- మంత్రి పల్లె తో రామకృష్ణ
సాక్షి, అనంతపురం: ప్రతిపక్షం విషయంలో అధికార పార్టీ తీరు సరిగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా, తదితరాల కోసం మంత్రి పల్లె ఇంటి వద్ద ఆదివారం సీపీఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి రఘనాథరెడ్డితో రామకృష్ణ,ఇతర నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ‘ప్రతిపక్ష నేత జగన్‌నుఉద్దేశించి వాడిన పదజాలం దేనికి సంకేతమని మంత్రిని ప్రశ్నించినట్టు తెలిసింది.ఇందుకు ఆయన మౌనం వహించినట్టు, సభలో ఆవేశకావేశాలు పెరుగుతున్నట్టు అంగీకరించారని తెలిసింది.