khammam district bandh
-
TS Election 2023: ఎప్పుడు విలక్షణ తీర్పే.. కొత్తగూడెంలో ఉత్కంఠ!
ఖమ్మం: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విలక్షణమైన తీర్పు వచ్చేది కొత్తగూడెం నియోజకవర్గంలోనే. కొత్త పార్టీల తరుపున పోటీచేసే అభ్యర్థులకు ఎప్పుడు భారీగానే ఓట్లు వచ్చేవి. ఆది నుండి ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో కొత్తగూడెం నియోజకవర్గం జిల్లా కేంద్రం. దాంతో ఇక్కడ జనరల్ స్థానం కావటంతో కొత్తగూడెం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ సీటుగా మారిపోయింది. జనరల్ సీటు కావటంతో కీలకమైన నేతల చూపుంతా కొత్తగూడెంపైనే దృష్టి సారించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే అధిష్టానం మరోసారి బీఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది. మరోవైపు కాంగ్రెస్ నుండి ఎడవల్లి క్నష్ణ, మాజీ ఎంఎల్సీ పోట్ల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి కచ్చితంగా పోటీ చేసేది, అందరిని సమన్వయం చేసుకుని నిలిచి గెలిచేది ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొదటి స్థానం కొత్తగూడెం అవుతుంది అని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం కావడంతో పల్లె ఓటర్లతో పాటు కొత్తగూడెం, పాల్వంచ లాంటి పట్టణాలు ఉండడంతో పట్టణ ఓటర్లు కూడా అధికంగానే ఉంటారు. సింగరేణి, కేటిపిఎస్, స్పాంజ్ ఐరన్, నవభారత్ లాంటి పరిశ్రమల ఉద్యోగులు ఎక్కువ శాతం పట్టణాల్లో నివసిస్తూ ఉంటారు. కాబట్టి కొత్తగూడెం, పాల్వంచ మండలాలు అత్యధికంగా ఓటింగ్ ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా పంచాయతీ పరంగా చూసుకుంటే సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం గ్రామపంచాయతీ ఓట్ల పరంగా ప్రభావితం చేస్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టు అత్యంత రమణీయం.. కొత్తగూడెం నియోజకవర్గం ముఖ్యంగా అధిక బొగ్గునిక్షేపాలు కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో సింగరేణికి సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అంతేకాకుండా నవభారత్, స్పాంజ్ ఐరన్, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కూడా కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో ఉన్నాయి. పర్యాటక పరంగా చూసుకుంటే పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు అత్యంత రమణీయంగా చుట్టూ కొండల మధ్య ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారానే కొత్తగూడెం,పాల్వంచ పట్టణాలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ.. గడచిన కొంతకాలంగా కొత్తగూడెంలో రాజకీయ పరిస్థితులు మారాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు కూడా కొత్తగూడెం నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. జీఎస్ఆర్ ట్రస్టు ద్వారా పలు కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన జలగం వెంకట్రావు తాను కూడా కేసీఆర్ వెంటే ఉంటూ పార్టీలో పనిచేస్తానని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో కొత్తగూడెంలో రాజకీయ పరిస్థితులు మరికొంత కాలంలో ఇంకా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. దాంతో ఎవరి క్యాడర్ని వాళ్లు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
భద్రాద్రిని ఆంధ్రలో కలపొద్దు
ఖమ్మం, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపవద్దని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఖమ్మం జిల్లా బంద్ విజయవంతమైంది. భద్రాచలం డివిజన్ పరిరక్షణ కోసం టీఆర్ఎస్, సీపీఐ, సీసీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ, లోక్‌సత్తా, టీడీపీలతోపాటు కులసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జిల్లా బంద్‌లో పాల్గొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. జిల్లావ్యాప్తంగా నిరసనలు, సీఎం కిరణ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భద్రాద్రిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఈ సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భద్రాద్రిని సీమాంధ్రలో కలుపొద్దని ఈ సందర్భంగా పలువురు నేతలు డిమాండ్ చేశారు.