Kirgijisthan
-
అనూషను ఆదుకున్న కేటీఆర్.. ‘డాక్టర్‌గా తిరిగి రా’..!
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపధ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. (చదవండి: వైద్య విద్యార్థిని అవస్థలు .. శ్మశానంలో ‘డాక్టర్’ చదువు) పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అనూష వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్‌గా, వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూషకి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని బుధవారం కేటీఆర్ ప్రకటించారు. (చదవండి: కేటీఆర్ వాహనానికి చలాన్.. ట్రాఫిక్ ఎస్ఐని అభినందించిన మంత్రి) అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని.. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి రావాలని కేటీఆర్ కోరుకున్నారు.. ఈ సందర్భంగా అనూషకి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమెకు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: కేటీఆర్ మెచ్చిన ‘పేపర్ బాయ్’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా? -
అవరోధాలతో వంతెన
మనదేశంలో చదువుకొని, మనదేశపు పల్లెప్రజలకు సేవచేయాలనే సంకల్పంతో ప్రారంభమైన సోనాల్ ప్రయాణం తను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమెను ఎక్కడో సుదూర తీరాలకు చేర్చింది. ఇక్కడి వైద్యవిద్యాభారం భరించలేక అష్టకష్టాలూ పడి రష్యా వెళ్లి చదువుకొని.. మన దేశ విద్యార్థుల కోసం కిర్గిజ్‌స్థాన్ వైద్యవిద్యావిధానంలోనే మార్పులకు కారణమవడం ద్వారా తన స్వప్నాన్ని సాకారం చేసుకున్న సోనాల్‌తో ఫ్యామిలీ మాటామంతీ... ‘‘ఓ మధ్య తరగతి పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు పేదరికం పెద్దగా తెలియదు. కష్టాలు కన్నీళ్లు తెలియకుండా పెంచారు మా అమ్మానాన్న. నాన్న ఢిల్లీ మదర్ డెయిరీలో మేనేజర్. అమ్మ కారులో షాల్స్ వేసుకొని తనే స్వయంగా కారు నడుపుకుంటూ ఇంటింటికీ తిరిగి అమ్మేవారు. అలా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాం. అందుకే ఇక్కడ సీటు రాకపోతే రష్యాలో మెడిసిన్ చదివించారు నన్ను. నేను ఢిల్లీలోనే పుట్టినా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త మాత్రం తెలంగాణలోని ఓ పల్లెటూళ్లో పుట్టారు. వాళ్ల నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్. ఆ చిన్న ఊళ్లో ఆయన చేసే వైద్యం కోసం క్యూ కట్టేవారు. ‘అది పెద్ద విషయమేమీ కాదనీ, ప్రసవం కోసం మహిళలను మా ఊళ్లలో మైళ్లదూరం డోలెకట్టుకొని తీసుకెళ్లేవారని’ చెప్పేవారు నా భర్త. ఆయన పేరు ఫణి. నరకమెక్కడో లేదు ఒక స్త్రీజీవితంలో ప్రసవం దానికదే పునర్జన్మ. కానీ మన దేశంలో ప్రసవం మరణంతో సమంగా మారుతోంది చాలా చోట్ల. నన్నడిగితే నరకం ఎక్కడో లేదు. వైద్యుడు లేని చోటే నరకం అన్నది నా అభిప్రాయం. ప్రసవం కోసం వాగులూ వంకలూ దాటుకొని గంటల తరబడి ప్రయాణిస్తారని విన్నప్పుడు, చదివినప్పుడూ నిలువెల్లా కదిలిపోయాను. మన దేశంలో వైద్యం సామాన్యులకు అందనంత దూరంలో ఉండిపోతోంది. వైద్య విద్య సంగతి ఇక చెప్పక్కర్లేదు. కోట్ల రూపాయలు పోసి వైద్య విద్యను కొనుక్కునే పరిస్థితి సాధారణ మధ్యతరగతి వారికెలా సాధ్యం? ఇదే పరిస్థితి నన్నైనా, నా సహచరుడినైనా విదేశాలకు వెళ్లి చదువుకునేలా చేసింది. అందని వైద్య విద్య వైద్యుడు లేని గ్రామం ఉండకూడదన్నది నా ఆలోచన. ఈ దేశంలో వైద్యుల కొరత తీరాలంటే రెండు జరగాలి. ఒకటి మన దేశంలో వైద్య విద్యకయ్యే ఖర్చు ఆకాశాన్నుంచి భూమ్మీదకు దిగిరావాలి. లేదంటే తమ పిల్లలు డాక్టరు కావాలనే తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరాలంటే మన పిల్లలే ఆ విద్య కోసం ఖర్చు తక్కువగా ఉండే దేశాలకు తరలి వెళ్లాలి. మొదటిది అసాధ్యం అని తేలిపోయింది. ఇక రెండోవిషయం పైనే నేనూ, నా భర్త చాలా రోజులు ఆలోచించాం. మనదేశంలో అందని వైద్య విద్యని మన పిల్లలకు అందుబాటులోకి తేవాలనుకున్నాం. సోవియట్ రష్యాలో భాగంగా ఉండి తరువాత విడిపోయిన కిర్గిజ్‌స్థాన్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి (కిర్గిజ్‌స్థాన్ స్టేట్ మెడికల్ అకాడమీ) మొదట కొందరు విద్యార్థులను పంపాం. ప్రస్తుతం కిర్గిజ్‌స్థాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు మరో ఎనిమిది కాలేజీలకు విద్యార్థులను పంపిస్తున్నాం. మన దేశంలో గ్రామగ్రామాన వైద్యుడు అందుబాటులో ఉండాలన్న మా ఆకాంక్ష యిప్పుడిప్పుడే కొత్తరెక్కలు విచ్చుకుంటోంది. త్వరలోనే మా అత్తగారి ఊళ్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి కట్టించే ప్రయత్నంలో ఉన్నాం. మూడు రోజులు తిండి లేకుండా! వైద్య విద్య ఖర్చు తక్కువే అయినా అక్కడి తిండిని తట్టుకోలేక ఇంటిపైన బెంగపెట్టుకునే విద్యార్థులెందరో. అక్కడి ఆహారపుటలవాట్లు వేరు. మన పిల్లలు ఆ తిండి తిని ఎక్కువ రోజులుండడం కష్టతరమైన పనే. రష్యాలోని కిర్గిజ్‌స్థాన్‌లో చదువుకునేప్పుడు నేను మూడు రోజులు తిండి లేకుండా గడిపాను. అప్పటికి అక్కడ మెస్ ఉండేది కాదు. మేమే స్వయంగా వండుకుని తినాల్సి వచ్చేది. నాతో పాటు ఉండేవాళ్లు వెళ్లిపోయారు. నాకు భాష రాదు. ఎక్కడికెళ్లాలో తెలియదు. బయటకెళితే ఏదైనా చేస్తారేమోనని ఇంట్లో చెప్పిన జాగ్రత్తల భయం. గదిలో ఓ మూలన ఆకలితో ముడుచుకు పడుకున్నా. నాకు మిత్రులు వచ్చాక కానీ తిండి దొరకలేదు. అందుకే మన దేశం నుంచి కిర్గిజ్‌స్థాన్ వెళ్లే విద్యార్థులకోసం ప్రత్యేకించి మన ఆహారాన్ని అక్కడే పండించే ఏర్పాటు చేశాం. భూమిని కౌలుకు తీసుకొని మన పంటలు సైతం అక్కడ పండిస్తున్నాం. స్వయంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా బంధువులతో ఆంధ్రా హాస్టల్‌నీ, మెస్నీ ఏర్పాటు చేశాం. మన సొరకాయలూ, మన వంకాయలూ, మన బీరకాయ పప్పుతో భోంచేసే అదృష్టం మన పిల్లలకి కిర్గిజ్‌స్థాన్‌లో కూడా సాధ్యమేనంటే నమ్మగలరా? ఏడేళ్లు... రష్యన్ భాషలో..! మేం రష్యాలోని కిర్గిజ్‌స్థాన్‌లో చదువుకున్నప్పుడు మెడిసిన్ ఏడేళ్ల పాటు చదవాల్సి వచ్చేది. అది కూడా రష్యన్ భాషలోనే విద్యాబోధన ఉండేది. అది అర్థం చేసుకోవడానికి మేం పడ్డ కష్టాలు ఆ దేవుడికే ఎరుక. అయినాసరే అక్కడ చదువు మమ్మల్నిద్దర్నీ మేమెంతగానో ప్రేమించే వైద్య వృత్తిలో నిలదొక్కుకునేలా చేయలేకపోయింది. అందుకే అందరికీ అనుకూలంగా ఉండే ఆంగ్లబోధన ఉంటే ఎంత బాగుంటుందని అనుకునేవాళ్లం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు. అది ఒంటబట్టించుకునే భాష కూడా ప్రధానమే. కిర్గిజ్స్థా¯Œ విద్యావిధానంలో మార్పుకి మా శాయశక్తులా కృషి చేశాం. ఆ దేశ విద్యావిధానంలో మార్పు జరిగితేనే మన విద్యార్థులకు వైద్యవిద్య సులభమౌతుంది. మొదట రష్యన్ భాషలో విద్యాబోధన మన విద్యార్థులెదుర్కొంటోన్న ప్రథమ అడ్డంకి. దానికి స్వస్తి పలకాలంటే రష్యన్ భాషకి బదులు ఇంగ్లిషులో విద్యాబోధన ఉండాలి. అతికష్టం మీద కిర్గిజ్‌స్థాన్‌లో ఆ మార్పు తీసుకురాగలిగాం. ఏడేళ్ల వైద్య విద్యని మనదేశంలోలా ఐదేళ్లకు తగ్గించేలా చేశాం. ఈ రెండు మార్పులూ మన భారతీయ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి’’ అని ముగించారు సోనాల్. – అరుణ అత్తలూరిఫొటో : రఘుబీర్‌సింగ్ -
కిర్గిజ్‌తో పెట్టుబడుల ఒప్పందానికి తుదిరూపు
బిష్కెక్: కిర్గిజిస్తాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు అయిదేళ్ల మార్గదర్శ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే, ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి తుది రూపు కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. భారత్– కిర్గిజ్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. భారత్, కిర్గిజిస్థాన్ దేశాల్లో వివిధ రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఇరు దేశాల వ్యాపార వర్గాలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కిర్గిజిస్తాన్‌లో టెక్స్టైల్స్, రైల్వేస్, జల విద్యుత్, మైనింగ్, ఖనిజాన్వేషణ తదితర రంగాల్లో భారత వ్యాపారవేత్తలకు అవకాశాలు ఉన్నాయన్నారు. -
సరిహద్దులు లేని ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరగటం ఆందోళనకరం శాంతియుత, సురక్షిత పొరుగు ప్రాంతాన్ని కోరుకుంటున్నాం కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో భేటీ అనంతరం ప్రధాని మోదీ వెల్లడి బిషెక్: తీవ్రవాదం, ఉగ్రవాదం సరహద్దులు లేని ప్రమాదమని ప్రధాని మోదీ అభివర్ణించారు. దానిపై పోరాడాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. ‘‘మన ప్రాంతంలో సవాళ్లు నెలకొని ఉన్న ఈ కాలంలో శాంతియుతమైన, సురక్షితమైన పొరుగు ప్రాంతం ఉండాలని మా ఇరు దేశాలూ కోరుకుంటున్నాయి’’ అని ఆయన కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు అల్మాజ్బెక్ అతాంబాయేవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మధ్య ఆసియాలో ఆరు దేశాల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి కిర్గిజిస్థాన్ చేరుకున్న మోదీ ఆదివారం ఆ దేశాధ్యక్షుడితో చర్చలు జరిపారు. ఇరు దేశాలూ.. వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించటంతో సహా రక్షణ సహకారం, సాంస్కృతిక సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండు దేశాల ఎన్నికల సంఘాల మధ్య సహకారంపై అవగాహన ఒప్పందం, ప్రమాణాల రంగంలో సహకారంపై ఎంఓయూలపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం, ఇతర నేరాలపై పోరాటానికి సంబంధించి ఒప్పందం చేసుకోవటాన్ని వేగవంతంగా పరిశీలించాలని అంగీకారానికి వచ్చాయి. మధ్య ఆసియాలో కిర్గిజ్ కీలకం... మధ్య ఆసియాలోని మొత్తం ఐదు దేశాల్లో తన పర్యటన.. ఈ ప్రాంతంతో సరికొత్త సమునున్నత సంబంధాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను విశదీకరిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో కిర్గిజిస్థాన్ ఒక కీలకమైన భాగమని అభివర్ణించారు. కిర్గిజ్ సాయుధ బలగాలకు.. భారత్ నుంచి చిన్నపాటి క్షేత్ర వైద్య పరికరాలను అందించటం తనకు సంతోషాన్నిస్తోందని చెప్పారు. కిర్గిజ్‌తో భారత్‌తో టెలీ-మెడిసిన్ అనుసంధానం కోసం తాను నిరీక్షిస్తున్నాని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వతసభ్యత్వానికి కిర్గిజ్ బలంగా మద్దతు ఇస్తుండటం పట్ల మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఐరాస శాంతి స్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమ సైనికాధికారులకు భారత్ శిక్షణ ఇవ్వటం పట్ల కిర్గిజ్ కృతజ్ఞతలు తెలిపింది. తమ దేశంలో మైనింగ్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా భారత ఆర్థిక వాణిజ్యసంస్థలను ఆహ్వానించింది. కిర్జిజ్లో భారత ఆయుష్ (ఆయుర్వేద, యోగా - నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి) కేంద్రాన్ని స్థాపిస్తామన్న భారత్ ప్రతిపాదనకూ సమ్మతించింది.