బాలపేట చెరువులో బాలుడి మృతదేహం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అదృశ్యమైన బాలుడు కిషోర్‌కుమార్ నిహంత్ సాయి వర్మ(6) చెరువులో శవమై తేలాడు. ఖమ్మం జిల్లా బాలపేట చెరువులో అతడి మృతదేహం బయటపడింది. అతడిని ఎవరైనా హత్య చేశారా, అతడే చెరువులో పడి మరణించాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సాయి వర్మ ఈనెల 11న అదృశ్యమైయ్యాడు.
ఖమ్మం జడ్పీ సెంటర్లోని శ్యామల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన చెల్లిని పరామర్శించేందుకు వెళ్లింది. అక్కడ విమలాదేవి, ఆమె సోదరి మాట్లాడుకుంటుండగా సాయివర్మ ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి వరకు అతడిని వీరు గమనించలేదు. ఆ తరువాత, ఆ చిన్నారి కనిపించలేదు. ఆస్పత్రిలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, బస్టాండులో, రైల్వే స్టేషన్లో ఎంతగా వెతికినా ఆ చిన్నారి జాడ తెలీలేదు. దీంతో, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విమలాదేవి ఫిర్యాదు చేశారు.