kodamgal
-
రేవంత్ అనుచరుల ఇళ్లపై దాడులు
సాక్షి, కోడంగల్ : టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసులు శనివారం రాత్రి దాడులు జరిపారు. దీంతో మఫ్టీ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ రేవంత్‌రెడ్డి ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో కొడంగల్ పట్టణంలోని రేవంత్ ముఖ్య అనుచరులైన మహ్మద్ యూసఫ్, నందారం ప్రశాంత్ తదితరుల ఇళ్లలో మఫ్టీ పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద ఏమీ దొరకకపోవడంతో పోలీసులు సామగ్రిని చిందరవందరగా పడేశారని వారు ఆరోపించారు. ఈనేపథ్యంలో 10 గంటల సమయంలో కొండగల్‌లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు తాండూరు–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇందులో రేవంత్ పాల్గొని అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనిఖీలు చేసింది ఎవరో తనకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లపై అధికార పార్టీ కక్షపూరితంగా దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తనకు ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ ‘విజయం’ ఖాయం
కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న కుట్రలు, కుతంత్రాలకు తెరదించుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు మండలాలకు చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు వంద నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యత అప్పగిందని చెప్పారు. ఇందుకోసం హెలికాప్టర్ వసతి కల్పించారని తెలిపారు. కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చుకోవడానికి అడ్డదారిలో పయనిస్తున్న వారి వివరాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం కొనసాగిస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రలా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన ప్రచారం నిమిత్తం హెలికాప్టర్లో ఆసిఫాబాద్‌కు వెళ్లారు. -
కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం
సాక్షి, వికారాబాద్ : ఎన్నికల వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ప్రచార అస్త్రంగా వినియోగించుకునేందుకు ఏఐసీసీ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రణాళిక రెడీ చేసిన కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుత ఎన్నికల్లో రేవంత్‌ను స్టార్ క్యాంపేయినర్‌గా వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రూట్ మ్యాప్‌ను ఖరారు చేయనుంది. కొడంగల్‌ను సమన్వయం చేసుకుంటూనే ఇతర సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేయాలని ఆదేశించింది. తెలంగాణలోని 69 సెగ్మెంట్ల లో నిర్వహించే సభలు, సమావేశాల్లో రేవంత్ పాల్గొననున్నారు. సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు చాపర్ సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి సైతం ధ్రువీకరించారు. దీనికి అనుగుణంగానే కొడంగల్‌లోని ఆయన నివాసం ఎదుట హెలిపాడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇందుకోసం పోలీసు శాఖ అనుమతులు రాలేదని సమాచారం. పర్మిషన్ వ్యవహారాన్ని అధిష్టానమే చూసుకుం టుందని రేవంత్ వాఖ్యానించారు. స్టార్ క్యాంపెయినర్.. రేవంత్‌రెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం అధిష్టానం ఎలా వినియోగించుకుంటే అలా సేవలందిస్తా.. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపి.. ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తా.. రాష్ట్ర వ్యాప్త పర్యటనల కోసం అధిష్టానం ప్లాన్ చేస్తోంది. వారిచ్చి న షెడ్యూల్‌ను అనుసరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. ఈ నెల 19న నామినేషన్ వేశాక ప్రచారం ప్రారంభిస్తాను. – రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 19న నామినేషన్.. రేవంత్‌రెడ్డి ఈ నెల 19న నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నామినేషన్ రోజున భారీ జన సమీకరణకు సన్నద్ధమవుతున్నారు. మరుసటి రోజైన 20వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. కొడంగల్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా ప్రచారానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకున్నారు. 20 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రేవంత్ ప్రచారం కొనసాగనుంది. 69 సెగ్మెంట్లలో పర్యటన.. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపేయినర్‌గా ప్రచార బరిలో దిగనున్న రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మొ త్తం 69 సెగ్మెంట్లలో నిర్వహించనున్న సభలు, సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఈయన ప్రచారానికి తన సొంత నియోజకవర్గం కేంద్ర బిందువు కానుంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు హెలికాప్టర్ వినియోగించనున్న నేపథ్యంలో.. రేవంత్ నిత్యం కొడగంల్లోని తన నివాసం నుంచే బయలుదేరి తిరిగి రాత్రి ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. వరుసగా రెండు రోజులు రాష్ట్రంలోని పలు సెగ్మెంట్లలో పర్యటించనున్న ఆయన ఒక రోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటిం చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇలా కొడంగల్‌లోనూ గ్యాప్ రాకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకూ బిజీబిజీగా ఉండనున్నారు. -
సీఎం పదవికి ఎసరు పెడుతున్న కొడంగల్!
మహబూబ్‌నగర్ జిల్లా కొండంగల్లో ఎన్నికల ప్రచారం సీఎం పదవికి ఎసరు పెడుతుందట. అసలు విషయానికి వస్తే ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం రాష్ట్ర ముఖ్యంత్రిగా పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా వచ్చి కొడంగల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే... వారు వచ్చే ఎన్నికల్లో ఆ పదవిని కోల్పోతారనే వింత సెంటిమెంట్ గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి నుంచి 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వరకూ కొడంగల్ వచ్చి మాట్లాడి.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వారు అధికారం కోల్పోవడంతో ఈ సెంటిమెంట్‌కు ఊతమిచ్చినట్లయింది.