గుర్గావ్: నగరంలో ముగ్గురు కిడ్నాపర్లను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలి పారు. యువకుడిని అపహరించిన, అతడి విడుదలకు రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. డిసెంబర్ 12వ తేదీన పామ్ విహార్‌కాలనీకి చెందిన 18 ఏళ్ల మానవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో అపహరించుకొని పారిపోయారు. ఈ మేరకు పామ్ విహార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీ స్ కమిషనర్(పశ్చిమ) సంగీతా కాలియా తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కిడ్నాపర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో బాధితుడి తండ్రికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి, రూ. 5 కోట్లను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు సమాచారం అందజేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన బృందాలు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ఈ సమాచారం తెలుసుకొన్న కిడ్నాపర్లు ఆందోళనకు గురై శుక్రవారం రాత్రి బాధితుడిని వదిలేశారు. బాధితుడు గుర్తిం చిన ఆ ముగ్గిరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక నిందితుడిని అక్షయ్ పూని యాగా గుర్తించారు. ఇతడు బాధితునికి సుపరిచితుడేనని పోలీసులు తెలిపారు. మోహిత్ జోషి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
గుర్గావ్‌లో ముగ్గురి కిడ్నాపర్ల అరెస్టు
Published Sat, Dec 13 2014 11:48 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
Advertisement
Advertisement