ఆ నమ్మకం నిజమవుతుందా? | Parineeti Chopra: I don't have aukat to demand National Award! | Sakshi
Sakshi News home page

ఆ నమ్మకం నిజమవుతుందా?

Published Sun, Nov 2 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

ఆ నమ్మకం నిజమవుతుందా?

ఆ నమ్మకం నిజమవుతుందా?

 ‘‘నాకు అవార్డులు వద్దు.. ప్రేక్షకుల ప్రశంసలు చాలు అని అనను. ప్రశంసలతో పాటు అవార్డులూ కావాలి. ప్రస్తుతం నాకో టార్గెట్ ఉంది’’ అని పరిణీతి చోప్రా అన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘కిల్ దిల్’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో చాలా గ్లామరస్‌గా నటించడంతోపాటు, చిత్రకథానాయకుడు రణవీర్ సింగ్‌తో అధర చుంబన సన్నివేశాలు కూడా చేశారు. ఈ చిత్రం నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని పరిణీతి అన్నారు. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇదనీ, ఇందులోని పాత్ర జాతీయ అవార్డు తెచ్చిపెడుతుందనే నమ్మకం కూడా ఉందనీ, ఆ అవార్డు సాధించాలన్నది తన లక్ష్యమనీ పరిణీతి పేర్కొన్నారు. మరి.. ఈ బ్యూటీ నమ్మకాన్ని ‘కిల్ దిల్’ నిజం చేస్తుందో లేదో కాలమే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement