చిత్తూరు జిల్లాలో దారిదోపిడీ
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం కొలమానసపల్లె వద్ద ఆదివారం దారిదోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు కారులో తిరుమలకు వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. వారినుంచి భారీగా నగదును అపహరించారు. అంతేకాక కారులో ప్రయాణిస్తున్న వారిని కిందకు దింపి కారుతో దుండగులు పరారైనట్టు సమాచారం.
బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.