సాయుధ దళాలకు ఖాదీ
న్యూఢిల్లీ: సాయుధ దళాల సిబ్బందికి త్వరలోనే ఖాదీ యూనిఫారాలు అందించనున్నామని, ఇందుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేశామని లోక్సభలో శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే వెల్లడించారు. ఖాదీ విలేజస్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) విన్నపం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. దుస్తులకు సంబంధించిన నమూనాలను కేవీఐసీకి పంపామని తెలిపారు. సైన్యంలో సోషల్ మీడియా వినియోగంపై భారత ఆర్మీ కొత్త విధివిధానాలను రూపొందించిందని తెలిపారు.