kidnapped Case
-
బిడ్డను చూస్తూ ఉండమంటే.. కిడ్నాప్, కథ సుఖాంతం
సాక్షి, తిరుపతి: తిరుపతిలో 4 నెలల పసికందు అపహరణ కేసును అలిపిరి పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన యాచకురాలు ఆశని అరెస్టు చేశారు. ఈనెల 2వ తేదీన బాలాజీ బస్టాండ్ దగ్గర గంగులమ్మ తన నాలుగు నెలల మగబిడ్డను స్నానం చేసి వస్తా.. కొద్దిసేపు చూస్తూ ఉండు అని ఆశకు అప్పగించింది. స్నానం చేసి వచ్చిచూసేసరికి తన బిడ్డతో పాటు ఆశ కూడా కనిపించలేదు. అంతటా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు నిందితురాలు ఆశ మైసూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. -
అప్పలరాజు కిడ్నాప్ డ్రామా బట్టబయలు
-
బాలిక కిడ్నాప్‌తో కలకలం
సాక్షి, కాకినాడ క్రైం: జగన్నాథపురం వాటర్ ట్యాంక్ వద్ద నేతాజీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం స్కూల్ నుంచి కిడ్నాప్‌కు గురైన దీప్తిశ్రీని సవతి తల్లి కిడ్నాప్ చేసి హత్య చేసిందని దీప్తి నాయనమ్మ ఆరోపిస్తోంది. గతంలో కూడా దీప్తికి వాతలు పెట్టడం లాంటివి చేసిందని దీప్తి నానమ్మ చెప్తోంది. దీంతో సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీప్తిశ్రీని గొంతునులిమి హత్యచేసి ఉప్పుటేరు కాల్వలో పడేశానని కాసేపు, సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద పడేసానని పోలీసుల విచారణలో రకరకాలుగా సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు గాలింపును కొనసాగిస్తున్నారు. శుక్రవారం నుంచి దీప్తి ఆచూకీ లభించకపోవడంతో నాయనమ్మ, మేనత్త చిన్ని, బేబి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. జగన్నాథపురం వాటర్ ట్యాంక్ వద్ద నేతాజీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ ఘటన నగరంలో కలకలం రేపింది. తూరంగి పంచాయతీ పగడాలపేటకు చెందిన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసానిని శుక్రవారం పాఠశాల నుంచి నేరుగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు చిన్న నానమ్మ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి చేరకపోవడంతో తండ్రి సూరాడ సత్యశ్యామ్ కుమార్ ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో కాకినాడ వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. పగడాలపేటలో ఉంటున్న ఆమె నాన్నమ్మ సూరాడ బేబీ విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమారుడి మొదటి భార్య సత్యవేణి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిందని, రెండో భార్యగా కాకినాడ సంజయ్‌నగర్‌కు చెందిన శాంతికుమారిని ఇచ్చి పెళ్లి చేశారు. మనుమరాలిని కోడలు శాంతికుమారి, ఆమె చెల్లెలు జ్యోతి కిడ్నాప్ చేసి ఉంటరని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో కుమారుడు రాజమహేంద్రవరంలో ఉంటూ సీసీ కెమెరాలు బాగు చేసే పని చేసేవాడని, రెండో కోడలికి ఏడాది క్రితం బాబు పుట్టాడని చెప్పింది. ఆ సమయంలో దీప్తిశ్రీకి నెలకు రూ.2 వేలు చొప్పున బ్యాంకులో వేయాలని అడిగితే కోడలు అభ్యంతరం చెప్పిందన్నారు. రాజమహేంద్రవరంలో ఉంటున్నప్పుడు ఏడాది క్రితం ఈ చిన్నారిని అట్లకాడతో చెయ్యి, కాలు, మూతిపై కాల్చివేసిందని తెలిపారు. తన మనమరాలి అడ్డుతొలగించుకునేందుకే కిడ్నాప్ చేయించిందని ఆరోపించింది. మనుమ రాలిని తండ్రి పాఠశాలకు తీసుకెళ్లేవాడని తెలిపింది. సీసీ ఫుటేజ్‌ల్లో.. పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ మహిళ పాఠశాలకు వచ్చి ఆమెని కొద్ది దూరం తీసుకువెళ్లి బైక్‌పై వ్యక్తితో వెళ్లినట్లు నమోదైందని ఒన్‌టౌన్ సీఐ రామోహన్‌రెడ్డి తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి చిన్నారి సవతి తల్లి శాంతికుమారి, ఆమె బంధువులను స్టేషన్లో విచారణ చేస్తున్నారు. కాకినాడ – సామర్లకోట రోడ్డులోని పంట, మురుగు కాలువల్లో వెతికిస్తున్నట్లు సమాచారం. ఈ కేసును ఆదివారం భేదిస్తామని, కిడ్నాప్ చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుడు ఆనంద్ వివరణ రెండు రోజుల క్రితం ఈ బాలిక అమ్మ ఒడి లబ్ధి కోసం దరఖాస్తు పెట్టేందుకు ఆధార్, రేషన్ కార్డుల కోసం తనను నానమ్మ ఇంటికి పాప తీసుకెళ్లిందని పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుడు ఆనంద్ తెలిపారు. ఉపాధ్యాయులు చెబితే తప్ప తనతో వచ్చేందుకు బాలిక అంగీకరించలేదన్నారు. నానమ్మ ఏ వివరాలు లేవని చెప్పిందన్నారు. ఈ చిన్నారి తెలివైదని, ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, పాప ను క్షేమంగా నానమ్మ వద్దకు చేర్చాలని ఆయన కోరారు. -
బెంగళూరులో మిస్సింగ్.. తిరుపతిలో లభ్యం
బనశంకరి: బెంగళూరు భూపసంద్రలో అదృశ్యమైన ఇద్దరు పిల్లలు ఆచూకీ తిరుపతిలో లబించింది. వీరిద్దరిని నగరపోలీసులు సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు...సంజయనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని భూపసంద్ర మెయిన్‌రోడ్డు 5వ క్రాస్‌లో ప్రశాంత్, శైలజా దంపతులు నివాసముంటున్నారు. వీరికి నమ్రత (7), నమిత్ (5) అనే పిల్లలున్నారు. గత నెల 25 తేదీ రాత్రి 7.30 గంటలకు అక్కడే కొబ్బరిబొండాలు అమ్మే అవ్వ వద్ద ఉన్నారు. ప్రశాంత్ కుటుంబానికి పరిచయమైన వినోద్ (26) అనే యువకుడు ఆడుకునే నెపంతో నమ్రతా, నమిత్ ఇద్దరినీ అపహరించుకెళ్లాడు. రాత్రి 9 గంటల వరకు ఇంటికి పిల్లలు రాకపోవడంతో తల్లిదండ్రులు పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. కానీ వీరి ఆచూకీ లభించకపోవడంతో సంజయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టించిన సీసీ కెమెరాలు పోలీసులు పిల్లలు ఆడుకుంటున్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఇందులో వినోదే పిల్లలను తీసుకెళ్లినట్లు తెలిసి అతని ఫోటోలను అందరికీ వాట్సప్‌లో పంపారు. తిరుపతిలో ఉన్న ప్రశాంత్ బంధువుల అవినాశ్ తిరుపతిలో పిల్లలను గమనించి ప్రశాంత్‌కు సమాచారం అందించాడు. వెంటనే సంజయనగగర పోలీసులు తిరుపతికి వెళ్లి స్థానిక పోలీసుల సహాయంతో పిల్లల వద్దకు వెళ్లారు. పోలీసులను చూసి వినోద్ పరారు కాగా, పోలీసులు పిల్లలను గురువారం ఉదయం నగరానికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నమ్రతా, నమిత్‌ను అప్పగించారు. పరారీలో వినోద్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
రిటైర్డ్ టీచర్ కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
వాల్మీకిపురం: కలకడ మండలంలో రిటైర్డ్ టీచర్ కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ శ్రీధర్‌నాయుడు తెలిపారు. వారు శనివారం వాల్మీకిపురం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా చిన్నమండెం మండలం వండాడి తూర్పుపల్లెకు చెంది న ప్రతాప్‌రెడ్డి (26), సంబేపల్లె మండలం చిన్నపాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆనందరెడ్డి (26), చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం దోర్నకంబాల గ్రామానికి చెందిన యశ్వంత్ (20), తెలం గాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పూలకల్లు మండలం కొరంపల్లెకు చెందిన బాలరాజు (24), కలకడ మండలం కోన గ్రామానికి వెంగన్నగారిపల్లి హరిజనవాడకు చెందిన క్రిష్ణయ్య కుమారుడు రామాంజులు (25) ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. కలకడ మండలం కోన గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గుడ్ల రాజన్నను ఈ నెల 4వ తేదీన కిడ్నాప్ చేశారు. మదనపల్లిలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రాజన్న కుమారుడు కాశీనాథ్‌కు ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాశీ నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ శ్రీధర్‌నాయుడు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ ఈఎంఐ నెంబర్లు ఆధారంగా శుక్రవారం తలకోనలో పట్టుకున్నారు. వారు వాడిన ఇండికా కారును, సెల్ఫోన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం డీఎస్పీ సమక్షంలో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించారు. ఎస్ ఐలు వెంకటేష్, చాన్‌బాషాను డీఎస్పీ చిదానందరెడ్డి అభినందించారు. -
అశ్వత్థామ కేసులో ప్రముఖుల హస్తం?
నరసాపురం (రాయపేట) : భూస్వామి అశ్వత్థామ నాయుడి కిడ్నాప్.. ఆస్తుల బదలాయింపు కేసులో ప్రముఖుల హస్తం ఉన్నట్టు తెలిసింది. ఈ కేసులో నిందితులు ఇటీవల పండగకు లక్ష్మణేశ్వరం గ్రామంలోనే రెండు రోజులు మకాం ఉన్నారని, ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న రౌడీ షీటర్ కారిచర్ల మోహనరావు రెండురోజుల క్రితం గ్రామంలోనే మకాం ఉన్నాడని, అలాగే మరో నిందితుడు దీపావళి రోజున షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో నరసాపురం వచ్చి రెండురోజులు గ్రామంలోనే గడిపి వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామంపై నిఘా ఉంచారు. నిందితులు పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేసి ఆస్తులను రాయించుకున్నారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కిడ్నాప్‌కు ముందు, తరువాత నిందితులు ఎవరెవరితో సంభాషించారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. రూ.కోట్ల విలువైన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లక్షలు అవసరం కావడంతో అంత మొత్తం ఎవరు ఇచ్చారు, నిందితులు స్థానికంగా ఒక సెల్‌షాపు నిర్వాహకుడి నుంచి కొన్న కొత్త సిమ్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. మంగళవారం సీఐ భాస్కరరావు లక్ష్మణేశ్వరం గ్రామానికి వెళ్లి నిందితుల వివరాలు, కుటుంబం, స్నేహితుల సమాచారాన్ని సేకరించారు. మొత్తం నాలుగు రిజిస్ట్రేషన్లు ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పలు లోపాలను పోలీసులు కనుగొన్నారు. భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజులు 7,568, 7,569, 7,570, 7,571 నంబర్లుగా సెప్టెంబర్ 29న రిజిస్ట్రేషన్ అయ్యాయి. కారిచర్ల మోహనరావు పేరున రెండు దస్తావేజులు, చాగంటి గోపికృష్ణ, గుబ్బల వెంకటేశ్వరరావు పేరున చెరొక దస్తావేజు చొప్పున మొత్తం నాలుగు రిజస్ట్రేషన్లు జరిగాయి. దస్తావేజులో విక్రయదారుడు కరుకువాడ బేతపూడి అని ఉదహరించి నరసాపురానికి చెందిన అడ్రస్ప్రూఫ్ను జతచేయడం గమనార్హం. అలాగే గుబ్బల వెంకటేశ్వరరావు పేర చేయించినరిజిస్ట్రేషన్ దస్తావేజులోని ఏజెంట్ ఫొటోఫారమ్పై అతని సంతకాలు లేవు. ఇంటికి వెళ్లి మరీ రిజిస్ట్రేషన్ కరుకువాడ బేతపూడిలో ఇంటికి సబ్ రిజిస్ట్రార్‌ను తీసుకువెళ్లి మరీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించిన వైనంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విధానంలో ముందుగా సబ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆస్తి విక్రయదారుడు అనారోగ్యపరిస్థితిని తెలియజేసే వైద్యుడి ధ్రువీకరణపత్రం, ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేయాలో ఆ ఇంటి డోర్ నంబర్ ఐడీ ప్రూఫ్ జతచేయాల్సి ఉంటుంది. అయితే కిడ్నాప్‌కు గురైన అశ్వద్ధామనాయుడు అనారోగ్యవంతుడని ఎవరు ధృవీకరించారు ? రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎవరిచ్చారు ? అనే వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. వీటి దస్తావేజుల నకళ్లు, క్రయ, విక్రయదారుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. కీలకంగా సబ్ రిజిస్ట్రార్ స్టేట్మెంట్ ఈకేసులో భీమవరం జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ శారదాదేవి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. అయితే ఇప్పటికే పోలీసులు ఆమెను ఒకసారి విచారణ చేశారు. అయితే దస్తావేజుల రిజిస్ట్రేషన్‌లో లోపాలపై కూడా ఆమెను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. అయితే ఆమె ప్రస్తుతం అందుబాటులో లేనట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. కార్యాలయంలో కాకుండా కరుకువాడ బేతపూడి గ్రామంలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారన్నదే మిస్టరీగా మారింది. ఆ ఇంటి యజమాని చిక్కితేగాని తెరవెనుక ఎవరున్నారనేది తెలిసే అవకాశాలు లేవంటున్నారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.