k.rama krishna
-
విపక్ష నేతపై వాడిన పదజాలం దేనికి సంకేతం?
మంత్రి పల్లె తో రామకృష్ణ సాక్షి, అనంతపురం: ప్రతిపక్షం విషయంలో అధికార పార్టీ తీరు సరిగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా, తదితరాల కోసం మంత్రి పల్లె ఇంటి వద్ద ఆదివారం సీపీఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి రఘనాథరెడ్డితో రామకృష్ణ,ఇతర నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ‘ప్రతిపక్ష నేత జగన్‌నుఉద్దేశించి వాడిన పదజాలం దేనికి సంకేతమని మంత్రిని ప్రశ్నించినట్టు తెలిసింది.ఇందుకు ఆయన మౌనం వహించినట్టు, సభలో ఆవేశకావేశాలు పెరుగుతున్నట్టు అంగీకరించారని తెలిసింది. -
జగన్ గారూ... ధన్యవాదాలు
ప్రతిపక్ష నేతకు సీపీఐ నేత రామకృష్ణ ఫోన్ జనం కోసం జరిగే పోరాటాలకు మద్దతిస్తాం: వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై పోరాడుతున్న తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం జగన్‌కు ఫోన్ చేశారు. ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేక హోదా కోసం ధర్నాలు జరిగాయి. ఇందులో భాగంగా రామకృష్ణ ఆధ్వర్యంలో అనంతపురంలో ఆందోళన చేశారు. సీపీఐ కార్యకర్తలు టెలిఫోన్ కార్యాలయంలోకి ప్రవేశించి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారన్న ఆరోపణల మేరకు పోలీసులు రామకృష్ణతో పాటు పది మందిని అరెస్ట్ చేశారు. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆ మర్నాడు అంటే 19వతేదీన శాసనసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీపీఐ నేత అరెస్ట్‌పై హోం మంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నేతల్ని అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీనివల్ల సమస్య తీవ్రత రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందని, అందుకు ధన్యవాదాలు తెలపడం తమ బాధ్యతని రామకృష్ణ చెప్పారు.ప్రత్యేక హోదా విషయంలో రాజకీయాలకు తావు లేదని.. ప్రజా సమస్యలపై పోరాడే వారిని అరెస్ట్ చేసినప్పుడు, వారి పట్ల పాలకులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉంటుందని జగన్ అన్నట్టు సమాచారం. -
బాబు మోసాలపై రాజీలేని పోరాటం
విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసగిస్తున్న వైనంపై రాజీలేని పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు. గ్రేటర్ ఐదో వార్డు పరిధిలోని మల్లయ్యపాలెంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, నేత కార్మికులను ఆదుకుంటామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆ తరువాత ఆ విషయాన్ని విస్మరించారని విమర్శించారు. అప్పటిలో ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చేవరకు తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 19న రాష్ర్ట వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్పారు. హుదూద్ సాయం పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, 84 రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేయడమే ఇందుకు సాక్ష్యమన్నారు. రాష్ట్ర రాజధానికోసం టీడీపీ ప్రభుత్వం భూసేకరణపై ఆయన మండిపడ్డారు. ల్యాండ్‌పుల్లింగ్ పేరిట దలారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజధానికి ఎంత భూమి అవసరమో అనేదానిపై ప్రభుత్వానికి ఇప్పటికీ సరియైన అవగాహన లేదన్నారు. భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగితే సహించేంది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, కన్నా లక్ష్మీనారాయణ, పూటకో పార్టీను మార్చే జీవిత రాజశేఖర్‌లను ఏవిధంగా చేర్చుకున్నాని ప్రశ్నించారు. పార్టీ బలోపేతంలో భాగంగా డిసెంబర్లో మండలస్థాయి, జనవరిలో పట్టణస్థాయి, ఫిబ్రవరిలో జిల్లాస్థాయి మహా సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విజయవాడలో మార్చి 4,5,6 తేదీల్లో రాష్ట్రసాయి మహాసభలు నిర్వహిస్తామని, అదే నెల 25 నుంచి 29 వరకు పాండిచ్చేరిలో జాతీయమహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్రిత, నగర కార్యదర్శి జేవీ ప్రభాకరరావు, సహాయ కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, కార్యవర్గ సభ్యులు మార్కెండేయులు పాల్గొన్నారు.