Komurayya
-
'మనవడి' పై తాత హత్యాయత్నం!
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన సామంతుల మహేశ్ (28)పై తాత సామంతుల కొమురయ్య హత్యాయత్నం చేశాడు. ఎస్సై సత్యనారాయణ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురయ్యకు కుమారుడు మల్లేశం, కూతురు కనుకవ్వ సంతానం. మల్లేశంకు వివాహమై ఇద్దరు కుమారులు జన్మించిన తరువాత దాదాపు 20ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతడి కుమారులిద్దరు అశోక్, మహేశ్‌ను కొమురయ్య పెంచి పెద్దచేశాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి వారికి తన వ్యవసాయ భూమిని పంపకం చేశాడు. కాగా మహేశ్ తరచూ తాగి వచ్చి తాతతో గొడవపడేవాడు. తన అన్న అశోక్‌కు ఎనిమిది గుంటల భూమి ఎక్కువ ఇచ్చావని దూషిస్తూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మహేశ్‌తో ఎప్పటికైనా తనకు ఇబ్బందులు తప్పవని కొమురయ్య భావించాడు. ఇంటి ముందు పడుకున్న మహేశ్‌పై శనివారం వేకువజామున గొడ్డలితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న అతడి తల్లి, భార్యకు మెలకువ వచ్చి బయటకు రావడంతో కొమురయ్య గొడ్డలిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మహేశ్ మేనమామ కట్ట కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మహేశ్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్ తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఇవి చదవండి: ఉసురు తీసిన నకిలీ జ్యోతిష్యుడు -
జైలులో రిమాండ్ ఖైదీ మృతి
కరీంనగర్ క్రైం: కరీంనగర్ జైలులో ఓ రిమాండ్ ఖైదీ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన సంబు కొమురయ్య (45)ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి కొమురయ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఆదివారం మరింత క్షీణించడంతో జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. అతను చనిపోయాడని ధ్రువీకరించారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు టౌన్ ఏసీపీ పి.అశోక్ విచారణ చేపట్టారు. ఆస్పత్రిని డీసీపీ చంద్రమోహన్ (పరిపాలన), టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్ తదితరులు సందర్శించారు. కాగా, న్యాయమూర్తి సాయి సుధ ఆస్పత్రి, జైలు లో వాంగ్మూలం తీసుకున్నారు. ప్రాణం ఖరీదు రూ.3 లక్షలు? ఇప్పలపల్లె గ్రామానికి చెందిన కొమురయ్య ప్రాణానికి పోలీసు అధికారులు రూ.3 లక్షలు ఖరీదు కట్టారు. కరీంనగర్ జిల్లా జైలులో ఆదివారం రాత్రి మృతి చెందగా, ఆస్పత్రికి చేరుకున్న బంధువులు, గ్రామస్తులు కొమురయ్య మృతదేహంపై గాయలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఆందోళనకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కుటుంబీకుల మధ్య చర్చలు జరిగాయి. చివరకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. కాగా, చర్చల సమయంలో పరిహారం అడిగినందుకు ఎల్ఎండీ ఎస్సై తమను బెదిరించాడని మృతుడి బంధువులు ఆరోపించారు. -
నిమజ్జనానికి వెళ్లి.. నీట మునిగి
చెరువులోపడి ఒకరి మృతి పంథినిలో ఘటన గణపతి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం చెరువులోకి వెళ్లిన ఓ వ్యక్తి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన మండలంలోని పంథినిలో సోమవారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... పంథినికి చెందిన పొన్నం కొమురయ్య(43) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం రాత్రి గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక విగ్రహం ఊరేగింపులో పాల్గొన్న కొమురయ్య నిమజ్జనంలో భాగంగా ఊర చెరువు వద్దకు చేరుకున్నాడు. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి యువకులతోపాటు అతడు నీళ్లలోకి దిగాడు. అరుుతే అతడికి ఈత రాకపోవడంతో నీటమునిగాడు. నిమజ్జన సంబురాల్లో ఉన్న యువకులు ఈ ఘటనను గమనించకుండా బయటకు వచ్చారు. తమ కంటే ముందుగానే కొమురయ్య ఇంటికి వెళ్లాడని భావించిన యువకులు గ్రామానికి వెళ్లిపోయూరు. మంగళవారం ఉదయం వరకు కొమురయ్య ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యువకులను విచారించారు. ఆచూకీ లభించకపోవడంతో స్థానికుల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసిన ప్రదేశంలో గాలించగా విగ్రహం కింద కొమురయ్య మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య ఐలమ్మ, కుమార్తెలు సరిత, శారద, కుమారుడు రాజు ఉన్నారు. ఐలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.