komati reddt venkatreddy
-
TS Elections 2023: సొంత ఇల్లు లేదు.. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న భువనగిరి ఎంపీ
నల్లగొండ: తనకు సొంత ఇల్లు కూడా లేదని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో ఆయన ఆస్తుల వివరాలు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆస్తులతో పాటు అప్పులు కూడా పెరిగాయి. 2018 ఎన్నికల్లో స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ.68,37,727 ఉండగా.. ప్రస్తుతం స్థిర, చరాస్తులు కలిపి రూ.1,61,47,070గా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తన పేరిట అప్పు ఏమీ చూపని ఆయన ప్రస్తుతం రూ.1,70,00,000 అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. అదేవిధంగా 9.39 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉన్నట్లు చూపించారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సబిత పేరు మీద 2018 ఎన్నికల సందర్భంగా రూ.15,75,71,331 ఆస్తులు ఉండగా ప్రస్తుతం అవి రూ.37,62,25,329కు పెరిగాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. గతంలో ఆమె పేరు మీద రూ.2,41,88,856 అప్పు ఉండగా ప్రస్తుతం రూ.4,74,77,630కి అప్పు పెరిగిందని అఫిడవిట్లో చూపించారు. -
నేను ‘గుత్తా’ను కాదు పార్టీలు మారడానికి..
సాక్షి, యాదాద్రి : పూటకో పార్టీ మారడానికి నేను గుత్తా సుఖేందర్ రెడ్డిని కాదని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్ష పదివి ఇచ్చినా..ఇవ్వకున్నా.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. నల్గగొండ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఉన్న ఏడాది కాలమైనా మంచి పాలన అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత ఎలాగో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటి రెడ్డి జోస్యం చెప్పారు. స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఇలాంటి పాలన ఉండటం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని విమర్శించారు. వాటి గురించి ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామని ఈ సందర్భంగా కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
రాష్ట్రంలో రౌడీరాజ్యం సాగుతోంది
నిజాం, రజాకారుల పాలనను తలపిస్తోంది: సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి తిప్పర్తి: రాష్ట్రంలో రౌడీరాజ్యం సాగుతోందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోమారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తూ నిజాం, రజాకార్ల కాలంలో వలె పాలనను సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం నూతన మండలం మాడ్గులపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. వారంలో ఐదు రోజులు ఫాంహౌస్లో ఉండే సీఎం ఏ పాలన కొనసాగిస్తాడని ప్రశ్నించారు.