Kill Dil
-
ఆ నమ్మకం నిజమవుతుందా?
‘‘నాకు అవార్డులు వద్దు.. ప్రేక్షకుల ప్రశంసలు చాలు అని అనను. ప్రశంసలతో పాటు అవార్డులూ కావాలి. ప్రస్తుతం నాకో టార్గెట్ ఉంది’’ అని పరిణీతి చోప్రా అన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘కిల్ దిల్’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో చాలా గ్లామరస్‌గా నటించడంతోపాటు, చిత్రకథానాయకుడు రణవీర్ సింగ్‌తో అధర చుంబన సన్నివేశాలు కూడా చేశారు. ఈ చిత్రం నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని పరిణీతి అన్నారు. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇదనీ, ఇందులోని పాత్ర జాతీయ అవార్డు తెచ్చిపెడుతుందనే నమ్మకం కూడా ఉందనీ, ఆ అవార్డు సాధించాలన్నది తన లక్ష్యమనీ పరిణీతి పేర్కొన్నారు. మరి.. ఈ బ్యూటీ నమ్మకాన్ని ‘కిల్ దిల్’ నిజం చేస్తుందో లేదో కాలమే చెప్పాలి. -
విలన్ పాత్రలో గోవిందా...
-
'కిల్ దిల్' ట్రైలర్ పై అమితాబ్ ప్రశంసలు
ముంబై: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కిల్ దిల్' చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ పై బిగ్ బి అమితాబచ్చన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రముఖ నటుడు రణ్ వీర్ సింగ్, పరిణితీ చోప్రాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్ర ట్రైలర్ అమితాబ్ ను ఎంతగానో ఆకట్టుకుందట. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో స్పష్టం చేశాడు. 'ట్రైలర్ చాలా విన్నూత్నంగా ఉంది. ఆ ట్రైలర్ కు దర్శకుడు షహీద్ ఆలీ న్యాయం చేయాలి' అని అమితాబ్ పేర్కొన్నాడు ఇప్పటి వరకూ కామెడీ ఎంటర్ టైనర్ మూవీలతో అలరించిన హీరో గోవిందా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. 'కిల్ దిల్' మూవీలో గోవిందాతో పాటు రణవీర్ సింగ్, అలీ జాఫర్ నటిస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యశ్ రాజ్ చోప్రా బ్యానర్ లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీని షహీద్ అలీ డైరెక్ట్ చేస్తున్నారు. ముగ్గురు హీరోల మధ్య జరిగే కామెడీ మూవీకి హైలెట్ గా నిలుస్తుందని డైరెక్టర్ చెప్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
బయటి అమ్మాయిననే ముద్ర తుడిపేస్తా
ముంబై: పొరుగింటి అమ్మాయిననే ముద్రను తుడిపేస్తానని నటి పరిణీతి చోప్రా పేర్కొంది. మూస సినిమాల్లో నటిస్తున్నాననే అపప్రధ తనపై ఉందని, ‘కిల్ దిల్’, ‘ దావత్-ఇ-ఇష్క్’ సినిమాలతో అది తొలగిపోతుందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనపై వవచ్చిన డేటింగ్ వదంతులను పరిణీతి కొట్టిపారేసింది. కిల్ దిల్ సినిమామ దర్శకుడు షాద్ అలీతో దర్శకత్వంలో పనిచేయడం ఎలాంటి అనుభూతి కలిగించిందని ప్రశ్నించగా ఎంతో సరదాగా ఉందంది. కొంత విస్మయం కూడా కలిగించిందంది. సెట్‌పై ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ షాద్ సరదాగానే ఉంటాడంది. అతనితో ఎలాంటి ఇబ్బందులూ లేవంది. షాద్ కోపిష్టి కాదని, అద్భుతమైన దర్శకుడని, అంతేకాకుండా మంచి స్నేహితుడు కూడా అని చెప్పింది. షూటింగ్ అయిపోయాక తామంతా సరదాగా గడిపేవారమని, పార్టీలు కూడా చేసుకునేవారమని తెలిపింది. ఈ సిఇనమాలో తనతోపాటు నటిస్తున్న రణ్వీర్, షాద్లు మంచి స్నేహితులని అంది. బాలీవుడ్‌లోకి బయటి నుంచి వచ్చారా అని అడగ్గా అవునంది. రణ్వీర్తో తన మనోభావాలను పంచుకున్నానని, యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ తీసిన సినిమాల్లో నటించే సమయంలో అతనికి కెరీర్ గెడైన్స్ చేసేదానినని అంది. రణ్వీర్ తన సహనటుడని, అయితే దర్శకుడు షాద్ గురించి తనకు అంతగా తెలియదంది. రణ్వీర్తో మాట్లాడిన ఐదు నిమిషాల సమయంలోనే అతనిపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందంది. అయితే షాద్ను అర్ధం చేసుకోవడం అంత తేలిక కాదంది. షాద్ ఏ విషయాన్ని బాగా లోతుగా ఆలోచించడంది. బాగా జోక్‌లు వేస్తుంటాడంది. తాను నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడంది. మనీశ్ శర్మతో మీకు సంబంధాలు ఉన్నాయంటూ వదంతుల మాటేమిటని ప్రశ్నించగా అది నిరంతర ప్రవాహమంది.