రేపు కిసాన్ మేళా
Published Tue, Jan 10 2017 12:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
- విజయవంతం చేయాలని ఏడీఆర్ పిలుపు
నంద్యాల రూరల్: వ్యవసాయ పరిశోధన స్థానంలోని డాక్టర్ వైఎస్సార్ సెంటనరీ హాలులో ఈ నెల 11వతేదీన కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కిసాన్ మేళాలో ప్రదర్శన క్షేత్ర సందర్శన, ప్రదర్శనశాల, రైతుల సభ, వ్యవసాయ పరిశోధన స్థానంలోని ప్రచార కరపత్రాల ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. 1400 రకాల పప్పుశనగ, 300 రకాల జొన్న, ప్రొద్దు తిరుగుడు, వరి, పత్తి, ఆవాలు, కుసుమ, పొగాకు తదితర జన్యు వైవిధ్యంపై చర్చ, పురిశోధన ప్రగతి, ఫలితాల వివరాలపై కిసాన్ మేళాలో చర్చిస్తామన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, బనగానపల్లె ఎమ్మెల్యే బీసి.జనార్ధన్ రెడ్డి, వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్‌వి. నాయుడు, విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి హాజరవుతారన్నారు. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Advertisement
Advertisement