kidnappers arrest
-
అమ్మ కంట ఆనందభాష్పాలు.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు
సాక్షి, పాడేరు: వారంతా నెలల వయసున్న బిడ్డలకు దూరమైన తల్లిదండ్రులు.. కనిపించకుండా పోయిన తమ చిన్నారులు ఇక దొరుకుతారో లేదోనన్న ఆందోళనతో ఉన్నారు.. మీ పిల్లలు దొరికారని పోలీసుల నుంచి వచ్చిన సమాచారం వారిని చెప్పలేనంత సంతోషానికి గురి చేసింది.. పరుగు పరుగున వెళ్లి తమ పిల్లల్ని చూసుకొని ఆనందబాష్పాలు రాల్చారు. ఈ అపురూప దృశ్యం బుధవారం పాడేరు పోలీస్ స్టేషన్లో కనిపించింది. ఈనెల 2వ తేదీన డుంబ్రిగుడ మండలంలో మాయమైన 6 నెలల పసికందు లోహర్ అర్జున్ అపహరణ కేసులో.. పోలీసులు తీగ లాగితే పెద్ద డొంకే కదిలింది. ఇలాంటి చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తున్న పదిమంది ముఠా పట్టుబడింది. వారి వద్ద మరో ముగ్గురు చిన్నారులు లభించారు. వారందరినీ బుధవారం రూరల్ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ ముఠా కిడ్నాప్ చేసిన పితాని దర్షిత్‌కుమార్, చింతలపూడి రూపశ్రీ, కోరుపల్లి దీక్షిత, లోహర్ అర్జున్‌లు సురక్షితంగానే ఉన్నారు. వీరిని కొనుగోలు చేసిన వారి నుంచి ఈ పిల్లల్ని స్వాధీనం చేసుకుని వారి సొంత తల్లిదండ్రులకు రూరల్ ఎస్పీ కృష్ణారావు చేతుల మీదుగా బుధవారం సాయంత్రం పాడేరులో అప్పగించారు. తమ పిల్లలు తమకు దక్కడానికి ఎంతో శ్రమించిన పోలీసు అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులకు రివార్డులు ప్రశంసనీయమైన రీతిలో పోలీసులు అపహరణ కేసును ఛేదించడంతో.. మరో ముగ్గురు చిన్నారులు తమ తల్లిదండ్రుల చెంతకు చేరగలిగారు. పోలీసులకు అభినందనలతోపాటు ఉన్నతాధికారుల రివార్డులు దక్కాయి. డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు ప్రాంతంలో ఈనెల 2వ తేదీన మధ్యప్రదేశ్‌కు చెందిన సంచార కుటుంబంలోని ఆరు నెలల శిశువును అర్ధరాత్రి సమయంలో అపహరించారు. మరుసటి రోజే డుంబ్రిగుడ పోలీసు స్టేషన్లో ఎస్ఐ సంతోష్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఈ శిశువు అపహరణ ఘటనపై అరకు సీఐ జి.దేముడుబాబు వెంటనే స్పందించారు. డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి ఎస్ఐలు సంతోష్‌కుమార్, నజీర్, కరక రాములను అప్రమత్తం చేసి జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అపహరించిన శిశువు సబ్బవరం మండలం గాలి భీమవరం ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో జిల్లాలోని పిల్లల కిడ్నాప్, అక్రమ అమ్మకాల ముఠా వెలుగు చూసింది. ఈ కేసును 24 గంటల్లోనే చేధించడంతో పాటు ముఠా నుంచి నలుగురు శిశువులను స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఎంతో శ్రమించిన అరకు సీఐ జి.దేముడుబాబుతోపాటు అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ ఎస్ఐలు కరక రాము, నజీర్, సంతోష్‌కుమార్‌లను బుధవారం సాయంత్రం పాడేరులో విశాఖ రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. సీఐ, ఎస్ఐలకు వేర్వేరుగా నగదు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఏఎస్పీ పి.జగదీష్, పాడేరు, జి.మాడుగుల సీఐలు సుధాకర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు సురక్షితం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందు సురక్షితంగా ఉన్నాడు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నెహ్రూనగర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు జీజీహెచ్‌లో శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో..4 రోజుల పసికందును కిడ్నాప్ చేశారు. అయితే, కొద్ది గంటల్లో శిశువు ఆచూకీ లభించింది. అక్కడ వార్డు బాయ్ మరో మహిళతో కలిసి పసికందును అపహరించినట్టు పోలీస్ విచారణలో వెల్లడయ్యింది. పసికందు అపహరణకు గురైన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
సొంత కూతుర్నే కిడ్నాప్.. అమ్మకం..!
పేదల ఆవాసాలే వారి దందాలకు విలాసాలు.. ఒంటరిగా కనిపించే చిన్నారులే పెట్టుబడి.. అభం శుభం తెలియని చిన్నారులను చాక్లెట్ల ఎర వేసి చెర బట్టి ఎత్తుకుపోతారు.. పిల్లలు లేని వారితో బేరసారాలు చేసి వచ్చిన ధరకు తెగనమ్మేస్తారు. పిల్లలు కనిపించక ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధిత తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారే తప్ప.. ముందుకు వెళ్లలేరు. ఇదే పిల్లల బేహారులకు వరంగా మారింది. కేసులు నమోదు కాకపోవడం.. పోలీసుల దృష్టిలో పడకపోవడంతో ఒకదాని తర్వాత ఒకటిగా కిడ్నాప్ దందా కొనసాగిస్తున్నారు. మూడేళ్లుగా సాగుతున్న ఈ దందా.. ఇటీవలే నమోదైన ఓ కేసు పుణ్యాన వెలుగు చూసింది. సాక్షి, విశాఖపట్నం : నగరంలో చిన్నారుల్ని అపహరించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నలుగురు గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకొని విచారించి.. వివరాలు రాబట్టినట్టు నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్ ముఠా వివరాలు వెల్లడించారు. కిడ్నాప్ వ్యవహారంలో ఏ–1 బోండా నాగమణి ఆరిలోవ ప్రాంతంలో 23 సంవత్సరాలుగా నివాసముంటోంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు వ్యభిచార వృత్తిని ప్రారంభించింది. ఈ సమయంలో మూడేళ్ల క్రితం తమ్మినేని సుమంత్‌కుమార్(ఏ–3)తో పరిచయం ఏర్పడింది. ఈయనపై పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఒక కేసు నమోదైంది. అయితే ఏలూరులో ఉన్న తన చెల్లి సత్యవతికి పిల్లలు లేరని నాగమణితో సుమంత్ చెప్పడంతో అనాథాశ్రమంలో దత్తత తీసుకునేందుకు నాగమణి, సుమంత్ ప్రయత్నించారు. కానీ నిబంధనలు కఠినంగా ఉండడంతో పిల్లల్ని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. నగరమంతా ఆటోలో కలియతిరగగా వుడా పార్కు వద్ద ఓ మహిళతో 8 నెలల ఆడ శిశువు ఉండడాన్ని గమనించారు. 2016 నవంబర్‌లో అర్ధరాత్రి సమయంలో ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు. ఆ పిల్లను ఏలూరులోని సత్యవతి భర్త రాంబాబు(ఏ–8)కు రూ.50 వేలకు విక్రయించారు. ఫుట్‌పాత్‌పై పిల్లలే టార్గెట్.. 2018 నవంబర్‌లో నాగమణి, శేఖర్ కలిసి తగరపువలసలో ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ మహిళను ఏమార్చి.. ఆమె రెండేళ్ల బాలుడికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారి ఫొటోను వాట్సప్‌లో పంపించి బేరం కుదుర్చుకొని నక్కపల్లిలోని చందన రాజేశ్వరరావు(ఏ–7), మడగళ జ్యోతి(ఏ–5) అనే మధ్యవర్తుల సహకారంతో చందన దేవి(ఏ–6)కు రూ.1.20 లక్షలకు విక్రయించారు. స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో చిన్నారులు.. ముఠా విక్రయించిన శిశువుల్ని తీసుకొచ్చి నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉంచామని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ఫిర్యాదులు ఇవ్వలేని మహిళలకు చెందిన శిశువుల్నే లక్ష్యంగా చేయడం వల్ల మూడేళ్లుగా విక్రయాలు సాగించారని సీపీ వివరించారు. అభిరామ్‌ని విక్రయించేందుకు ఏలూరు తరలిస్తుండగా పోలీసు బృందాలు పట్టుకున్నాయన్నారు. నిందితులపై 420, 468, 471, ఆర్/డబ్ల్యూ34 ఐపీసీ అండ్ సెక్షన్ 80,81 జువైనల్ 363 కిడ్నాప్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. నిందితుల్ని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్టు సీపీ తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సీఐలు పి.రమణయ్య, అవతారం, నిర్మల, ఎస్ఐలు సత్యనారాయణ, ఎం.రఘురాం, కె.శ్రీనివాస్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీసీపీ–2 ఉదయ్‌భాస్కర్ బిల్లా, అదనపు డీసీపీ వి.సురేష్‌బాబు, వెస్ట్ ఏసీపీ జి.స్వరూపారాణి, పాల్గొన్నారు. తొలి ఫిర్యాదుతో గుట్టురట్టు.. పిల్లల్ని కిడ్నాప్ చేసి విక్రయాలకు పాల్పడుతున్నప్పటికీ చిన్నారుల మిస్సింగ్‌కి సంబంధించి ఎక్కడ కేసులు నమోదు కాకపోవడంతో ముఠా మరింత రెచ్చిపోయింది. ప్లాన్ ప్రకారం ఫిర్యాదు చేయలేని వారి పిల్లల్నే ముఠా సభ్యులు టార్గెట్ చేశారు. దీంతో మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా పోలీసులకు ఫిర్యాదులు అందలేదు. అయితే ఏ–2 శేఖర్‌కు పాడేరుకు చెందిన నాగేరి కాంతమ్మ పరిచయమైంది. ఈ నెల 5న తన రెండేళ్ల కుమారుడు అభిరామ్‌తో కలిసి శేఖర్‌ను కలిసేందుకు ద్వారకా బస్‌స్టేషన్‌కు వచ్చింది. శేఖర్‌తో కలిసి ఆటోలో సింహాచలం వెళ్లారు. సింహాచలం కాంప్లెక్స్ వద్ద తన బ్యాగు, కుమారుడిని శేఖర్‌కు అప్పగించి వాష్‌రూమ్‌కి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి బాలుడితో సహా శేఖర్ మాయమవ్వడంతో గోపాలపట్నం పోలీసు స్టేషన్లో కాంతమ్మ ఫిర్యాదు చేసింది. ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల వలలో ముఠా చిక్కుకుంది. కన్న కుమార్తెనూ కిడ్నాప్.. విక్రయం.. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఆరిలోవకు వలస వచ్చిన జెన్నం ఆనంద్(ఏ–2) అలియాస్ శేఖర్‌తో నాగమణికి పరిచయం పెరిగింది. శేఖర్‌కు ఆర్థిక సమస్యలుండడంతో నాగమణి కిడ్నాప్ ప్లాన్ చెప్పింది. శేఖర్ తన సొంత మూడో కుమార్తెను కిడ్నాప్ చేసి మహమ్మద్ జియావుద్దీన్‌కు రూ.లక్షకు విక్రయించారు. వ్యాపారం లాభసాటిగా ఉండడంతో నాగమణి, శేఖర్లు కలిసి ఆరిలోవ ఐటీసీ పాయింట్ వద్ద మూడేళ్ల బాలికను చాక్లెట్ ఆశచూపి 2017 ఏప్రిల్‌లో కిడ్నాప్ చేసి మరో నిందితురాలు మడగల లక్ష్మి(ఏ4) ఇంట్లో దాచిపెట్టారు. కిడ్నాప్ చేసిన బాలికను ముద్దుగా రెడీ చేసి ఫొటోలు తీసి తనకున్న పరిచయాల్లో పిల్లలు లేని వారికి వాట్సప్ ద్వారా నాగమణి పంపించింది. అయితే ఆ అమ్మాయిని ఎవరూ కొనకపోవడంతో తమకు బీచ్ రోడ్డులో పాప దొరికిందంటూ నిందితులు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించేశారు. -
కిడ్నాపర్ల అరెస్ట్ : బాలుడు సురక్షితం
-
కిడ్నాపర్ల అరెస్ట్ : బాలుడు సురక్షితం
విశాఖపట్నం: ఎనిమిది రోజుల క్రితం కిడ్నాప్ అయిన దామోదర్ అనే బాలుడి కథ సుఖాంతమైంది. పోలీసులకు నిద్రలేకుండా చేసిన కిడ్నాపర్లను పట్టుకున్నారు. పోలీసుల వ్యూహం ఫలించింది. బాలుడు సురక్షితంగా ఉన్నాడు. గోపాలపట్నంలో కాయిన్ బాక్స్ వద్ద ఫోన్ చేస్తుండగా ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం కెజిహెచ్కి తరలించారు. పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన కోరుబిల్లి శ్రీనివాసరావు,లక్ష్మి దంపతులకు యమున అనే కుమార్తె, దామోదర్(9) అనే కుమారుడు ఉన్నారు. శ్రీనివాసరావు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. దామోదర్ పెందుర్తి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు రాత్రి 8.30కి వినాయక మండపం వద్దకు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామంలో ఆరా తీశారు. రెండురోజులు వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్: అదృశ్యమయ్యాడనుకున్న దామోదర్ ఉదంతం బుధవారం సాయంత్రం కొత్తమలుపు తిరిగింది. బాలుడు తమ వద్ద ఉన్నాడంటూ గోపాలపట్నం దగ్గర కొత్తపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న కాయిన్‌బాక్స్ నుంచి శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. సాయంత్రం 4.20, 4.30కి రెండు దఫాలు ఫోన్ చేసిన దుండగులు 40 గంటల్లో రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకుంటే దామోదర్‌ను చంపుతామంటూ బెదిరించారు. ఫోన్‌కాల్ వాయిస్‌ను రికార్డు చేసిన శ్రీనివాసరావు పోలీసులకు అందించాడు. అందులో బాలుడి గొంతు వినిపించింది. గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో బాలుడు తిరిగినట్లు పలువురు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. 310 మంది పోలీసులు, 20 బృందాలుగా ముమ్మర గాలింపు చేపట్టారు. శివారు ప్రాంతంలో తనిఖీలు చేశారు. కాయిన్ బాక్సుల వద్ద నిఘాపెట్టారు. పోలీసులు ఊహించినట్లే ఇద్దరు కిడ్నాపర్లు ఈ రోజు గోపాలపట్నంలో కాయిన్ బాక్స్ వద్ద దొరికారు. **