భద్రాద్రిని ఆంధ్రలో కలపొద్దు
ఖమ్మం, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపవద్దని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఖమ్మం జిల్లా బంద్ విజయవంతమైంది.
భద్రాచలం డివిజన్ పరిరక్షణ కోసం టీఆర్‌ఎస్, సీపీఐ, సీసీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ, లోక్‌సత్తా, టీడీపీలతోపాటు కులసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జిల్లా బంద్‌లో పాల్గొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. జిల్లావ్యాప్తంగా నిరసనలు, సీఎం కిరణ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భద్రాద్రిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఈ సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భద్రాద్రిని సీమాంధ్రలో కలుపొద్దని ఈ సందర్భంగా పలువురు నేతలు డిమాండ్ చేశారు.