kondaram
-
టీజేఎస్‌కు అనుబంధంగా టీవైఎస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీకి అనుబంధంగా తెలంగాణ యువజన సమితి(టీవైఎస్) ఏర్పాటైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. టీవైఎస్ను ఏర్పాటుతోపాటు దానికి కో–ఆర్డినేషన్ కమిటీని నియమించారు. అనంతరం టీవైఎస్ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. భారీగా సభ్యత్వ నమోదు, యువజన విభాగం నిర్మాణంపై తక్షణమే దృష్టి సారించాలని పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ సందర్భంగా నేతలకు సూచించారు. టీవైఎస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్లు వీరే.. ఆశప్ప (ఓయూ), సలీం పాషా (ఓయూ), కల్వకుర్తి ఆంజనేయులు (ఓయూ), మాలిగ లింగ స్వామి (ఓయూ) పూసల రమేశ్ (ఓయూ), వినయ్ (హైదరాబాద్), రమణ్‌సింగ్ (హైదరాబాద్), పూడూరి అజయ్ (వికారాబాద్), వెంకట్‌రెడ్డి (సూర్యాపేట), శేషు (కేయూ), డాక్టర్ సంజీవ్ (కేయూ), డాక్టర్ విజయ్ (కేయూ), నరైన్ (హైదరాబాద్), దాసరి శ్రీను (భూపాలపల్లి), భరత్ (కొత్తగూడెం). టీజేఎస్ విద్యార్థి విభాగం ఏర్పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్) విద్యార్థి విభాగాన్ని శుక్రవారం ఏర్పాటు చేసింది. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యార్థి విభాగం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ నాయకుడు వెంకట్‌రెడ్డి తెలిపారు. కమిటీలోని సభ్యులు వీరే.. సర్దార్ వినోద్‌కుమార్–నిర్మల్ (ఓయూ), నిజ్జన రమేశ్ ముదిరాజ్–కామారెడ్డి (ఓయూ), ప్రవీణ్ ఆర్య, అరుణ్–హైదరాబాద్, రెడ్డి శ్రీనివాస్– కొడంగల్, బాబు మహాజన్, శివ ప్రసాద్–యాదాద్రి, గడ్డం వెంకటేశ్–మంచిర్యాల, ప్రశాంత్–జనగామ, శివరామ్–నాగర్‌కర్నూల్, అనిల్– మహబూబాబాద్, తల్లా ప్రవీణ్‌కుమార్–సిద్దిపేట, పాలెం శ్రీకాం త్‌రెడ్డి–మేడ్చల్, ప్రతాప్‌రెడ్డి–సూర్యాపేట, పంగ శ్యామ్–వరంగల్, కృష్ణకాంత్–నల్లగొండ, ప్రభాకర్–భూపాలపల్లి, సాయిరామ్ నాయక్–పెద్దపల్లి. -
మత కోణంలో చూడొద్దు: కోదండరాం
-
మత కోణంలో చూడొద్దు: కోదండరాం
హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విలీనదినంగా జరుపుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం తమ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రేపు విలీన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరపాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. విలీనదినాన్ని మత కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విలీనదినాన్ని అధికారికంగా జరపాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాము రేపు గోల్కొండలో జాతీయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎంఐఎం ఒత్తిడితోనే విలీన దినోత్సవాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకాడుతోందని ఆయన ఆరోపించారు. -
ఓసీపీల విధ్వంసం ఆగాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో మానవ జీవితాలను కొల్లగొడుతున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల విధ్వంసం ఆగాల్సిందేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గోదావరిఖనిలోని పోచమ్మ మైదానం(యు.రాములు ప్రాంగణం) లో ఆదివారం రాత్రి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇప్టూ) 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ అధిక బొగ్గు ఉత్పత్తి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రజల జీవన విధానాన్ని బొందల గడ్డలలో కప్పిపడేస్తున్న పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా భూగర్భ గనుల తవ్వకాన్ని పెంచాలని సూచించారు. ఇప్పటి వ రకు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన పది మంది కాంట్రాక్టర్లకే ఓసీపీలలో మట్టిని తొలగించే పనులు అప్పగించారని, ఇక నుంచి ఇలాంటి దోపిడీ విధానం పూర్తిగా మా రాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల అవసరం లేకుండా చేయాలని, సంస్థకు అవసరమైన పనిముట్లు, వస్తువులు సరఫరా చేసేం దుకు అనుబంధ పరిశ్రమలు అధికంగా రావాలన్నారు. గోదావరిఖని నుంచి కాగజ్‌నగర్ వర కు కోల్‌కారిడార్ నిర్మించాలని, ఒక్కో ప్రాం తంలో ఒక్కో సెక్టార్‌ను అభివృద్ధి పరిచి, కాలు ష్య రహిత పారిశ్రామికీకరణ చేపట్టాలన్నారు. సింగరేణి యాంత్రీకరణ వల్ల కార్మికుల్లో దాగి ఉన్న సృ జనాత్మకత తగ్గిపోతోందని, వారి ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపై కార్మికులు ఆలోచన చేయాలని, ప్రభుత్వం అడిగినప్పుడు ఏం కావాలో తెలపడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. సింగరేణిలో వెలుగులు నిండాలని జేఏసీ కోరుకుంటోందని తెలిపారు. కార్మిక సంక్షేమాన్ని మరిచిన సింగరేణి : సంధ్య సింగరేణిలో కార్మిక సంక్షేమాన్ని యాజమాన్యం మరిచిపోయిందని, వైద్య శాలలు, విద్యాసంస్థ లు మూసివేసి సింగరేణిని బొందల గడ్డగా మా ర్చి కార్మికుల జీవన విధానంపై గొడ్డలివేటు వేసిందని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య ఆ రోపించారు. ఇన్నాళ్లుగా బొగ్గుబాయి అంటూ వేదికలపై ప్రసంగాలు చేసి నేడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గని కార్మికుల సంక్షేమాన్ని బా ధ్యతగా తీసుకోవాలని కోరారు. కార్మికుల స మస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమం త ప్పదని హెచ్చరించారు. పారిశ్రామిక అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలని, ఖ మ్మం జిల్లా బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముం దు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి ఎస్కే ముక్తార్‌పాషా, జె.సీతారామయ్య, బి.సంపత్‌కుమార్, ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, చాంద్‌పాషా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్ అమ్మేందుకు కుట్ర
బీబీనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మించిన నిమ్స్ యూనివర్సిటీని అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని, ఉద్యమాలు చేపట్టడంతో దానిని అమ్మనివ్వకుండా ఆపగలిగామని తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆ యూనివర్సిటీ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రాజెక్టులను సీమాంధ్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. షుగర్, ఆల్విన్ పరిశ్రమల అమ్మకాలు జరిపిందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న మాదిరిగానే నాలుగేళ్లుగా నిమ్స్ కోసం ఉద్యమం చేయక తప్పడం లేదన్నారు. 2013 జూన్‌లో నిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగలేదనడానికి ఈ యూనివర్సిటీయే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్ పూర్తయితే బీబీనగర్, భువనగిరిలు అద్భుత వికాస కేంద్రాలుగా మారుతాయన్నారు. తెలంగాణ ప్రాంతం వైద్యరంగంలో పూర్తిగా వెనుకబడిందని, ఇక్కడ మెడికల్ యూనివర్సిటీలను నిర్మించాలని శ్రీకృష్ణ కమిటీయే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నిమ్స్‌ను అభివృద్ధి చేయకుండా.. అందుకు సంబంధించిన నిధుల జీఓ అమలు కాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. అదే విధంగా సీసీఎంబీ నిర్మాణం, ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ప్రాణహిత-చేవెళ్లకు తరలించేలా నిధులు ఖర్చు చేస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తే తప్ప పరిష్కారం లభించడం లేదన్నారు. పోరాట దిశగా వెళ్తే తప్ప నిమ్స్ పూర్తి కాదన్నారు. వైద్యసేవలు ప్రారంభమయ్యే వరకు ప్రజా సంఘాలు, విద్యార్థులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆస్తులను దోచుకున్న ఆంధ్రా పాలకులు ఆంధ్రా పాలకులు తెలంగాణలోని విలువైన భూములను, ఆస్తులను, ఉద్యోగాలను దోచుకొని అన్ని రంగాలలో తీరని అన్యాయం చేశారని కోదండరాం అన్నారు. కమిటీల పేరుతో ఉద్యోగ రంగాలలో అక్రమాలకు పాల్పడుతుండడం వల్లే తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. ముల్కీ రూల్స్ విధానాన్ని రద్దు చేసి ఇక్కడి వేల ఎకరాల విలువైన భూములను ఆంధ్రా పాలకులు స్వాధీన పరుచుకున్నారన్నారు. 610 జీఓ కోసం నిలదీస్తే గ్లిర్‌గ్లానీ కమిటీ వేశారని, కానీ కమిటీకి నిధులు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. చివరికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్లే నిధులు మంజూరు చేశారన్నారు. ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో జరిగిన చేర్పులు, మార్పులను ముఖ్యమంత్రి కిరణ్ కప్పి పెడుతున్నారన్నారు. నిజాం పాలన వల్లే తెలంగాణ వెనుకబడిందని అసెంబ్లీలో ఆంధ్రా పాలకులు బురద చల్లుతున్నారన్నారు. నిజాం సర్కార్ హయాంలో పెట్టిన రూ.2వేల కోట్లు విలువ చేసి చక్కర పరిశ్రమను సీమాంధ్ర ప్రభుత్వం అమ్ముకుందని, అలాగే నిజాం కాలం నాటి విలువైన భూములను ఆంధ్రా పెత్తందారులు కబ్జాలు చేశారని ఆరోపించారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగనివ్వకుండా అడ్డుకొని కాగితాలను తగులబెట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌యాదవ్, టీజేఎసీ డివిజన్ కన్వీనర్ పూస శ్రీనివాస్, మండల కన్వీనర్ జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, స్వాతంత్ర సమరయోధులు కొలను శివారెడ్డి, లక్ష్మినారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బతుకు బాగు కోసమే పోరాటం
నాగర్‌కర్నూల్‌రూరల్/తెలకపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ విముక్తికోసం, ఇక్కడి ప్రజల బాగుకోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని అడుగుతున్నామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సీమాంధ్రుల అధికారదాహమే తెలంగాణ ప్రాంత వెనకబాటుకు కారణమైందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముసాయిదా బిల్లు పత్రాలను కాల్చివేస్తే తెలంగాణ ఆగిపోతుందనుకోవడం సీమాంధ్రుల మూర్ఖత్వమే అవుతుందన్నారు. సోమవారం తెలకపల్లిలో భోగరాజు ఆంజనేయులు మిత్రబృందం, టీజేఏసీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో కొన్ని లోపాలున్నాయని, హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ తయారయ్యే విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వకుండా ఇతరరాష్ట్రాల్లో తయారైన విద్యుత్‌ను ఇస్తామనడం సరికాదన్నారు. 610జీఓ ప్రకారం ఉద్యోగాల పంపిణీ జరగాలన్నారు. జయశంకర్ త్యాగఫలమే తెలంగాణ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన విధానమని, ఆయన త్యాగఫలితం వల్లే ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడం మంచి ఆలోచన అని అభినందించారు. మహాత్ముల విగ్రహాలు తోవ చూపుతాయన్నారు. నీళ్లు, నిధులు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై జయశంకర్ నిరంతర పోరాటం చేశారని వివరించారు. చంద్రబాబుతోనూ, వైఎస్‌ఆర్‌తోనూ పోట్లాడారని గుర్తుచేశారు. సమైక్యపాలనలో నష్టం: కేటీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ..దోచుకునేందుకే కలిసుండాలని సీమాంధ్రులు కోరుకుంటున్నారని అన్నారు. సమైక్యపాలనలో పాలమూరుకే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడితే పాలమూరుకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో 38లక్షలమంది ఉంటే ఏటా 14 వేలమందికి పైగా వలస పోతున్నారని, ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు సస్యశ్యామలం అవుతుందన్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ ప్రాంతాలు తప్పనిసరిగా జిల్లాలు అవుతాయని పేర్కొన్నారు. వెనకబాటుకు నాయకులే కారణం టీజీఓ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న నాయకులు అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్లే జిల్లా వెనుకబడిందని విమర్శించారు. పాలమూరు నుంచే ఎక్కువ శాతం వలసలు పోతున్నారని అన్నారు. మన జీతాలు కాంట్రాక్ట్ బతుకులయ్యాయని, మన బతుకులు కాంట్రాక్ట్ బతుకులయ్యాయని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక నీళ్లు, నిధులు, ఉద్యోగాలు సాధ్యమవుతాయని, మన రాష్ట్రాన్ని మనం పాలించుకున్నప్పుడే ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ.. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుపై రాజపత్రం బయటికి వచ్చిన తరువాతే సంబరాలు జరుపుకుందామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి కిరణ్, మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి అబ్రహాం, బైకని శ్రీనివాసులు, సంధ్యారాణి, ఇంద్రారెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.