Kiran-bedi
-
ఈ యువ టెన్నిస్ తార ఎవరో తెలుసా?
ఈ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరో గుర్తుపట్టగలరా? ఆమె టెన్నిస్ రంగంలో కంటే ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా దేశానికి సుపరిచితురాలు. తొలి మహిళా ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా మారారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె ఎవరో ఈపాటికి అర్థమై ఉంటుంది. ఆమే కిరణ్ బేడీ. ఐపీఎస్ అధికారిగా, అన్నా హజారే బృందం సభ్యురాలుగా, తాజాగా రాజకీయ నాయకురాలిగా బేడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె మంచి క్రీడాకారిణి అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కిరణ్ బేడీ కాలేజీ రోజుల్లో టెన్నిస్ బాగా ఆడేవారు. 1966, 1972 జాతీయ జూనియర్ లాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచారు. 1974లో ఆలిండియా హార్డ్ కోర్టు టెన్నిస్ టోర్నీలో టైటిల్ సాధించారు. ఇక 1976లో జాతీయ మహిళల లాన్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ టైటిల్ సొంతం చేసుకున్నారు. కిరణ్ సోదరీమణులు అను, రీటా.. తండ్రి ప్రకాశ్ పెషావారియా కూడా టెన్నిస్ క్రీడాకారులే. అను మూడు సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో కూడా ఆడారు. కాలేజీ రోజుల్లో కిరణ్ పూర్తి పేరు కిరణ్ పెషావరియా. పెళ్లయిన తర్వాత తన పేరును కిరణ్ బేడీగా మార్చుకున్నారు. -
'మాట మార్చిన కిరణ్ బేడి'
హైదరాబాద్: ఏడాది క్రితమే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన కిరణ్ బేడి ఇప్పుడు మాట మార్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు. జాతిని ఆర్ఎస్ఎస్ ఏకం చేస్తుందన్న కిరణ్‌బేడి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మత కలహాలు సృష్టించే సంస్థ ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ పై కేంద్రం, రాష్ట్రాలు వ్యాట్, ఎక్సైజ్ పన్నులు వేసి వినియోగదారులపై భారం పెంచుతున్నాయని దిగ్విజయ్ విమర్శించారు. రైతులకు అన్యాయం చేసేలా ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్‌ను ప్రజల మధ్యలోనే ఎండగడతామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పటిష్టత ఎజెండాగా సాగే చర్చలు ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయని దిగ్విజయ్ తెలిపారు. పార్టీనేతల నుంచి అభిప్రాయాలు సేకరించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నివేదిక అందిస్తామని దిగ్విజయ్ చెప్పారు. పీసీసీ చీఫ్‌ను విమర్శించే తమ పార్టీ ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కిరణ్ బేడీని వేడుకుంటున్నా: కేజ్రీవాల్
ఒకరు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరొకరు తాజాగా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థిని. ఇద్దరూ ఒకప్పుడు మంచి సహచరులే. కానీ తర్వాత విధానాలు మారాయి, దాంతో విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు దయచేసి తనను ఫాలో కానివ్వాలంటూ ఆయన ఆమెను వేడుకుంటున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ. ఆయన అరవింద్ కేజ్రీవాల్, ఆమె కిరణ్ బేడీ. ఇంతకుముందు తాను ట్విట్టర్లో కిరణ్ బేడీని ఫాలో అయ్యేవాడినని, కానీ ఇప్పుడు తనను బ్లాక్ చేశారని, దయచేసి అన్‌బ్లాక్ చేయాలంటూ బేడీని కేజ్రీవాల్ వేడుకున్నారు. కానీ దానికి కిరణ్ బేడీ ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. సుమారు 15 నెలల క్రితం ఆయన తనను తాను అరాచకవాదిగా చెప్పుకొన్నప్పుడే కేజ్రీవాల్‌ను బ్లాక్ చేశానని, ఆయనను ఇక అన్‌బ్లాక్ చేసే ప్రసక్తే లేదని కుండ బద్దలుకొట్టారు. ఆయన నెగెటివ్ వ్యాఖ్యలు రాస్తున్నారని, తన 40 లక్షల మంది ఫాలోవర్లకు ఆ వ్యాఖ్యలు చూపించి, తన ఖాతాను కలుషితం చేయలేనని చెప్పారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ అడుగుతున్నట్లుగా బహిరంగ చర్చ ఇప్పట్లో జరిగే ప్రసక్తి లేదని కూడా కిరణ్ బేడీ చెప్పారు. కేజ్రీవాల్ కేవలం చర్చలనే నమ్ముకుంటారని, తాము మాత్రం సేవలు అందించడాన్నే నమ్ముకుంటామని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయనతో తాను చర్చిస్తానని చెప్పారు. దేశంలోనే మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి అయిన కిరణ్ బేడీ.. పోలీసు విభాగం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి కాల ఉద్యమకారిణిగా మారారు. ఇక ఐఆర్ఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కేజ్రీవాల్.. సమాచారహక్కు చట్టం సాధన, అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో ముందుండి అటునుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో కిరణ్ బేడీ కూడా అన్నా హజారేకు శిష్యురాలిగానే ఉండేవారు. ఇప్పుడు వీళ్లిద్దరూ ప్రత్యర్థులుగా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనందుకు కిరణ్ బేడీకి కేజ్రీవాల్ అభినందనలు కూడా తెలిపారు. .@thekiranbedi congrats 4 being nominated as BJP's CM candidate. I invite u 4 a public debate moderated by neutral person n telecast by all — Arvind Kejriwal (@ArvindKejriwal) January 20, 2015 .@thekiranbedi Kiranji, i used to follow u on twitter. Now, u have blocked me on twitter. Kindly unblock me. — Arvind Kejriwal (@ArvindKejriwal) January 20, 2015 -
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్, బేడీ పోటాపోటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత కిరణ్ బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ ‘స్నాప్ పోల్’లో వెల్లడైంది. ఢీల్లీ సీఎం పదవికి ఉత్తమ అభ్యర్థిగా కేజ్రీవాల్ 47 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, ఇటీవలే బీజేపీలో చేరిన కిరణ్ బేడీ సర్వేలో 44 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఢిల్లీలో ఈ నెల 17-19 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 1,489 మంది పాల్గొన్నారు. కాగా, ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని జనవరి 11-15 తేదీల మధ్య న్యూస్ నేషన్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. -
ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటన పార్టీలో ఎలాంటి అసంతృప్తీ లేదని స్పష్టీకరణ శిరోమణి అకాలీదళ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్తామని వ్యాఖ్య న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడిపోయింది. ఢిల్లీ సీఎం పీఠానికి బీజేపీ తరఫున ఎవరు పోటీ పడతారన్న ఉత్కంఠకు పార్టీ తెర దించింది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ(65) ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటన చేశారు. కృష్ణానగర్ స్థానం నుంచి ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడతారని వెల్లడించారు. సోమవారం రాత్రి అమిత్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలకు కిరణ్ బేడీ నాయకత్వంలో ముందుకు వెళ్లాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా ఆమెనే ఉంటారు. కిరణ్ బేడీ కృష్ణానగర్ స్థానం నుంచి పోటీ చేస్తారు’’ అని వెల్లడించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కిరణ్ బేడీని చేర్చుకోవడంపై పార్టీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న వార్తలను అమిత్ షా తోసిపుచ్చారు. తమ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ తరఫున పోటీ చేసే 62 మంది పేర్లను వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలంద రూ మళ్లీ పోటీ చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధినేత సతీశ్ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. బేడీ హర్షం.. తనను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై కిరణ్ బేడీ హర్షం వ్యక్తంచేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ తన హృదయానికి అత్యంత దగ్గరగా ఉందని, నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. రోజంతా హైడ్రామా.. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందు ఢిల్లీ బీజేపీలో హైడ్రామా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసిన సమయంలో ఊహించని విధంగా ఆమెను ఎన్నికల రంగంపైకి తీసుకురావటంపై కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిగా ఆమెను ప్రకటిస్తారని వచ్చిన వార్తలతో సీనియర్ నేతలు చిన్నబుచ్చుకున్నారు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ బేడీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ఆమె బీజేపీలో కేవలం ఓ కార్యకర్త మాత్రమేనని, ఆమె అదే భావనలో పార్టీకి సేవ చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. టీ కప్పులో తుపాను..: ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలను బేడీ ఆదివారం తన ఇంటికి టీ పార్టీకి ఆహ్వానించారు. పార్టీ కార్యాలయం ద్వారా వారికి ఆహ్వానాలు పంపారు. దీన్ని ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. మనోజ్ తివారీతో పాటు ఉదిత్‌రాజ్ దానికి హాజరుకాలేదు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆలస్యంగా వచ్చారు. మిగతా ఎంపీలు అంటే రమేష్ బిధూడీ, ప్రవేశ్ వర్మ, మహేష్ గిరీ మీనాక్షీ లేఖీ, విజయ్ గోయల్ ఈ తేనీటి విందుకు హాజరయ్యారు. ముందస్తుగా నిర్ధారించిన కార్యక్రమం కారణంగా తేనీటి విందుకు హాజరుకాలేకపోయినట్లు ఉదిత్ రాజ్ తెలపగా బేడీ నివాసానికి వెళ్లడం సముచితం కాదని భావించనందువల్ల తాను పార్టీకి వెళ్లలేదని మనోజ్ తివారీ తెలిపారు. బేడీ బీజేపీ సీఎం అభ్యర్థి కాదని, పార్టీ ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని, అందువల్లే తాను హాజరు కాలేదన్నారు. కాగా, బేడీపై అసంతృప్తి వ్యక్తంచేసిన మనోజ్ తివారీని పార్టీ మందలించింది. దాంతో ఆయన వివరణ ఇచ్చారు. తన మాటలు ఎవరినైనా బాధించినట్లయితే అందుకు విచారిస్తున్నానని చెప్పారు. -
'బీజేపీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం'
న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖమని మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్ బేడీ అభివర్ణించారు. ఈ మధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె .. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖంగా వెలిగిపోతుందని కిరణ్ బేడీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో పోటీచేయడానికి బీజేపీకి సరైన ముఖం లేకపోవడంతోనే కిరణ్ బేడీని మోదీ తెరపైకి తీసుకొచ్చారన్న ఆప్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు.'బీజేపీ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్. నేను నరేంద్ర మోదీ నాయకత్వం పనిచేయడానికే పార్టీలో చేరా. ఆయన నాయకత్వంలో పనిచేసే మేము కేవలం స్టార్స్ మాత్రమే' అని ఆమె తెలిపారు.