వాల్మీకిపురం: కలకడ మండలంలో రిటైర్డ్ టీచర్ కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ శ్రీధర్‌నాయుడు తెలిపారు. వారు శనివారం వాల్మీకిపురం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా చిన్నమండెం మండలం వండాడి తూర్పుపల్లెకు చెంది న ప్రతాప్‌రెడ్డి (26), సంబేపల్లె మండలం చిన్నపాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆనందరెడ్డి (26), చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం దోర్నకంబాల గ్రామానికి చెందిన యశ్వంత్ (20), తెలం గాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పూలకల్లు మండలం కొరంపల్లెకు చెందిన బాలరాజు (24), కలకడ మండలం కోన గ్రామానికి వెంగన్నగారిపల్లి హరిజనవాడకు చెందిన క్రిష్ణయ్య కుమారుడు రామాంజులు (25) ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు.
కలకడ మండలం కోన గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గుడ్ల రాజన్నను ఈ నెల 4వ తేదీన కిడ్నాప్ చేశారు. మదనపల్లిలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రాజన్న కుమారుడు కాశీనాథ్‌కు ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాశీ నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ శ్రీధర్‌నాయుడు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ ఈఎంఐ నెంబర్లు ఆధారంగా శుక్రవారం తలకోనలో పట్టుకున్నారు. వారు వాడిన ఇండికా కారును, సెల్‌ఫోన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం డీఎస్పీ సమక్షంలో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించారు. ఎస్ ఐలు వెంకటేష్, చాన్‌బాషాను డీఎస్పీ చిదానందరెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment