కారు, ఆటో ఢీ
కారు, ఆటో ఢీ
Published Tue, Jan 17 2017 10:05 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
కైకరం(ఉంగుటూరు) : జాతీయ రహదారిపై కైకరం సోమా కంపెనీ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. కైకరం బీసీ(జాతీయరహదారి పక్కన)కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు పండుగకు తణుకు వెళ్లారు. వారు సోమవార రాత్రి తణుకులో ఆటోలో తిరుగు పయనమయ్యారు. ఆటోపై కైకరం సోమా కంపెనీ వద్ద మలుపు తిరుగుతుండగా, తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో ఆటో డివైడర్‌పై బోల్తా పడింది. ఆటోలో ఉన్న చిన్నారులు తోట భాగ్యలత, తోట లత గాయపడ్డారు. వీరిని హైవే అంబులైన్సు వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని గుర్తించిన బీసీ కాలనీవాసులు హుటాహుటిన వచ్చి లోపల ఉన్న బాధితులను బయటకు తీశారు. ప్రమాదంలో ఆటో నుజ్జనుజ్జయింది. కారు ముందుభాగం దెబ్బతింది.
17టీపీసీయుఎన్‌జి03 : ఢీకొన్న కారు, ఆటో
Advertisement
Advertisement