పంటలను ధ్వంసం చేయడం తగదు
వరంగల్ చౌరస్తా : పేదలు, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పంట లను హరితహారం పేరుతో ధ్వంసం చేయడం తగదని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తాలో న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ 2006 అటవీ హక్కు లచట్ట ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకుండా.. ఉన్న భూముల్లో మొక్కలు నాటడమేమిటని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని కేసీఆర్ ప్రకటించి, ఇప్పుడు భూములను లాక్కోవడం సరికాదన్నారు. నాయకులు చిర్ర సూరి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పసునూటి రాజు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పైండ్ల యాకయ్య, నాయకులు మైదం పాణి, మోహన్, కార్తీక్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు