Kidnapper arrested
-
యువతిని ఎత్తుకెళ్లి.. ఎడారిలో రాక్షస వివాహం
యువతితో తన నిశ్చితార్థాన్ని ఆమె కుటుంబ సభ్యులే రద్దు చేశారన్న కోపంతో ఆమెను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఈ ఘటన జరిగింది. బాధిత యువతితో నిందితుడు పుష్పందర్ సింగ్‌కు నిశ్చితార్థం కుదిరింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు దాన్ని రద్దు చేశారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు తన స్నేహితులతో కలిసి జూన్ 1న యువతిని ఎడారిలోకి ఎత్తుకెళ్లాడు. ఆమె ఏడుస్తున్నా.. పెళ్లి చేసుకున్నాడు. (హిందు సంప్రదాయం ప్రకారం) ఆ మంట చుట్టూ ఏడుసార్లు తిరిగాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. యువతిని అదే రోజు రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ముగ్గుర్ని అరెస్టు చేయగా.. ఒకరిని నిర్బంధంలోకి తీసుకున్నారు.మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. मीडिया द्वारा ये वीडियो जैसलमेर का बताया जा रहा है। रिपोर्ट्स के अनुसार एक लड़की को सरेआम किडनैप करके एक बंजर वीराने में आग जलाकर उसके साथ ज़बरदस्ती शादी कर ली। ये बेहद चौंकाने वाली और डराने वाली घटना है। @AshokGehlot51 जी मामले की जाँच कर कार्यवाही करें। pic.twitter.com/mZee4oJgSy — Swati Maliwal (@SwatiJaiHind) June 6, 2023 ఈ ఘటనపై స్పందించిన దిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్.. చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను షేర్ చేసి.. 'ఇది నిజంగా భయానక ఘటన. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నారు.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం'అని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఒడిశాలో దారుణం.. ఈదురుగాలులకు కదిలిన బోగీలు.. నలుగురు మృతి -
20 ఏళ్లకు పట్టుబడిన మాయ‘లేడి’
సాక్షి, చీపురుపల్లి: రెండు దశాబ్దాల క్రితం ఆ మాయ‘లేడీ’ ఓ బాలుడిని అపహరించింది. ఆ తరువాత ప్రాంతాలు మారుస్తూ మనుషుల్ని ఏమార్చడమే వృత్తిగా మార్చుకుంది. ఇటీవల జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి వలవేసి అతడి ఇంట్లో చేరింది. ఆ ఇంట్లోని బంగారమంతా మూటగట్టుకుని ఉడాయించబోతుండగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో పాత కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంకు చెందిన సుంకరి భాగ్యలక్ష్మి అనే మహిళ 20 ఏళ్ల క్రితం విజయనగరం జిల్లా వంగపల్లిపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉండేది. అదే గ్రామానికి చెందిన మండల సూర్యారావు, పెంటమ్మ దంపతుల నాలుగేళ్ల కుమారుడు శంకరరావును 1998 మార్చి 8న కిడ్నాప్ చేసింది. ఆ ఇంట్లోంచి రూ.15 వేల నగదు, ఆరున్నర తులాల బంగారాన్ని కూడా అపహరించుకుపోయింది. అప్పట్లో బాలుడి తల్లిదండ్రులు చీపురుపల్లి పోలీసులను ఆశ్రయించగా.. ఏళ్ల తరబడి విచారణ జరిపినా ఆ మహిళతోపాటు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కేసును మూసేశారు. 20 ఏళ్ల తరువాత అనూహ్యంగా జియ్యమ్మవలసలో పట్టుబడిన ఆమెను హెడ్ కానిస్టేబుల్ లోపింటి రామకృష్ణ గుర్తించడంతో కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చింది. విశేషం ఏమంటే.. బాలుడు కిడ్నాపైన సందర్భంలో రామకృష్ణ చీపురుపల్లి స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తుండేవారు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన బృందంలో అతడు పనిచేశారు. స్పష్టత లేని సమాధానాలిస్తున్న నిందితురాలు బాలుడిని కిడ్నాప్ చేసింది తానేనని, 16 సంవత్సరాల వరకు మాత్రమే తనతో ఉన్నాడని నిందితురాలు భాగ్యలక్ష్మి చెబుతోంది. ఎక్కడున్నాడో తెలియదని ఒకసారి, హైదరాబాద్‌లో తన బావ దగ్గర ఉన్నాడని మరోసారి చెబుతోంది. ఇదిలావుంటే.. 20 ఏళ్లుగా తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని.. ఇప్పుడైనా తమ బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని తల్లి పెంటమ్మ వేడుకుంటోంది. కేసును తిరిగి తెరిచేందుకు కోర్టును ఆశ్రయించామని, త్వరలోనే బాలుడి ఆచూకీ కనిపెడతామని చీపురుపల్లి సీఐ సీహెచ్.రాజులునాయుడు చెప్పారు. -
గుర్గావ్లో ముగ్గురి కిడ్నాపర్ల అరెస్టు
గుర్గావ్: నగరంలో ముగ్గురు కిడ్నాపర్లను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలి పారు. యువకుడిని అపహరించిన, అతడి విడుదలకు రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. డిసెంబర్ 12వ తేదీన పామ్ విహార్కాలనీకి చెందిన 18 ఏళ్ల మానవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో అపహరించుకొని పారిపోయారు. ఈ మేరకు పామ్ విహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీ స్ కమిషనర్(పశ్చిమ) సంగీతా కాలియా తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కిడ్నాపర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బాధితుడి తండ్రికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి, రూ. 5 కోట్లను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు సమాచారం అందజేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన బృందాలు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ఈ సమాచారం తెలుసుకొన్న కిడ్నాపర్లు ఆందోళనకు గురై శుక్రవారం రాత్రి బాధితుడిని వదిలేశారు. బాధితుడు గుర్తిం చిన ఆ ముగ్గిరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక నిందితుడిని అక్షయ్ పూని యాగా గుర్తించారు. ఇతడు బాధితునికి సుపరిచితుడేనని పోలీసులు తెలిపారు. మోహిత్ జోషి పరారీలో ఉన్నట్లు తెలిపారు.