్మడియట్ వొకేషనల్‌లో 1,000 మార్కులకు 977 మార్కులను (98 శాతం) సాధించి మంచిర్యాల జిల్లా తాండూరు కేజీబీవీ విద్యారి్థని సీహెచ్ చంద్రకళ కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులతోనూ పోటీ పడి అత్యధిక మార్కులు సాధించింది. కరీంనగర్ జిల్లా గాంధార కేజీబీవీ విద్యార్థిని ఎం.శిరీష, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ కేజీబీవీ విద్యార్థి ఇఖ్రా షహవర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేజీబీవీ విద్యారి్థని యు.అనూష 967 మార్కులు సాధించారు. వారే కాదు ఎంపీసీ, బైపీసీల్లోనూ 963 మార్కులతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేజీబీవీ విద్యారి్థని భూక్యా రజిత, 961 మార్కులతో గద్వాల కేజీబీవీ విద్యార్థి అంజలి, 957 మార్కులతో నల్లగొండ జిల్లా మునుగోడు కేజీబీవీ విద్యార్థి పి.అంకిత, సంగారెడ్డి జిల్లా ఆందోల్ కేజీబీవీ విద్యారి్థని ఎం.గంగ, 940 మార్కులతో నాగర్‌కర్నూల్ జిల్లా బాల్‌మూర్ కేజీబీవీ విద్యారి్థని చాపల శ్రీవాణి భేష్ అనిపించుకున్నారు. మట్టిలో మాణిక్యాలై వెలిగారు. ఇక ఈసారి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 88 కేజీబీవీ స్కూళ్ల నుంచి 4,483 మంది విద్యార్థినిలు హాజరుకాగా 3,531 మంది (78.76 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 170 స్కూళ్ల నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలకు 8,580 మంది విద్యార్థులు హాజరు కాగా 6,103 మంది (71.13 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
మంత్రి సబిత, చిత్రారామ్‌చంద్రన్అ భినందనలు
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ ఉత్తీర్ణత 68.86 శాతం కంటే కేజీబీవీలు ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ అభినందనలు తెలియజేశారు. ప్రథమ సంవత్సరంలోనూ రాష్ట్ర యావరేజ్ 60.01 శాతం కాగా కేజీబీవీల్లో ఉత్తీర్ణత 71.13 శాతముందని, అందుకు కృషి చేసిన టీచర్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు.
ఏడింటిలో 100% ఉత్తీర్ణత
ద్వితీయ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం, జనగామ జిల్లా పాలకుర్తి కేజీబీవీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ప్రథమ సంవత్సరంలో జనగామ జిల్లా పాలకుర్తి, భద్రాద్రి జిల్లా గుండాల, చర్ల, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ద్వితీయ సంవత్సరంలో 61 కేజీబీవీలు, ప్రథమ సంవత్సరంలో 79 కేజీబీవీలు 90 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి. పీవీ శ్రీహరి, కేజీబీవీల అదనపు ప్రాజెక్టు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment