Khiladi 786
-
అక్షయ్‌కుమార్‌తో తమన్నా.. ఎంటర్టైన్మెంట్
కలువ కళ్ల భామలు... కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో వయ్యారాల సింగారాలు ఒలికిస్తుంటే... వారి మధ్యలో నుంచి ఓ వాయిస్... ‘హాయ్... హౌ ఆర్ యూ!’. ఈ పలుకరింపుతో అక్కడ ఒక్కసారిగా జోష్ డబుల్ అయింది. అమ్మాయిలు... అబ్బాయిలు... అమాంతం కూర్చున్న కుర్చీల పైకి ఎక్కేశారు. డెనిమ్ జాకెట్... మ్యాచింగ్ ప్యాంట్... మైల్డ్ కూలింగ్ గ్లాసెస్... పొట్టి జుట్టు. ఎదురుగా ఉన్నది ఎవరు! బాలీవుడ్ కింగ్... యాక్షన్ సినిమాల సూపర్‌స్టార్... అక్షయ్‌కుమార్ కెమెరా ఫ్లాష్ల్లో మెరిసిపోతున్నాడు. ఆ పక్కనే... బ్లూ టాప్... ఫ్లోరల్ లెగ్గీలో మిల్కీ బ్యూటీ.. కళల రాణి తమన్నా తళుక్కుమంటోంది. ఇంకేముంది... కుర్రకారు కేరింతలు కొట్టారు. అక్షయ్... అక్షయ్... టాప్ లేచిపోయేలా కోరస్ పలికారు. ‘ఎంటర్టైన్మెంట్’... త్వరలో రిలీజ్ కానున్న అక్షయ్‌కుమార్, తమన్నాల చిత్రం ఇది. ఇందులోని సూపర్‌హిట్ సాంగ్... జానీ... జానీ... డీజే ప్లే చేస్తుంటే... విద్యార్థులతో కలిసి ‘ఖిలాడీ’ స్టెప్పులతో అదరగొట్టాడు. స్వీటీ తవున్నా జత కలిసింది. బిగ్‌స్క్రీన్ స్టార్లు కళ్లెదుటే దుమ్ము లేపుతుంటే.. మగువలు మైమరిచిపోయూరు. కుర్రాళ్లు ఈలలేసి గోల చేశారు. సోమాజిగూడ హోటల్ పార్క్‌లో సోమవారం హామ్స్టెక్ ఫ్రెషర్స్ డే... అక్షయ్, తమన్నా, ప్రకాష్‌రాజ్ రాకతో ఉత్సవంలా వూరింది. ఫ్యాషన్ స్టేట్మెంట్ అక్షయ్‌ను ఫ్యాషన్‌పై స్టేట్మెంట్ ఇమ్మని అడిగితే... ‘వునకు నచ్చింది... సౌకర్యవంతంగా ఉన్నదే ఫ్యాషన్’ అంటూ ఒక్క ముక్కలో తేల్చేశాడు. అంతకుముందు జరిగిన ‘ఎంటర్టైన్మెంట్’ ప్రమోషన్ కార్యక్రమంలో అక్షయ్, తమన్నా, ప్రకాష్‌రాజ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. షీ ఈజ్ బ్యూటిఫుల్... ‘ఈ సినిమా టోటల్‌గా కొత్త కాన్సెప్ట్. కుక్కది కీలక పాత్ర. యూక్షన్-కామెడీ చిత్రాలంటే నాకు ఎంతో వుక్కువ. అలాంటిదే ఈ సినివూ కూడా. ప్రకాష్‌రాజ్... ఇందులో హాస్యాన్నీ అద్భుతంగా పండించాడు. ఇక తమన్నా... షీ ఈజ్ బ్యూటిఫుల్. మంచి కో ఆర్టిస్ట్. హిట్ సినిమాలకు రైటర్స్‌గా పనిచేసిన సాజిద్-ఫరాద్ తొలిసారి దర్శకత్వం వహించారు. నా 24 ఏళ్ల కెరీర్లో 18 వుంది కొత్త డైరెక్టర్లతో పనిచేశా. ఇందులో డాగ్‌తో షూటింగ్ కోసం మూడునాలుగు గంటలు శ్రమించాం. ఇక్కడి ఫుడ్ నాకెంతో ఇష్టం. వివిధ రకాల వంటకాలు పార్సిల్ తీసుకెళుతున్నా. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే... సాయుంత్రం 6.30కల్లా ఫుడ్ తీసుకోండి. కెరీర్లో ఎదగాలన్నా... అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్నా... అవ్మూనాన్నలను ప్రేమించండి... గౌరవించండి’ అంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్. ‘సూపర్‌స్టార్ అక్షయ్ క్రవుశిక్షణ ఉన్న ఉత్తవు ఆర్టిస్ట్. ఇందులో నాది టీవీ సీరియల్ నటి పాత్ర. ఈ సినివూ షూటింగ్‌తో నా లైఫ్ మారిపోయింది’ అని తమన్నా చెప్పింది. ‘ఈ చిత్రంలో హీరో కుక్కే. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా పూర్తిస్థాయిలో డాగ్‌తోనే షూటింగ్ చేశాం’ అని ప్రకాష్‌రాజ్ చెప్పారు. -
దేశీ కట్టీలో జర్మన్ బ్యూటీ క్లాడియా
అక్షయ్ కుమార్ సినిమా ఖిలాడీ 786లో మెరిసిన జర్మన్ మోడల్ క్లాడియా సీస్లా మరో హిందీ సినిమాలోనూ చాన్స్ సంపాదించుకుంది. దేశీ కట్టీలో ఐటెమ్‌సాంగ్ ద్వారా యువతకు హుషారెక్కించనుంది. ‘ఖిలాడీలో బల్మా పాట తరువాత కూడా చాలా అవకాశాలు వచ్చాయి కానీ, అవేవీ నచ్చకపోవడంతో ఒప్పుకోలేదు. దేశీ కట్టీలోని పట్నీవాలీ హూ పాట బాగా నచ్చింది. బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని జానపద గేయమిది. కొంటెగా అనిపిస్తుంది’ అని క్లాడియా చెప్పింది. దేశీ కట్టీ ఆగస్టు 28న థియేటర్లకు వస్తుంది. ఇక పట్నీవాలీ పాటకు కైలాష్ ఖేర్ సంగీతం అందించగా, రేఖా భరద్వాజ్ పాడింది. ఈ పాటలో క్లాడియా హుషారుగా నర్తిస్తుంటే చుట్టూ తుపాకులతో ఉండే సాయుధులు కూడా స్టెప్పులేస్తుంటారు. ఒక గ్రామంలో తీసిన ఈ పాటకు విష్టుదేవా కొరియోగ్రఫీ అందించాడు. ‘ఈ పాట కోసం బాగా కష్టపడ్డాను. బిపాసాబసు ఐటెంసాంగ్ నమక్ మాదిరిగానే ఇదీ ఉంటుంది కాబట్టి ఆ పాటను చాలాసార్లు చూశాను. విష్టు నుంచి స్టెప్పులు నేర్చుకోవడానికి కూడా చాలా సమయమే పట్టింది. ఇతడు అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. స్టెప్పులు చాలా బాగుంటాయి’ అని క్లాడియా వివరించింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా వంటి పెద్ద హీరోయిన్లు కూడా ఐటెంసాంగులకు ఓకే అంటుండడంతో వీటికి బాలీవుడ్లో గిరాకీ బాగానే ఉంది. హిందీ డ్యాన్సింగ్ బ్యూటీల్లో నీకు ఎవరంటే ఇష్టమన్న ప్రశ్నకు బదులుగా ‘మలైకా అరోరా’ అని క్లాడియా చెప్పింది. దిల్ సేలోని ఛయ్య ఛయ్య పాట చూసిన తరువాత ఆమెకు అభిమానిగా మారిపోయానని, మలైకతోపాటు డ్యాన్స్ చేయాలని ఉందని తెలిపింది. కలర్స్ చానల్ రియాల్టీ షో బిగ్‌బాస్ ద్వారా అక్షయ్‌కుమార్‌కు పరిచయం కావడంతో ఈమెకు ఖిలాడీ 786లో అవకాశం దక్కింది. ప్రస్తుతం ఇండియాలోనే ఉంటున్న క్లాడియాకు పూర్తిస్థాయి హీరోయిన్గా మాత్రం ఇంకా అవకాశం రాలేదు.