kisan mela
-
30 నుంచి బెంగళూరులో కిసాన్ మేళా, దేశీ విత్తనోత్సవం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.) ఆధ్వర్యంలో మార్చి 30–31 తేదీల్లో రైతు మేళా, దేశీ విత్తనోత్సవం జరగనున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మార్పుల నేపథ్యంలో కరువు, చీడపీడలను తట్టుకోవడానికి తమ సంప్రదాయ విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని విత్తుకోవడమే ఉత్తమం. దేశీ విత్తన స్వాతంత్య్రం, దేశీ గోమాతే రైతులకు రక్షగా నిలుస్తాయని ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. భావిస్తోందని ప్రతినిధి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ అంశాలపై రైతులను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే దేశీ విత్తన సంరక్షకులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. రెండున్నర కిలోల దేశీ వరివిత్తనంతో ఎకరం సాగు చేసే శ్రీ పద్ధతి, పావు కిలో విత్తనంతో సాగు చేసే పెరుమాళ్లు పద్ధతి, పంటల ప్రణాళిక రూపకల్పన, దేశీ విత్తన సంరక్షణలో మెలకువలు తదితర అంశాలపై ప్రకృతి వ్యవసాయదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907 కుంకుడు గుత్తులు! సాధారణంగా కుంకుడు చెట్టుకు కాయలు విడివిడిగా కాస్తాయి. ఆశ్చర్యకరంగా ఈ చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం జనగామకు సమీపంలో ఓ మెట్టభూమి గట్టు మీద ఈ చెట్టు ఉండగా సుస్థిర వ్యవసాయ కేంద్రం డా. జి. రాజశేఖర్ దృష్టిలో పడింది. ఈ విత్తనాలు కావాలనుకున్న వారు డా. రాజశేఖర్‌ను 83329 45368 నంబరులో సంప్రదించవచ్చు. 24న సేంద్రియ గొర్రెల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 24 (ఆదివారం)న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సాంకేతిక అధికారి డా. టి. వెంకటేశ్వర్లు, పశువైద్యులు డా. జి. రాంబాబు(కడప), గొర్రెల పెంపకందారుడు రషీద్ రైతులకు అవగాహన కల్పిస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు.. 97053 83666, 0863–2286255. కట్టె గానుగల నిర్వహణపై 3 రోజుల శిక్షణ .సహజ సాగు పద్ధతిలో పండించిన నూనెగింజలతో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పరిశుభ్రమైన రీతిలో కట్టె గానుగలో వంటనూనెలను వెలికితీయడంపై యువతీ యువకులకు మార్చి 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండె శివశంకర్ తెలిపారు. కనీసం పదోతరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈ నెల 24లోగా 81210 08002, 70133 09949లలో ఏదో ఒక నంబర్‌కు ఎస్.ఎం.ఎస్. లేదా వాట్సప్ ద్వారా సమాచారం పంపాలని ఆయన కోరారు. -
రేపు ఎస్బీఐ రైతు మేళా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 18న కిసాన్ మేళాను నిర్వహిస్తోంది. రెండు రాష్ట్రాల్లో 1,550 గ్రామీణ, పట్టణ శాఖల్లో ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవచ్చు. అలా చేసుకున్న వారికి 10 శాతం రుణ పరిమితిని పెంచుతామని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎస్బీఐలో 1.50 కోట్ల మంది రైతులకు ఖాతాలున్నాయని, రైతు మేళా ద్వారా కనీసం 10 లక్షల మంది రైతులనైనా చేరుకోవాలని లకి‡్ష్యంచామని తెలియజేసింది. వ్యవసాయ, ముద్ర రుణాలు, వ్యవసాయ సంబంధిత బ్యాంక్ కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పిస్తామని బ్యాంకు వెల్లడించింది. -
ఆధునిక వ్యవసాయం..లాభదాయకం
- రైతులకు అందుబాటులో పరిశోధన ఫలితాలు - బెట్టను తట్టుకునే నూతన వంగడాల ఆవిష్కరణ - నంద్యాలలో ఆకట్టుకున్న కిసాన్ మేళా నంద్యాలరూరల్: ఆధునిక వ్యవసాయం లాభదాయకమని..రైతులు పాత పద్ధతులను విడనాడాలని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎన్వీ నాయుడు, విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని డాక్టర్ వైఎస్సార్ సెంటనరీ హాల్లో ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి అధ్యక్షతన కిసాన్ మేళా నిర్వహించారు. అతిథులుగా డాక్టర్ ఎన్‌వీనాయుడు, డాక్టర్ రాజారెడ్డిలు మాట్లాడుతూ.. వ్యవసాయంలో మహిళలు, యువత పాత్ర పెరగాలన్నారు. నంద్యాలను సీడ్‌హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని వారు వివరించారు. తంగడంచ విత్తనోత్పత్తి కేంద్రంలో చిరు ధాన్యాలతో పాటు 21లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి బెట్టను తట్టుకొనే వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారన్నారు. నంద్యాల వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా నాలుగు రకాల కొత్త వంగడాలను ఆవిష్కరించామన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్ పురోగతి సాధించడంతో 2016–17కు ఉత్తమ జాతీయ పరిశోధనా కేంద్రం అవార్డు దక్కించుకుందన్నారు. కరువు ప్రాంతాల్లో పరిశోధనలు.. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో నూతన పరిశోధనలకు అనువైన ఆధునిక వసతులతో పరిశోధన శాశ్వత భవనాలకు ప్రభుత్వం రూ.14కోట్లు మంజూరు చేసిందని డాక్టర్ ఎన్‌వీనాయుడు, డాక్టర్ రాజారెడ్డిలు తెలిపారు. కరువు ప్రాంతాల్లో కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే సూచనలు అందిస్తారన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తక్కువ వర్షపాతం ఉండటంతో పంటల సాగులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని తూర్పు ప్రాంతమైన నంద్యాలలో విత్తన ఉత్పత్తికి అనువైన వాతావరణం ఉందన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ.. ఆత్మ పథకం ద్వారా రైతులకు విజ్ఞాన యాత్ర నిర్వహిస్తామన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కిసాన్ మేళాలో ఆకట్టుకున్న స్టాళ్లు.. కిసాన్ మేళా సందర్భంగా నంద్యాల మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మినీ ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల ప్రదర్శనను రైతులు, పాలిటెక్నిక్ విద్యార్థులు తిలకించారు. ప్రైవేటు ఎరువులు, పురుగు మందుల కంపెనీలు కూడా స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు అందజేశాయి. -
రేపు కిసాన్ మేళా
- విజయవంతం చేయాలని ఏడీఆర్ పిలుపు నంద్యాల రూరల్: వ్యవసాయ పరిశోధన స్థానంలోని డాక్టర్ వైఎస్సార్ సెంటనరీ హాలులో ఈ నెల 11వతేదీన కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కిసాన్ మేళాలో ప్రదర్శన క్షేత్ర సందర్శన, ప్రదర్శనశాల, రైతుల సభ, వ్యవసాయ పరిశోధన స్థానంలోని ప్రచార కరపత్రాల ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. 1400 రకాల పప్పుశనగ, 300 రకాల జొన్న, ప్రొద్దు తిరుగుడు, వరి, పత్తి, ఆవాలు, కుసుమ, పొగాకు తదితర జన్యు వైవిధ్యంపై చర్చ, పురిశోధన ప్రగతి, ఫలితాల వివరాలపై కిసాన్ మేళాలో చర్చిస్తామన్నారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, బనగానపల్లె ఎమ్మెల్యే బీసి.జనార్ధన్ రెడ్డి, వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్వి. నాయుడు, విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి హాజరవుతారన్నారు. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.