నల్లగొండ: తనకు సొంత ఇల్లు కూడా లేదని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల వివరాలు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆస్తులతో పాటు అప్పులు కూడా పెరిగాయి.
2018 ఎన్నికల్లో స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ.68,37,727 ఉండగా.. ప్రస్తుతం స్థిర, చరాస్తులు కలిపి రూ.1,61,47,070గా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తన పేరిట అప్పు ఏమీ చూపని ఆయన ప్రస్తుతం రూ.1,70,00,000 అప్పు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. అదేవిధంగా 9.39 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉన్నట్లు చూపించారు.
ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సబిత పేరు మీద 2018 ఎన్నికల సందర్భంగా రూ.15,75,71,331 ఆస్తులు ఉండగా ప్రస్తుతం అవి రూ.37,62,25,329కు పెరిగాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతంలో ఆమె పేరు మీద రూ.2,41,88,856 అప్పు ఉండగా ప్రస్తుతం రూ.4,74,77,630కి అప్పు పెరిగిందని అఫిడవిట్‌లో చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment