khariff plantation
-
ఎట్టకేలకు కరువు నివేదిక
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు కరువు నివేదిక సిద్ధమవుతోంది. నెలాఖరులోగా ప్రభుత్వానికి పంపించేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏయే మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందన్న విషయంపై ఇప్పటికే వివరాలు సేకరించారు. వాటితో పాటు జిల్లాలో ఖరీఫ్ పంట పరిస్థితులపై నివేదికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో కరువు మండలాలను ఎట్టకేలకు కరువు నివేదికమగుర్తించి నెలాఖరులోగా నివేదికను పంపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో పంట నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల నుంచి వచ్చిన రిపోర్టులను కేంద్రానికి సత్వరం సమర్పించాల్సి ఉందన్నారు. అనంతరం కరువు ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర కమిటీ వస్తుందని తెలిపారు. ఆ కమిటీ పరిశీలించి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు కరువు నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిపోయిన సగానికి పైగా మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు. సుమారు లక్ష హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయని సాగుపనులకు రైతులు సిద్ధమయ్యారు. జిల్లాలో 50 శాతానికిపైగా వ్యవసాయం వర్షాధారంగానే చేపడతారు. అయితే ఆశించిన విధంగా వర్షాలు అనుకూలించలేదు. దాదాపుగా 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు, పెదబయలు, గూడెంకొత్తవీధి మండలాల్లో మాత్రం అత్యధిక వర్షం కురిసింది. దీంతో మొత్తంగా 56 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు. 30 మండలాల్లో కరువు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో దాదాపుగా 30 మండలాల్లో కరువు నెలకొంది. ఆగస్టు 30 వరకు ఉన్న వర్షపాతాన్ని మండలాల వారీగా పరిశీలించి తదనుగుణంగా కరువు అంచనాలను సిద్ధం చేయాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోడానికి ఆస్కారం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకు అంతా సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. దీంతో వర్షపాతం వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికి కూడా కరువు నివేదిక సిద్ధం కాలేదు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్య ఆర్డీవోల నుంచి వర్షపాతం వివరాలను సేకరించాలని భావించారు. అయితే అవి కచ్చితంగా ఉంటాయా? లేదా? అన్న విషయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరువు నివేదికను తయారు చేయలేదు. మంగళవారం నాటి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జేసీ ప్రవీణ్‌కుమార్, డీఆర్వో వెంకటేశ్వరరావు, నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేతతయాతియో పాల్గొన్నారు. -
అన్నదాతకు కష్టకాలం
పరిగి, న్యూస్‌లైన్: జిల్లాలోనే రెండో అతి పెద్ద జలాశయం లఖ్నాపూర్ ప్రాజెక్టు. ఇప్పుడిది నీరులేక వెలవెలబోతోంది. 2010లో కురిసిన వర్షాలతో ఆ తర్వాతి రెండేళ్లలో ఆయకట్టులో రెండు పంటలు పండగా గత ఏడాది నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం కురిసిన ఓ మోస్తరు వర్షాలతో ప్రాజెక్టులోకి కొద్దిపాటి నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు కింద ఖరీఫ్ సాగుకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ సంవత్సరం ప్రాజెక్టులోకి నీరు రాకపోవడంతో పరిగి మండలానికి చెందిన లఖ్నాపూర్, మిట్టకోడూర్ గ్రామాలతోపాటు ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్, రాజాపూర్, ఐనాపూర్ తదితర ఎనిమిది గ్రామాల ఆయకట్టు రైతులకు శాపంలా పరిణమించింది. గణనీయంగా తగ్గిన వర్షపాతం ఈ సంవత్సరం గణనీయంగా తగ్గిన వర్షపాతం లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ పెద్ద వర్షాలు కురవక పోవడం, పడిన ఒకటిరెండు తుపాన్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో చెరువులోకి నీరు చేరలేదు. వర్షాకాలంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 839 మిల్లీమీటర్లు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 585 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు అడుగు నీరు కూడా చేరలేదు. దీంతో 2,600 ఎకరాల ఆయకట్టు మొత్తం ఖరీఫ్ ప్రారంభించకుండానే ముగించాల్సి వస్తోంది. వర్షాకాలం ముగుస్తుండటం, వర్షాలు కురిసే అవకాశాలు కనిపించకపోవడంతో ఇక రబీపై కూడా రైతన్నలు ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. రెండు పంటలకూ నిరాశే.. ఖరీఫ్‌లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే వరి సాగు చేద్దామనుకున్న రైతుకు నిరాశే మిగిలింది. కురిసిన వర్షాలు మెట్టపంటలకే సరిపోయాయి. చెరువుల్లోకి నీరు చేరటానికి సరిపోలేదు. కాస్త ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండితే రబీతోపాటు వేసవిలో వరి పండించుకోవచ్చని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగులుతోంది. ఇకపై పెద్ద వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులోకి నీరుచేరే పరిస్థితి కనిపించడంలేదు. రూ.12 కోట్లకు పైగా నష్టం సాగు సాధ్యం కాకపోవడంతో రైతుకు ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి భారీగా నష్టం వాటిల్లనుంది. ఒక సీజన్లో ప్రాజెక్టు ఆయకట్టులో వరి సాగు చేస్తే రూ.6 కోట్ల పైచిలుకు విలువచేసే ధాన్యం పండుతుందని, రెండు సీజన్లలో కలిపి రూ.12 కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.