at kikaram
-
ఆటో బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
కైకరం (ఉంగుటూరు) : జాతీయ రహదారిపై కైకరం వద్ద శుక్రవారం తెల్లవారు జూమున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి, డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని భవానీపురానికి చెందిన ఆకుమళ్ల రమణారెడ్డి(29) గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో వాషింగ్మెషీన్లు, కూలర్లలోడుతో తణుకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కైకరం వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. డ్రైవర్ రమణారెడ్డి అక్కడక్కిడే మృతిచెందాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కారు, ఆటో ఢీ
కైకరం(ఉంగుటూరు) : జాతీయ రహదారిపై కైకరం సోమా కంపెనీ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. కైకరం బీసీ(జాతీయరహదారి పక్కన)కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు పండుగకు తణుకు వెళ్లారు. వారు సోమవార రాత్రి తణుకులో ఆటోలో తిరుగు పయనమయ్యారు. ఆటోపై కైకరం సోమా కంపెనీ వద్ద మలుపు తిరుగుతుండగా, తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో ఆటో డివైడర్‌పై బోల్తా పడింది. ఆటోలో ఉన్న చిన్నారులు తోట భాగ్యలత, తోట లత గాయపడ్డారు. వీరిని హైవే అంబులైన్సు వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని గుర్తించిన బీసీ కాలనీవాసులు హుటాహుటిన వచ్చి లోపల ఉన్న బాధితులను బయటకు తీశారు. ప్రమాదంలో ఆటో నుజ్జనుజ్జయింది. కారు ముందుభాగం దెబ్బతింది. 17టీపీసీయుఎన్జి03 : ఢీకొన్న కారు, ఆటో -
జాతీయ రహదారిపై మూడు ఫ్లైఓవర్లు
ఉంగుటూరు : జాతీయ రహదారిపై జిల్లాలో మూడు చోట్ల ఫ్లైఓవర్లు (వంతెనలు) నిర్మించేందుకు హైవే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కైకరం, తేతలి, పెరవలి గ్రామాలను ప్రమాదాల జోన్లుగా (బ్లాక్ స్పాట్) గుర్తించారు. దీనిపై అధికారులు ఆయా ప్రాంతాల్లో సర్వే చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటీకే జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణ కోసం సోలార్ వింకర్లును ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏలూరు కాలువ గట్టు వెంబడి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు కసరుత్తు చేస్తున్నారు. ఇప్పటికే తణుకు నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోని గుండుగొలను వరకు ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన మూడు గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించినట్టు సమాచారం.