హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 18న కిసాన్ మేళాను నిర్వహిస్తోంది. రెండు రాష్ట్రాల్లో 1,550 గ్రామీణ, పట్టణ శాఖల్లో ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవచ్చు.
అలా చేసుకున్న వారికి 10 శాతం రుణ పరిమితిని పెంచుతామని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో 1.50 కోట్ల మంది రైతులకు ఖాతాలున్నాయని, రైతు మేళా ద్వారా కనీసం 10 లక్షల మంది రైతులనైనా చేరుకోవాలని లకి‡్ష్యంచామని తెలియజేసింది. వ్యవసాయ, ముద్ర రుణాలు, వ్యవసాయ సంబంధిత బ్యాంక్ కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పిస్తామని బ్యాంకు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment