krishna river board meeting
-
కృష్ణా రివర్ బోర్డ్ సమావేశానికి హాజరు కానున్న ఏపీ అధికారులు
అమరావతి: విజయవాడలో రేపు (బుధవారం) కృష్ణా రివర్ బోర్డ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఈఎన్సి నారాయణ రెడ్డి, ఇంటర్ స్టేట్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి హజరు కానున్నారు. తెలంగాణ అక్రమ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ఈ సమావేశంలో ఏపీ అధికారులు కోరనున్నారు. ఈ ఏడాది ఏపీకి 80 శాతం, తెలంగాణకు 20 శాతం కృష్ణాజలాలు కేటాయించాలని బోర్డును ఏపీ అధికారులు కోరే అవకాశం ఉంది. అదే విధంగా, మిగులు జలాల వినియోగాన్ని లెక్కించాలన్న తెలంగాణ వాదనను ఏపీ అధికారులు తోసిపుచ్చనున్నారు. మొత్తం పది అంశాలపై తమ వాదనను వినిపిస్తామని ఏపీ అధికారులు తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో ఏపీ మరో రికార్డు -
కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు భేటీ
న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత సంవత్సరంలో నీటి వినియోగానికి సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, ముసాయిదాపై చర్చిస్తారు. తెలంగాణ ఇప్పటికే గతేడాది ముసాయిదాను కొనసాగించాలని కోరుతుంది. బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టులపై తేల్చాలని ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించే అవకాశముంది. పోలవరం, పట్టిసీమ, మేడిగడ్డ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అధికారులు కేంద్రంతో చర్చించనున్నారు.