ఎమ్మెల్యే గారు.. మా సమస్యలు వినండి | pls lesition our problems | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గారు.. మా సమస్యలు వినండి

Published Tue, Jul 19 2016 9:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

pls lesition our problems

  • ‘కొప్పుల’తో కేజీబీవీ విద్యార్థుల మొర
  • ధర్మపురి : ‘ఎమ్మెల్యే గారు.. మా సమస్యలు వినండి..  ఇబ్బందులు తీర్చండి.. ఒక్కసారి వినరా..’ అంటూ ధర్మపురి కసూర్తిబా పాఠశాల విద్యార్థినులు ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌తో తమ గోడు వెల్లబోసుకున్నారు. పాఠశాలలో భోజనం సరిగా పెట్టడంలేదని, వంట మనిషి లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సరిపడా ఫిల్టర్‌ నీరందించడం లేదని తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు నిత్యం బెత్తంతో కొడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారినుంచి తమను రక్షించాలని కన్నీరు పెట్టుకున్నారు. వారు తమకు వద్దంటూ ప్రాథేయపడ్డారు.  సరిపడా ఉపాధ్యాయులు లేరని వివరించారు.
     స్పందించిన చీఫ్‌ విప్‌ ఈశ్వర్‌ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చదువుపై దృష్టిసారించాలని సూచించారు. సమస్యలపై ప్రిన్సిపాల్‌ చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగనివ్వమని, నాణ్యమైన భోజనం ప్రిన్సిపాల్‌హామీ ఇచ్చారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement