K.Kesava Rao
-
నిమ్స్‌లో కేకేను పరామర్శించిన కేసీఆర్
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియర్‌నేత కే కేశవరావు సీఎం కేసీఆర్ పరామర్శించారు. సోమవారం నిమ్స్‌కు వచ్చిన కేసీఆర్.. కేకే ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, నిమ్స్ సంచాలకులు డాక్టర్ మనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. కేకే మూత్ర సంబంధిత సమస్య, జ్వరంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. -
కొమ్ములు మొలవొద్దు
నిరాడంబరంగా ఉండండి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ క్లాస్ ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ తరగతులు పార్లమెంటరీ నేతగా కడియం? హెదరాబాద్: అధికారంలోకి రాగానే ఆర్భాటాలకు పోవద్దని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు పార్టీ అధినేత, శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖరరావు హితవు పలికారు. శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభా పక్ష భేటీ జరిగింది. ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్ సుమారు గంటకు పైగా మాట్లాడారు. వారందించిన సమాచారం ప్రకారం... ఆర్భాటాలకు పోవద్దని సూచించారు. ‘‘ఎమ్మెల్యేగా గెలవగానే కొమ్ములు మొలుస్తయా? ఇప్పటిదాకా ఉన్నట్టే సామాన్యంగనే ఉండాలె. ఆహార్యంలో కూడా మీరేదో ప్రజలకు అతీతులన్నట్టుగా వ్యవహరించొద్దు. ఆర్భాటాలకు పోవొద్దు. సభలు, సమావేశాల్లో పూలదండలు వేసుకోవొద్దు’’ అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైతే తీవ్రమైన సమస్యలొస్తాయన్నారు. అదే జరిగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ‘‘వచ్చే రెండేళ్లు అత్యంత కీలకం. రాజకీయ అవినీతి లేకుండా అప్రమత్తంగా ఉందాం. కులం, మతం, ఆశ్రీత పక్షపాతం వంటివాటిని దగ్గరికి రానీయొద్దు. అధికారంలో ఉండాల్సిన వాళ్లుగా మనం కడుపు, నోరు కట్టుకుని పని చేయాల్సి ఉంది. రాబోయే రెండేళ్లే మన పనితీరుకు గీటురాయిగా ఉంటది’’ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు నాగార్జునసాగర్‌లో శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్టు కూడా కేసీఆర్ వెల్లడించారు. బాధ్యతలు, విధులు, అధికారాలు, వ్యవహరించాల్సిన తీరుపై వివరిస్తామని చెప్పారు. ఇక టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సీనియర్ నేత కడియం శ్రీహరిని ఎన్నుకునే అవకాశముంది. పార్లమెంటరీ పార్టీ నేతను ఎంపిక చేసే అధికారాన్ని కేసీఆర్‌కే టీఆర్ఎస్ ఎంపీలు కట్టబెట్టారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు ప్రమాణం చేయాల్సి ఉంది. అది కూడా పూర్తయ్యాక ఉభయ సభలకు కలిపి కేకేను, లోక్‌సభకు కడియంను ఎన్నుకోవచ్చని సమాచారం. కేసీఆర్‌కు శ్రీవారి ఆశీస్సులు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌కు టీటీడీ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ నేతృత్వంలో.. వేద పండితులు శనివారం హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. వేద పండితులు ఆశీస్సులు అందజేయగా.. అధికారులు శ్రీవారి పట్టువస్త్రాలతో సత్కరించారు. లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. - తిరుమల, సాక్షి -
'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్'
న్యూఢిల్లీః తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. పార్టీలో మెజార్టీ నేతలు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మూడు రోజుల కిందట ఢిల్లీ వచ్చిన కేకే సోమవారం ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలుస్తామని, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, ప్రమాణాలు చేశామని అవన్నీ నిజం కావాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. పార్టీ మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలతో పాటు నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో రాజీపడకుండా అందరికీ అభివద్ధి ఫలాలు అందేలా చూస్తామన్నారు. ఇదిలా ఉండగా, మూడు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేకే ధర్డ్ ఫ్రంట్‌లోని కీలక నేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిన కేకే అక్కడ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు కమ్యూనిస్టు నేతలతో కూడా చర్చలు జరిపారని చెబుతున్నారు. -
కేసీఆర్ సమర్థుడు: కె.కేశవరావు
హైదరాబాద్ బంగారు తెలంగాణను ఆవిష్కరింపజేయడంలో టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు సమర్థుడని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరైన కేకే పలు విషయాలపై మాట్లాడారు. కేసీఆర్ లాంటి వారు అరుదుగా ఉంటారని, టీఆర్ఎస్ను ఏనాడూ కాంగ్రెస్‌లో కలుపుతానని ఆయన అనలేదన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో సందేహం అక్కర్లేదని, 2 సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలపై అవగాహన కుదరకే సీపీఐతో పొత్తు కుదరలేదని అన్నారు. -
తెలంగాణ ఘనత టీఆర్ఎస్దే: కేకే
ఇబ్రహీంపట్నం తెలంగాణను సాధించింది టీఆర్ఎస్ అని, వ్యతిరేకించింది కాంగ్రెస్ అని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు తామే తెచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అమరవీరులకు సంతాప సూచకంగా పార్లమెంట్లో తీర్మానం చేయనివ్వకుండా కాంగ్రెస్ పెద్దలు అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న సవాళ్లను, ఒత్తిళ్లను అధిగమించడానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని అన్నారు. -
తెలంగాణను దేవుడు కూడా ఆపలేడు: కేకే
కొల్లాపూర్/మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: అమరవీరుల త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణను ఇక ఆ దేవుడు కూడా ఆపలేడని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు స్పష్టంచేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో జరిగిన పార్టీ శిక్షణ తరగతులకు కేకేతో పాటు మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. కేకే మాట్లాడుతూ.. సీమాంధ్ర నాయకులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని తమ ఆస్తులను కాపాడుకునేందుకు అనేక నాటకాలాడుతూ తెలంగాణ ఏర్పాటుకు మొకాలడ్డుతున్నారన్నారు. ఎలాంటి షరతులు లేని తెలంగాణ ఇవ్వకుంటే మరో విడత పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క అంగుళం కూడా వదులుకునే ప్రసక్తేలేదని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి తేల్చిచెప్పారు. -
సిఎం పాఠశాలస్థాయి నుంచే తొండి చేసేవారు:ఎంపి వివేక్
హైదరాబాద్: ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల స్థాయి నుంచే తొండి చేసేవారని ఎంపి వివేక్, మాజీ ఎంపి కె.కేశవరావు అన్నారు. స్కూల్‌స్థాయి నుంచే సిఎంకు ఓడిపోవడం అలవాటన్నారు. సిఎంను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సిఎంకు ఒక్క సర్పంచ్‌ను కూడా గెలిపించే సత్తాలేదన్నారు. సిఎం ఇరుప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సిఎంకు మానసికస్థితి సరిగాలేదన్నారు.