KKR vs SRH
-
అప్పట్లో పంజాబ్.. ఇప్పుడు సన్‌రైజర్స్: సెహ్వాగ్ ఘాటు విమర్శలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. పేరుకే జట్టులో ‘విధ్వంసకర బ్యాటర్లు’ ఉన్నారని.. కానీ వారి వల్ల ప్రేక్షకులకు ఎలాంటి వినోదం లభించడం లేదని పేర్కొన్నాడు. బౌలర్లకు అంతగా సహకరించని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై కూడా పరుగులు చేయలేక.. చేతులెత్తేయడం వారి పేలవ ప్రదర్శనకు నిదర్శనమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో అద్భుత బ్యాటింగ్‌తో ఫైనల్ వరకు చేరుకున్న సన్‌రైజర్స్.. టైటిల్ పోరులో మాత్రం 113 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బౌలింగ్‌లోనూ విఫలమై.. తద్వారా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)ని ఘనంగా ఆరంభించినప్పటికీ హ్యాట్రిక్ పరాజయాలతో చతికిల పడింది.ఒక్కరూ నిలబడలేదుతాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో ఫోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ ట్రవిస్ హెడ్ (Travis Head) మరుసటి బంతికే అవుట్ కాగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 2, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 2 పరుగులకే పెవిలియన్ చేరారు.ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (19) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. భాగస్వామ్యం నెలకొల్పుతారనుకున్న కమిందు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) కూడా నిరాశపరిచారు. మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడనుకున్న అనికేత్ వర్మ (6) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫలితంగా 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌట్ అయింది.80 పరుగుల తేడాతో ఓటమిఅంతకు ముందు ఇదే పిచ్‌పై చక్కటి షాట్లు ఆడుతూ కేకేఆర్ బ్యాటర్లు 200 పరుగులు స్కోరు చేశారు. అయితే, ఈ టార్గెట్‌ను ఎస్ఆర్హెచ్ సులువుగానే ఛేజ్ చేస్తుందనుకుంటే.. 120 పరుగులకే కుప్పకూలి.. 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రైజర్స్ బ్యాటర్లలో మెజారిటీ మంది సులువైన క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ చేరడం గమనార్హం.ఈ నేపథ్యంలో కేకేఆర్- సన్‌రైజర్స్ ఫలితంపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ హైదరాబాద్ జట్టు తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘ఒకప్పుడు పంజాబ్ జట్టుకు ఇలాంటి పేరుండేది. ముందు నుంచి రాణించడం ఆఖర్లో చేతులెత్తేయడం.. ఇప్పుడు సన్‌రైజర్స్ పరిస్థితి అలాగే కనిపిస్తోంది.కేకేఆర్ బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు.. కానీవాళ్లు 190 పరుగులు చేసి ఓడిపోయారు.. 160 రన్స్ చేసి ఓడిపోయారు. ఇప్పుడేమో 200 పరుగులు ఛేదించే క్రమంలో 120 పరుగులకే ఆలౌట్ అయ్యారు. నిజానికి కేకేఆర్ బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. బంతి కూడా టర్న్ కావడం లేదు. ఇదే పిచ్‌పై వాళ్ల బ్యాటర్లు 200 పరుగులు సాధించారు.అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు పిచ్ నుంచి అంతగా సహకారం కూడా అందలేదు. వికెట్ కాస్త స్లోగా ఉంది. అందుకే వాళ్లు ఎక్కువగా స్లో బాల్స్ వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటర్ క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త ఓపికగా ఎదురుచూడాలి. పరిస్థితులకు అలవాటుపడిన తర్వాత పరుగుల వేట మొదలుపెట్టాలి.కానీ ఈరోజు వాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. జట్టులో ఎంతో మంది బ్యాటర్లు ఉన్నారు. కానీ ఏం లాభం అవసరమైనపుడు ఒక్కరూ పరుగులు చేయలేకపోయారు. 120 పరుగులకే ఆలౌట్ అయ్యారు. జనాలు డబ్బు ఇచ్చి మరీ మీ ఆటను చూడటానికి వస్తారు.ఈసారి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరిగినా చాలా మంది సన్‌రైజర్స్ బ్యాటింగ్ చూసేందుకు వచ్చారనడం అతిశయోక్తి కాదు. కానీ మీరు వారందరినీ నిరాశకు గురిచేశారు’’ అని సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉కేకేఆర్ స్కోరు: 200/6 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 120 (16.4)👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై కేకేఆర్ గెలుపు.చదవండి: రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా? -
రూ. 20 కోట్లు లెక్కకాదు!.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)మూడోవాడు. లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రూ. 27 కోట్లు ఖర్చు చేస్తే.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.రూ. 23.75 కోట్లుఅయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్య రీతిలో వెంకటేశ్ అయ్యర్‌ను దక్కించుకునేందుకు రూ. 23.75 కోట్లు కుమ్మరించింది. నిజానికి గతేడాది అతడు అంత గొప్పగా ఏమీ ఆడలేదు. పదిహేను మ్యాచ్‌లలో కలిపి 370 పరుగులు సాధించాడు.అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలకమైన ఫైనల్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ అతడిని భారీ ధరకు దక్కించుకోవడం గమనార్హం.ఆరంభ మ్యాచ్‌లో ఆరు.. ముంబైపై మూడుఅయితే, ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లలో మాత్రం వెంకటేశ్ అయ్యర్ తేలిపోయాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్.. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు.మెరుపు బ్యాటింగ్ఈ క్రమంలో వెంకటేశ్‌కు కేకేఆర్ భారీ మొత్తం చెల్లించడం వృథా అయిందని పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా విమర్శకులందరికీ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు వెంకటేశ్. ఇన్నింగ్స్ ఆరంభంలో టెస్టు మ్యాచ్ మాదిరి ఆడిన అతడు ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.Lighting up Eden Gardens with some fireworks 💥 Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer's super striking 🍿👏5⃣0⃣ up for Iyer in the process!Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8— IndianPremierLeague (@IPL) April 3, 2025 కేవలం 29 బంతుల్లోనే వెంకటేశ్ అయ్యర్ 60 పరుగులు చేసి కేకేఆర్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. రైజర్స్పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెంకటేశ్ అయ్యర్ తన ‘ప్రైస్ ట్యాగ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే‘‘ఒక్కసారి ఐపీఎల్ మొదలైందంటే.. ఓ ఆటగాడు రూ. 20 లక్షలకు అమ్ముడుపోయాడా? లేదంటే రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాడా? అన్న విషయంతో సంబంధం ఉండదు. మనం ఎలా ఆడతామన్నది డబ్బు నిర్ణయించదు. మా జట్టులో అంగ్క్రిష్ రఘువన్షీ అనే కుర్రాడు ఉన్నాడు.అతడు ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఆటగాడి ధరకు అనుగుణంగానే అంచనాలూ ఉంటాయని నాకు తెలుసు. కానీ జట్టు విజయానికి ఒక ఆటగాడు ఎంత మేర తోడ్పడుతున్నాడన్నదే ముఖ్యం. పరిస్థితులకు అనుగుణంగా నేను ఈరోజు బ్యాటింగ్ చేశాను.ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?అంతేగానీ.. నేను అత్యధిక ధర పలికిన ఆటగాడిని గనుక ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలనే నిబంధన ఏమీ లేదు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావం చూపానా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రైస్ ట్యాగ్ వల్ల ఒత్తిడి ఉంటుందన్న మాట నిజం.ఈ విషయంలో నాకు అబద్ధం ఆడాల్సిన పనిలేదు. అయితే, ఆ ఒత్తిడి డబ్బు గురించి కాదు.. జట్టుకు నేను ఉపయోగపడుతున్నానా? లేదా? అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది సత్తా చాటిన అంగ్‌క్రిష్‌ను కేకేఆర్ తిరిగి రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటికే అతడు ఈ సీజన్లో ఓ హాఫ్ సెంచరీ బాదేశాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి 128 రన్స్ చేశాడు.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్👉కోల్‌కతా స్కోరు: 200/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 120 (16.4)👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై కేకేఆర్ విజయం.చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే -
IPL 2025: మా ఓటమికి ప్రధాన కారణం అదే: ప్యాట్ కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారలేదు. ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో మురిపించిన కమిన్స్ బృందం.. ఆ తర్వాత పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓడి హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసింది.ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్.. ఐపీఎల్-2024 రన్నరప్ సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆరంభంలో బాగానే రాణించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ కేకేఆర్ క్రమంగా పుంజుకుంది.దుమ్ములేపిన కేకేఆర్ బ్యాటర్లుకెప్టెన్ అజింక్య రహానే (38), అంగ్క్రిష్ రఘువన్షీ(32 బంతుల్లో 50), వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 60), రింకూ సింగ్ (17 బంతుల్లో 32 నాటౌట్).. ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Lighting up Eden Gardens with some fireworks 💥 Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer's super striking 🍿👏5⃣0⃣ up for Iyer in the process!Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8— IndianPremierLeague (@IPL) April 3, 2025 మూకుమ్మడిగా విఫలంఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ(2).. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్(2) మూకుమ్మడిగా విఫలమయ్యారు. నితీశ్ కుమార్ రెడ్డి (19), కమిందు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) కూడా నిరాశపరిచారు.ఫలితంగా కేకేఆర్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘‘వికెట్ బాగానే ఉంది. కానీ మేమే సరిగ్గా ఆడలేకపోయాం.తొలుత క్యాచ్‌లు వదిలేశాం. ఆఖర్లో పరుగులు సమర్పించుకున్నాం. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం. ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకోవాలి. సమీక్ష నిర్వహించి .. మరింత మెరుగైన ఆప్షన్ల కోసం ప్రయత్నించాలి.ఫీల్డింగ్ తప్పిదాల వల్లే ఓటమిమా బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నోసార్లు విజయాలు సాధించారు. కానీ ఈసారి మాత్రం అలా జరుగలేదు. అయితే, ఫీల్డింగ్ తప్పిదాల వల్లే మేము భారీ మూల్యం చెల్లించాం. ఓవరాల్‌గా చూస్తే బౌలింగ్ మాత్రం ఫర్వాలేదు.ఆరంభంలో క్యాచ్‌లు వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది. మేము కేవలం మూడు ఓవర్లే స్పిన్ వేశాం. బంతిపై మాకు అంతగా గ్రిప్ దొరకలేదు. అందుకే ఆడం జంపాను ఆడించలేదు. వరుస ఓటములు నిరాశపరిచాయి.అయితే, ఈ విషయాన్ని తలచుకుని కుంగిపోవాల్సిన పనిలేదు. తదుపరి సొంత మైదానంలో ఆడబోతున్నాం. అది మాకు సానుకూలాంశం’’ అని కమిన్స్ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. కాగా సీజన్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత లక్నో చేతిలో ఐదు వికెట్ల తేడాతో, ఢిల్లీ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉కేకేఆర్ స్కోరు: 200/6 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 120 (16.4)👉ఫలితం: సన్‌రైజర్స్‌పై 80 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వైభవ్ అరోరా (3/29).చదవండి: IPL 2025: గుజరాత్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ -
చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన రహానే సేన.. తాజాగా సొంత మైదానంలో మాత్రం అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై 80 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.ఆరంభంలోనే షాక్ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, హైదరాబాద్ పేసర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునిల్ నరైన్(7)ల వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్ అజింక్య రహానే (27 బంతుల్లో 38).. అంగ్క్రిష్ రఘువన్షీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.రఘువన్షీ హాఫ్ సెంచరీరహానే అవుటైన తర్వాత రఘువన్షీకి జతైన వెంకటేశ్ అయ్యర్ ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. అయితే, రఘువన్షీ మాత్రం చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగుల వద్ద ఉన్న వేళ కమిందు మెండిస్ బౌలింగ్‌లో అతడు వెనుదిరగడంతో.. రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు.ఆఖర్లో సీన్ రివర్స్ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. రింకూతో పాటు వెంకటేశ్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన వెంకటేశ్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించాడు.మరో ఎండ్‌లో రింకూ సింగ్ 17 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేకేఆర్ 200 పరుగులు సాధించింది. రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పెవిలియన్‌కు వరుస కట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్లుఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఆదిలోనే చేతులెత్తేసింది. కేకేఆర్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. విధ్వంసకర ఓపెనర్లుగా పేరొందిన ట్రవిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ(2) వచ్చీరాగానే అవుట్ కాగా.. ఇషాన్ కిషన్ (2) కూడా మరోసారి విఫలమయ్యాడు.నితీశ్ కుమార్ రెడ్డి (19) సైతం కాసేపే క్రీజులో ఉండగా.. కమిందు మెండిస్ (20 బంతుల్లో 27), హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వాళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 16.4 ఓవర్లలో 120 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌట్ అయింది.కేకేఆర్ బౌలర్లలో పేసర్ వైభవ్ అరోరా ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చి రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో వరుణ్ చక్రవర్తి మూడు, ఆండ్రీ రసెల్ రెండు, సునిల్ నరైన్, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలాఇక ఈ విజయం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. రైజర్స్పై కోల్‌కతాకు ఇది ఏకంగా 20వ గెలుపు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఆర్సీబీపై కూడా ఇప్పటి వరకు 20 విజయాలు సాధించిన కేకేఆర్.. పంజాబ్ కింగ్స్‌పై అత్యధికంగా 21 సార్లు గెలుపొందింది.ఈ క్రమంలో కోల్‌కతా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లపై 20కి పైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఐపీఎల్-2024 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపొంది చాంపియన్‌గా నిలవడం కేకేఆర్‌కు ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. ఈ గెలుపు ద్వారా కేకేఆర్ ఖాతాలో మూడో టైటిల్ చేరింది.ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్లు👉ముంబై ఇండియన్స్- కేకేఆర్‌పై 24 విజయాలు👉చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీపై 21 విజయాలు👉కేకేఆర్- పంజాబ్ కింగ్స్‌పై 21 విజయాలు👉ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్‌పై 20 విజయాలు👉కేకేఆర్- ఆర్సీబీపై 20 విజయాలు👉కేకేఆర్- సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20 విజయాలు.After impressing with the bat and in the field, #KKR 𝙬𝙖𝙡𝙩𝙯𝙚𝙙 their way to a handsome 80-run victory at home 😌💜Scorecard ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/Ne4LJhXNP4— IndianPremierLeague (@IPL) April 3, 2025 చదవండి: Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి... -
SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే!
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్‌ను ఘనంగా ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. అదే జోరును కొనసాగించలేకపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించిన కమిన్స్ బృందం.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన రైజర్స్.. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో గురువారం తలపడనున్న సన్‌రైజర్స్.. గత సీజన్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది.వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆందోళనకరంగా పరిణమించిందని పేర్కొన్నాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. ‘‘సన్‌రైజర్స్‌కు ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఇదే. మహ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్.. ఇప్పటి వరకు సంయుక్తంగా 18 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 217 పరుగులు ఇచ్చుకున్నారు.దీనిని బట్టి ప్రత్యర్థి బ్యాటర్లు వీరిద్దరి బౌలింగ్‌లో ఎంతలా చితక్కొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. షమీ, కమిన్స్ బౌలింగ్ మెరుగుపడితేనే సన్‌రైజర్స్ పరిస్థితి బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అదే విధంగా.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ‘‘జట్టులో ఒక స్పిన్నర్‌కే ఛాన్స్ ఇస్తారనిపిస్తోంది. సిమర్జీత్ పునరాగమనం చేస్తాడు.అయితే, గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన జీషన్ అన్సారీని మాత్రం తుదిజట్టు నుంచి పక్కనపెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో సిమర్జీత్ ఆడొచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.గత మ్యాచ్‌లో (ఢిల్లీ క్యాపిటల్స్) సన్‌రైజర్స్ తుదిజట్టు ఇదేట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.కేకేఆర్దీ అదే పరిస్థితిఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా పరిస్థితి కూడా రైజర్స్ కంటే భిన్నంగా ఏమీలేదు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఏడు వికెట్ల తేడాతో రహానే సేన ఓటమి పాలైంది. అనంతరం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో గెలిచిన కేకేఆర్.. అదే జోరును కొనసాగించలేకపోయింది. చివరగా ముంబై ఇండియన్స్‌తో తలపడి ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇప్పుడు సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.చదవండి: నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్ ప్రశంసలుTrust the process 🔄💪#PlayWithFire | #KKRvSRH | #TATAIPL2025 pic.twitter.com/pvVEwjV95c— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025