సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీకి అనుబంధంగా తెలంగాణ యువజన సమితి(టీవైఎస్) ఏర్పాటైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. టీవైఎస్‌ను ఏర్పాటుతోపాటు దానికి కో–ఆర్డినేషన్ కమిటీని నియమించారు. అనంతరం టీవైఎస్ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. భారీగా సభ్యత్వ నమోదు, యువజన విభాగం నిర్మాణంపై తక్షణమే దృష్టి సారించాలని పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ సందర్భంగా నేతలకు సూచించారు.
టీవైఎస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్లు వీరే..
ఆశప్ప (ఓయూ), సలీం పాషా (ఓయూ), కల్వకుర్తి ఆంజనేయులు (ఓయూ), మాలిగ లింగ స్వామి (ఓయూ) పూసల రమేశ్ (ఓయూ), వినయ్ (హైదరాబాద్), రమణ్‌సింగ్ (హైదరాబాద్), పూడూరి అజయ్ (వికారాబాద్), వెంకట్‌రెడ్డి (సూర్యాపేట), శేషు (కేయూ), డాక్టర్ సంజీవ్ (కేయూ), డాక్టర్ విజయ్ (కేయూ), నరైన్ (హైదరాబాద్), దాసరి శ్రీను (భూపాలపల్లి), భరత్ (కొత్తగూడెం).
టీజేఎస్ విద్యార్థి విభాగం ఏర్పాటు
తెలంగాణ జన సమితి (టీజేఎస్) విద్యార్థి విభాగాన్ని శుక్రవారం ఏర్పాటు చేసింది. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యార్థి విభాగం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ నాయకుడు వెంకట్‌రెడ్డి తెలిపారు.
కమిటీలోని సభ్యులు వీరే..
సర్దార్ వినోద్‌కుమార్–నిర్మల్ (ఓయూ), నిజ్జన రమేశ్ ముదిరాజ్–కామారెడ్డి (ఓయూ), ప్రవీణ్ ఆర్య, అరుణ్–హైదరాబాద్, రెడ్డి శ్రీనివాస్– కొడంగల్, బాబు మహాజన్, శివ ప్రసాద్–యాదాద్రి, గడ్డం వెంకటేశ్–మంచిర్యాల, ప్రశాంత్–జనగామ, శివరామ్–నాగర్‌కర్నూల్, అనిల్– మహబూబాబాద్, తల్లా ప్రవీణ్‌కుమార్–సిద్దిపేట, పాలెం శ్రీకాం త్‌రెడ్డి–మేడ్చల్, ప్రతాప్‌రెడ్డి–సూర్యాపేట, పంగ శ్యామ్–వరంగల్, కృష్ణకాంత్–నల్లగొండ, ప్రభాకర్–భూపాలపల్లి, సాయిరామ్ నాయక్–పెద్దపల్లి.
Comments
Please login to add a commentAdd a comment