khajur fruit
-
అది పాము కళేబరం కాదు.. ప్లాస్టిక్
చిత్తూరు: గర్భిణికి పంపిణీ చేసిన పౌష్టిక ఆహారంలోని ఎండు ఖర్జూజ ప్యాకెట్లో వచ్చింది పాము కళేబరం కాదని, అది ప్లాస్టిక్ అని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ స్పష్టం చేశారు. మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టిక ఆహారంలో పాము కళేబరం అంటూ బుధవారం పచ్చ పత్రికల్లో, చానళ్లలో వార్తలు ప్రచురితమైయ్యాయి. దాంతో ఐసీడీఎస్ పీడీ శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు. పౌష్టికాహారం అందుకున్న గర్భిణి మానసను విచారించారు. ఈ నెల నాలుగో తేదీ పంపిణీ చేశారనీ, అందులో ఎండు ఖర్జూరం ఫ్యాకెట్‌ను మంగళవారం తెరిచినట్లు ఆమె తెలిపింది. అందులో పాము లాంటి వస్తువు ఉండడంతో ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త జానకి దృష్టికి తీసుకు వెళ్లినట్లు పేర్కొంది. తరువాత ఎండు ఖర్జూరం ప్యాకెట్లో పాము లాంటి వస్తువును చేతిలోకి తీసుకుని కళేబరమా లేక ఇతర వస్తువేదైనా అని పరిశీలించారు. దాని వాసన చూశారు. చేతిలో పట్టుకుని గట్టిగా విరిచారు. విరగక పోవడంతో పాము కళేబరం కాదని నిర్థారించారు. పీడీ మాట్లాడుతూ పాము కళేబరం ఐతే తునిగి ముక్కలుగా విరిగిపోయేదన్నారు. ప్యాకింగ్ సమయంలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఎండు ఖర్జూజంతో ఫ్యాక్ అయిందని అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యాకెట్లో ఉన్న వస్తువు గట్టిగా అంగుళంపైగా ఉందని, అక్కడక్కడ పచ్చచుక్కలు కలిగి ఉందని, ల్యాబ్‌కు పంపుతామన్నారు. అంగన్వాడీ సిబ్బంది పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పాము కళేబరం ఫ్యాకెట్లో ఉంటే వాసన వచ్చేదన్నారు. పచ్చపత్రికలు ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేయడం గర్హనీయమని తెలిపారు. -
ఖర్జూర సాగులో లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
కొంపముంచిన జీడిపప్పు ఆశ
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఉచితంగా జీడిపప్పు పొందాలన్న కక్కుర్తి ఆ అధికారి కొంప ముంచేసింది. ఓ వ్యాపారికి జీడిపప్పు ప్యాకెట్ కోసం మార్కెటింగ్‌శాఖ డీడీ హుకుం జారీ చేస్తే మాట చెల్లలేదు. సరే నీ సంగతి చూస్తానని ఆ విషయం మనసులో పెట్టుకున్న సదరు అధికారి వద్దకు వ్యాపారి రానే వచ్చాడు. ఏం ఇన్నాళ్లకు గుర్తొచ్చానా... రూ.10 వేలు ఇస్తేనే సంతకం పెడతానని మెలిక పెట్టడంతో ఆ వ్యాపారి ఏసీబీ అస్త్రాన్ని సంధించి కటకటాల వెనక్కి పంపాడు. అధికారికి సహకరించిన మరో ఉద్యోగి కూడా కటకటాల పాలయ్యాడు. గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో చర్చనీయాంశమైన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గోపాలపట్నంలో ఉన్న ప్రాంతీయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఎస్టీ నాయుడు విధులు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందేందుకు జీడీపప్పు ఇవ్వాలని భావించాడు. అందుకోసం కంచరపాలెం కేంద్రంగా విశాఖ, విజయవాడకు జీడిపప్పు అమ్మకాలు జరిపే జగన్నాథరావు అనే వ్యాపారిని కేజీ జీడిపప్పు పంపాలని కోరాడు. డబ్బులివ్వకుండా జీడిపప్పు ఇవ్వలేనని ఆ వ్యాపారి చెప్పేయడంతో నాయుడు సిగ్గుపడిపోయాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటిన సేల్ పర్మిట్ పుస్తకం కోసం జగన్నాథరావు మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి వచ్చాడు. జగన్నాథరావుని చూడగానే ఎస్టీ నాయుడుకి జీడిపప్పు సంగతి గుర్తొచ్చింది. ఏం బాబూ... మా అవసరం ఇప్పుడొచ్చిందా... ఇపుడు నువ్వడిగింది ఇవ్వడానికి తీరిక లేదు... మళ్లీ రా అని రెండుమూడుమార్లు తిప్పారు. ఈ నెల 9న మళ్లీ కార్యాలయానికి వచ్చిన జగన్నాథరావు ఏమిస్తే సేల్ పర్మిట్ పుస్తకం ఇస్తారో చెప్పాలని అడగడంతో... రూ.10వేలు ఇవ్వాలని నాయుడు డిమాండ్ చేయడంతో సరేనని ఆ వ్యాపారి వెళ్లిపోయాడు. అనంతరం నేరుగా ఏసీబీ డీఎస్పీ కేవీ రామకృష్ణప్రసాద్‌ని ఆశ్రయించడంతో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఐలు గొలగాని అప్పారావు, ఎస్.రమేష్, ఎస్కే గఫూర్, ఎంవీ రమణమూర్తి జగన్నాథరావుని పంపి ట్రాప్ చేశారు. తెచ్చిన డబ్బులివ్వడానికి ప్రయత్నించిన జగన్నాథరావుని చూసి... సూపర్వైజర్ బంగారురాజుకి ఇచ్చి వెళ్లు అని ఎస్‌టీనాయుడు చెప్పడంతో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. డబ్బులు తీసుకున్న బంగారురాజుతో పాటు ఎస్‌టీనాయుడుని అరెస్టు చేశారు. వీరి నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. ఎస్‌టీనాయుడు, బంగారురాజుని అరెస్టు చేశామని డీఎస్పీ రామకృష్ణప్రసాద్ చెప్పారు. ఏసీబీ దాడి జరిగిందన్న విషయం తెలియడంతో మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి ఆ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఏడీ కాళేశ్వరరావు చేరుకున్నారు. వారి నుంచి డీడీ విధులు, ప్రవర్తనపై డీఎస్పీ వివరాలు సేకరించారు. -
ఎడారుల్లో కల్పవృక్షం
తిండి గోల ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో ఇతమిత్థంగా తెలియదు కానీ, ప్రాచీన కాలం నుంచే ఖర్జూర పండ్లను ఆహారంగా వినియోగిస్తున్నాం. రంగు, రుచి, ఆకారాలని బట్టి వీటిలో చాలా రకాలున్నాయి. కొలరాడో నదీతీరాన ముదురు రంగులో, నున్నగా ఉండే మెడ్జూల్ రకానికి చెందిన డేట్స్‌కి కింగ్ ఆఫ్ డేట్స్ అని పేరు. తరువాతి స్థానం గుండ్రంగా, మృదువుగా, తియ్యగా ఉండే బార్హీ రకానిది. దీన్ని హనీబాల్ అంటారు. ఇంకా అచ్చం తేనెలా ఉండే హనీ, నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే బ్లాక్ డేట్స్, బంగారు రంగులో ఉండే గోల్డెన్ ప్రిన్సెస్... ఇలా ఎన్నో రకాలున్నాయి. వేసవిలో ఎండు ఖర్జూరం వేసిన నీళ్లు తాగిస్తే పిల్లలకు మంచిది. స్వీట్లు, పుడ్డింగులు, కేకులు, డెజర్టుల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే. రమ్జాన్ ఉపవాస దీక్ష విరమణకు ముస్లిమ్‌లు ఖర్జూరానికే ప్రాధాన్యత ఇస్తారు.