kotha kottala
-
యువతి బలవన్మరణం
కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లు కొత్తకొట్టాలకు చెందిన హసీన(18) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గోరంట్ల మండలం శెట్టిపల్లికి చెందిన అబీద కణేకల్లులో ఎంపీఈఓగా పని చేస్తున్నారు. ఆమె భర్త భర్త డేవిడ్‌తో కలసి కొత్తకొట్టాలలో నివాసముంటున్నారు. అక్కకు తోడుగా హసీన ఇక్కడే ఉంటోంది. అయితే కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెకు గురువారం మరోసారి నొప్పి ఎక్కువైంది. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కణేకల్లు పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు. -
చీకట్లు నింపిన విద్యుత్
కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లులోని కొత్త కొట్టాలలో ఆదివారం సాయంత్రం విద్యుదాఘతానికి గురై దాసరి గొల్ల ఎర్రిస్వామి(39) మృతి చెందినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. కొత్త నిర్మిస్తున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేశారు. సాయంత్రం కాగానే ఇంట్లో లైట్ వెలిగించేందుకు వైర్‌ను బోర్డులో అమర్చుతుండగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడన్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అతన్ని కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధరించారన్నారు. మృతుడి భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.