బిష్కెక్: కిర్గిజిస్తాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు అయిదేళ్ల మార్గదర్శ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే, ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి తుది రూపు కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. భారత్– కిర్గిజ్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. భారత్, కిర్గిజిస్థాన్ దేశాల్లో వివిధ రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఇరు దేశాల వ్యాపార వర్గాలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కిర్గిజిస్తాన్‌లో టెక్స్‌టైల్స్, రైల్వేస్, జల విద్యుత్, మైనింగ్, ఖనిజాన్వేషణ తదితర రంగాల్లో భారత వ్యాపారవేత్తలకు అవకాశాలు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment