kisanreddi
-
తెలుగువారితో కిషన్‌రెడ్డి లైవ్
సాక్షి, హైదరాబాద్: ‘భారత్ కీ మన్‌కీ బాత్ మోదీ కే సాథ్’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పూర్వ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫేస్బుక్, ట్విట్టర్లలో లైవ్ కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారితో మాట్లాడి బీజేపీ మేనిఫెస్టో కోసం వారి అభిప్రాయాలను బుధవారం సేకరించారు. ఈ లైవ్ కార్యక్రమంలో విద్య, ఉపాధి, వైద్యం, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, తీవ్ర వాదం, వ్యవసాయం వంటి అంశాలపై ఆన్లైన్లో ప్రజలు కిషన్ రెడ్డితో ముచ్చటించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డు పడకుండా చూడాలని కోరారు. ఆవాస్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, ఎన్నికల్లో డబ్బు ప్రవాహం తగ్గించడానికి ఎన్నికల సంస్కరణలను తీసుకురావాలని చెప్పారు. వీటిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ బీజేపీ ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకునే పార్టీ కానీ ఒక కుటుంబం అభిప్రాయం మేరకు నడుచుకునే పార్టీ కాదన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందు పెడతామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచినా ఢిల్లీలో వాళ్లు చేసేది ఏమీ లేదు కాబట్టి అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రజలు మోదీకి మద్దతివ్వాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ రైతులు, ఇతర వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకున్నం దున వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలని బీజేపీనేత కిషన్‌రెడ్డి కోరారు. కేంద్ర బడ్జెట్లో వివిధ పథకాల కింద తీసు కున్న చర్యలతో రాష్ట్రంలోని 90% రైతులకు ప్రయో జనం చేకూరుతుందన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి, డా.ప్రకాశ్‌రెడ్డి, సుధాకరశర్మలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివిధ పంటలకు కనీస మద్దతు ధరతో పాటు, పావు, అర ఎకరం ఉన్న రైతులకు కూడా రూ.6 వేలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ కిట్‌లో, కిలో బియ్యం సబ్సిడీ, తదితర పథకాల్లో కేంద్ర వాటా గణనీయంగా ఉంటోందన్నారు. అయితే ఈ విషయంలో పలు రాష్ట్రాలు కనీసం కేంద్రప్రభుత్వ ప్రస్తావన కూడా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్, కేసీఆర్‌ల చుట్టూ తిరిగాయని, లోక్‌సభ ఎన్నికలు మోదీ, బీజేపీ, భారత్‌ల చుట్టూ తిరుగుతాయన్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందన్నారు. కొన్ని పార్టీలు ఈ బడ్జెట్‌ను తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు. ఆ రాష్ట్రాలు కలసిరావట్లేదు ఆయుష్మాన్ భారత్ పథకాన్నిరాష్ట్రాలతో కలసి అమలు చేద్దామంటే తెలంగాణ, పశ్చిమ బెంగాల్ కలసి రావడంలేదని కిషన్‌రెడ్డి అన్నారు. తెలం గాణలో పంటల బీమా పథకం సరిగా అమలు చేయడం లేదని అందుకే వివిధ పథకాల కింద కేంద్రమే లబ్ధిదారులకే నేరుగా ఇవ్వాలని నిర్ణయిం చిందని వివరించారు. తెలంగాణకు సంబంధించి ఐఐటీకి నిధులు, పంజగుట్టలో ట్రామా సెంటర్ ఏర్పాటు, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు, 11 నీటిపారుదల ప్రాజెక్టులకు, చర్లపల్లి రైల్వేషెడ్‌కు నిధులు వంటివి బడ్జెట్లో కేటాయించా రన్నారు. కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీకి వ్యవసాయ మంటేనే తెలియదని, పాలు గేదె నుండి వస్తాయా లేక దున్నపోతు నుండి వస్తాయా అన్నది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. -
నగరాన్ని విశ్వనరకంగా మార్చారు
-
నగరాన్ని విశ్వనరకంగా మార్చారు
► ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్ ►నగర రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి: కిషన్‌రెడ్డి హైదరాబాద్: వంద రోజుల ప్రణాళికలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. దాన్ని విశ్వనరకంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపిం చారు. నగరంలో గుంతలమయంగా మారిన రోడ్లు ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛిద్రమైన హైదరాబాద్ రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసన సభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి శనివారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలపై పన్నుల భారం మోపిన టీఆర్ఎస్ ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విదేశీ పర్యటనలతో కాలయాపన చేస్తున్న మంత్రి కేటీఆర్ నగర అభివృద్ధిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. నగరంలోని సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని కొందరు మంత్రులే స్వయంగా చెబుతున్నారంటే టీఆర్ఎస్ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్ధమవుతోందన్నారు. నాలాలకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే సరే... కానీ పేదల ఇళ్ల జోలికి వస్తే సహించేదిలేదన్నారు. చెరువుల భూము ల్లో నిర్మించిన అపార్ట్మెంట్లు, ఇళ్లకు ఎలా అనుమతులిచ్చారన్నారు. అంతర్జాతీయ రోడ్లను తలపించేలా నగర రోడ్లను నిర్మిస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ నరకానికి మార్గంగా మారిన రోడ్లపై వివరణ ఇవ్వాలని కిషర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలను కూల్చి కొత్తవి నిర్మించేందుకు కేటారుుస్తున్న నిధులతో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ పాదయాత్ర ఉద్రిక్తం
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి డిమాండ్‌తో మహా పాదయాత్ర - అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే నేతల బైఠాయింపు - పోలీసులు, కార్యకర్తల తోపులాట... - నేతల అరెస్టు హన్మకొండ: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం కంతనపల్లి నుంచి దేవాదుల వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తొలుత బీజేపీ నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, నెహ్రూ యువ సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్, మరికొందరు నేతలు కంతనపల్లి ప్రాజెక్టు వద్ద మహా పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర ఏటూరునాగారం మండలం ఏటూరు గ్రామం సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకొన్నారు. ఈ పాదయాత్రకు అనుమతి లేదని, భద్రతా కారణాల రీత్యా దానిని నిలిపేయాలని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నాయకులు అక్కడే బైఠాయించారు. ఈ సమయంలో కిషన్‌రెడ్డిని, పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కార్యకర్తలను దాటుకుని నేతలను ఏటూరునాగారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరాశ, నిస్పృహల్లో ప్రజలు: కిషన్‌రెడ్డి కేసీఆర్ పాలనతో ప్రజలు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 69 ఏళ్ల కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సాగు, తాగునీరుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బుధవారం ఒకే రోజు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకర విషయమని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని ప్రజలు ఆశించారని.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు. ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. -
కేంద్రం వల్లే తెలంగాణకు గ్రాంట్లు
సిమి ఉగ్రవాదులని ప్రకటించడానికే భయపడుతున్న ప్రభుత్వం 11న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు పన్నుల్లోవాటాగాను, గ్రాంట్లు రూపంలోనూ ఆదాయం పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయం వల్ల గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రానికి రూ.2,254 కోట్లు పెరిగిందన్నారు. 14వ ఆర్థికసంఘం నిధుల్లో ఐదేళ్ల కాలానికి పన్నుల్లో వాటా 85,128 కోట్లు పెరుగుతాయని చెప్పారు. గ్రాంట్లుగా రూ.3,028 కోట్లు అధికంగా వస్తున్నాయని వివరించారు. బెంగుళూరులో జరి గిన పార్టీ జాతీయ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జెట్లీ ఈ వివరాలను తమకు అందించినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. అది పూర్తి బాధ్యతా రాహిత్యమే.. నల్లగొండ జిల్లాలో జరిగిన సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సిమీ ఉగ్రవాదులే దాడులకు తెగబడ్డారని పోలీసులు, జాతీయ స్థాయి నేర పరిశోధనా సంస్థలు చెబుతుంటే హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అది దోపిడీ దొంగల ముఠా అని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. సిమీ ఉగ్రవాదులేనని చెప్పడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కిషన్‌రెడ్డి నిలదీశారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఇంటిలిజెన్స్, కౌంటర్ ఇం టిలిజెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయాల న్నారు. సాధారణపోలీసులకూ ఆక్టోపస్ తర హా శిక్షణ ఇవ్వాలన్నారు. సూర్యాపేట ఘట నలో చనిపోయిన హోంగార్డు కుటుంబానికి కూడా పోలీసులకు అందించిన నష్టపరి హా రం అందించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశా రు. ప్రతిపక్షాల ప్రచారాన్ని ఎదుర్కొంటాం కేంద్ర ప్రభుత్వ పథకాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై, భూసేకరణ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటామని చెప్పారు. రైతులకు ఉపయోగకరమైన అంశాలను చేరుస్తూనే, భావితరాల అభివృద్ధికోసం ముందుచూపుతో రూపొం దించిన భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించడమే పనిగా కాంగ్రెస్ పెట్టుకుందని విమర్శించారు. సెజ్‌ల కోసమని రైతులను బెది రించి భూములను ప్రభుత్వం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏం చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర పార్టీ సూచనలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ నెల 11న పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృతసమావేశం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. 2019 నాటికి అధికారమే లక్ష్యంగా పార్టీని సంస్థాగత పటిష్ట పరుస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రస్థాయి నాయకులంతా సబ్సిడీ గ్యాస్‌ను వదులుకుంటున్నగా కిషన్ రెడ్డి వెల్లడించారు. బీజేపీతోనే దేశానికి రక్ష బీజేపీతోనే దేశం అన్ని రంగాల్లో సురక్షితమైన, దీర్ఘకాలిక అభివృద్ధి జరుగుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ సీనియర్ నేత, మాజీ గవర్నరు వి.రామారావు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, బీజేఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, నేతలు దినేశ్ రెడ్డి, బద్దం బాల్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
'నిజాం పాలనపై బహిరంగ చర్చకురావాలి'
నల్లగొండ: నిజాంను సమర్థిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. నిజాం పాలనపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలోని భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జెండా ఆవిష్కరించిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పైవిధంగా స్సందించారు. -
నిజాంను పొగడటం దివాలాకోరుతనమే
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేల మంది పోరాటయోధులను చంపడంతోపాటు మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నిజాం పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడటం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్ లాంటి వారిని దారుణంగా చంపిన క్రూరమైన నిజాం పాలనను పొగుడుతున్న కేసీఆర్... ఆ మహనీయుల పోరాటం నిజం కాదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్తున్నట్టుగా నిజాంది గొప్ప పాలనే అయితే దాశరథి లాంటి వారు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారని, సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో కేంద్రం ఎందుకు పోలీసు చర్యకు దిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో అరాచకాలు సృష్టించిన నిజాం ప్రైవేట్ సైన్యం నుంచి పుట్టుకొచ్చిన మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాగా, తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించే లక్ష్యంతో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. 7న సాయంత్రం వస్తున్న ఆయన మరుసటి రోజు ఉదయం పార్టీ రాష్ట్ర సలహా మండలి సమావేశం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పదాధికారులు, పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారన్నారు. -
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కుత్బుల్లాపూర్: మజ్లిస్‌తో చేతులు కలిపిన టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ విసృ్తతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎక్సలెన్సీ గార్డెన్లో నిర్వహించారు. బీజేపీ అర్బన్ అధ్యక్షుడు మీసాల చంద్రయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నవంబర్ మొదటి వారం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు ఉంటుందని, తరువాత అన్నిస్థాయిల కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. మజ్లిస్‌ను ఓడించాలి.. హైదరాబాద్‌ను రక్షించాలి.. గ్రేటర్ హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీ పూర్తిగా నాశనం చేసిందని, బీజేపీ శ్రేణులు ‘మజ్లిస్ పార్టీని ఓడించాలి.. హైదరాబాద్‌ను రక్షించాలి’ అన్న నినాదంతో ముందుకు సాగాలని కిషన్‌రెడ్డి పి లుపునిచ్చారు. హైదరాబాద్ పాత బస్తీ ఉగ్రవాదులకు సేఫ్ జో న్గా మారిందని ఆరోపించారు. కేసులు పెట్టకుండా.. అరెస్టులు చేయకుండా మజ్లిస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న గ్రేటర్ నగరంలో 80 డివిజన్లు ఏర్పడతాయని, వాటన్నింటిలో బీజేపీ పాగా వేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంచంద్రరావును గెలిపిచండి బీజేపీ తరపున హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాంచంద్రరావును గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతంలో 129 ఓట్లతో ఓడిపోయిన రాంచంద్రరావు ఈ దఫా ఎమ్మెల్సీగా గెలిచి పెద్దల సభలో గళం విప్పే విధంగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. కాగా సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, బద్దం సుభాష్‌రెడ్డి, రమేష్‌గౌడ్, రాష్ట్ర నాయకులు భీంరావు, స్వామిగౌడ్, జిల్లా ఇన్ఛార్జీ శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వరలక్ష్మి, ఉపాధ్యక్షుడు నాగేశ్వర్‌గౌడ్, బిల్డర్స్ వింగ్ జిల్లా కన్వీనర్ ఆదిరెడ్డి రాజిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు చెరుకుపల్లి భరతసింహారెడ్డి, జిల్లా నాయకులు నటరాజ్‌గౌడ్, నందనం దివాకర్, బక్క శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అర్బన్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం పలువురు పార్టీ నాయకులు రూ.50 లక్షల వరకు విరాళాలుగా అందజేస్తామని ప్రకటించారు.