krishnakumar kunnath
-
దివంగత సింగర్ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు
Bengali Singer Rupankar Bagchi Issues Apology To KK After Criticised: ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53) మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన ఆయన మే 31 రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోని ఆయన అనేక భాషల్లో పాడి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ లోకం సంతాపం తెలియజేసింది. అయితే ప్రముఖ బెంగాలీ గాయకుడు, గేయ రచయిత రూపాంకర్ బగ్చీ మాత్రం 'ఎవరు ఈ కేకే, ప్రాంతీయ సింగర్లను ప్రోత్సహించాలి' అంటూ వీడియో రూపంలో తన అక్కసును వెళ్లగక్కిన విషయం విదితమే. ఆయన మాటలకు అనేక మంది నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. అయితే తాజాగా రూపాంకర్ ఈ విషయంపై కేకేకు అతని కుటుంబానికి క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ నిర్వహించి బహిరంగంగా క్షమాపణలు కోరాడు. తను పోస్ట్ చేసిన వీడియోను కూడా డిలీట్ చేసినట్లు పేర్కొన్నాడు. 'కేకే కుటుంబానికి, నా వ్యాఖ్యలతో బాధపడిన ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను. కేకేతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. బెంగాలీ పరిశ్రమకు చెందిన వారి కంటే దక్షిణ, పశ్చిమ భారతదేశానికి చెందిన గాయకులకు ఎక్కువ ప్రేమ, గుర్తింపు లభిస్తుందని మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. చదవండి: కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? ఇంత విద్వేశానికి గురవుతారని ఊహించలేదు. నా భార్యకు కూడా బెదిరింపు మెస్సేజ్‌లు వస్తున్నాయి. అందుకే కేకే కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోను కూడా డిలీట్ చేశాను. కేకే ఇప్పుడు ఎక్కడ ఉన్న దేవుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని ప్రెస్మీట్లో రూపాంకర్ బగ్చీ తెలిపాడు. -
సీపీఆర్ చేస్తే బతికేవారేమో
కోల్‌కతా/ముంబై: గుండెపోటుతో మరణించిన ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే)కు సకాలంలో సీపీఆర్ చేసుంటే ప్రాణాలు నిలిచేవని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడ్డారు. ‘‘ఆయన గుండెలో ఎడమవైపు ధమనిలో 80 శాతం బ్లాకేజీ ఉంది. మిగతా ధమనులు, రక్తనాళాల్లోనూ చిన్నచిన్న బ్లాక్‌లున్నాయి. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నట్టుంది. దీనికి తోడు లైవ్ షోలో ఉద్విగ్నంగా గడపటంతో గుండెకు రక్తం సరిగా అందక మరణానికి దారితీసింది. స్పృహ కోల్పోగానే సీపీఆర్ చేసుంటే బతికేవారు’’ అని ఒక వైద్యుడు పీటీఐకి చెప్పారు. కేకే యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది. గుండెనొప్పిని అజీర్తిగా భావించి వాటిని వాడి ఉంటారని వైద్యులు చెప్పారు. కోల్‌కతా నుంచి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఛాతిలో నొప్పిగా ఉందని, చేతులూ భుజాలూ లాగుతున్నాయని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అభిమానుల కన్నీటి నడుమ కేకే అంత్యక్రియలు ముంబై వెర్సొవా హిందు శ్మశానవాటికలో గురువారం జరిగాయి. కుమారుడు నకుల్ అంతిమ సంస్కారం నిర్వహించారు. శ్రేయఘోషల్, అల్కాయాజ్ఞిక్, హరిహరన్, సలీమ్ మర్చంట్ వంటి సింగర్లు నివాళులర్పించారు. -
‘ఛాతీలో భారంగా ఉందంటూ కుప్పకూలిన కేకే.. అలా చేసుంటే బతికేవారు’
ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ మరణం సినీ, సంగీతప్రియులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన ఇచ్చిన అనంతరం హోటల్ గదిలోకి వెళ్లిన కేకే ఛాతీలో భారంగా ఉందంటూనే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు ధృవీకరించారు. అయితే సకాలంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసుంటే కేకే బతికేవారని ఓ వైద్యుడు పేర్కొన్నారు. గురువారం కేకే పార్థివదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ.. 'కేకే గుండెలోని ఎడమ ధమనిలో పెద్ద బ్లాక్ ఏర్పడింది. ఇతర నాళాల్లో కూడా చిన్నచిన్న బ్లాక్స్ ఉన్నాయి. లైవ్ షోలో తీవ్ర ఉద్వేగానికి లోనవడంతో రక్త ప్రసరణ ఆగిపోయి గుండెపోటు వచ్చింది. కేకే జనాలతో కలిసి డ్యాన్స్ చేస్తూ పాడుతూ బాగా ఎగ్జయిట్ అయ్యాడు. తీవ్ర ఉద్వేగానికి లోనయినప్పుడు రక్త ప్రసరణ కొన్ని క్షణాల పాటు ఆగిపోయి గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. ఆ సమయంలోనే అతడికి గుండెపోటు వచ్చింది. కానీ అతడు స్పృహ తప్పి కింద పడిపోయిన వెంటనే ఎవరైనా సీపీఆర్(గుండె మీద చేతులతో నొక్కడం) చేసుంటే బతికే ఛాన్స్ ఉండేది. అతడికి చాలాకాలంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేశాడు' అని పేర్కొన్నాడు. సీపీఆర్ ఇలా.. గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60 నుంచి 70% అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్‌ను రప్పించి ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి. చదవండి: పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి' కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? -
పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'
‘ఎద లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి’... ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’లో ఇంత మధురంగా పాడిన కృష్ణకుమార్ కున్నత్ (కెకె) 53 ఏళ్ల వయసులో తన అభిమానులను దిగ్భ్రమ పరిచి ఇక పై తన పాటల్నే జ్ఞాపకాలుగా చేసుకోమన్నాడు. పాట పాడటానికి పుట్టిన కెకె కోల్‌కతాలో మంగళవారం రాత్రి పాడుతూనే తుదిశ్వాస విడిచాడు. సుందరమైన స్వరం గల ఆ గాయకుడికి నివాళి. కృష్ణకుమార్ కున్నత్ అను కెకె మామూలుగా బయట కనపడడు. ఇంటర్వ్యూలు ఇవ్వడు. సినిమా ఫంక్షన్స్‌లో పాల్గొనడు. అందుకని అతని పాట చెప్తే తప్ప అతణ్ణి నేరుగా గుర్తు పట్టేవారు తక్కువ. ‘ప్రేమదేశం’ లో ‘క..క..క... కాలేజీ స్టైలే’ పాడింది కేకేనే. ‘హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే’ పాడి కుర్రకారు హార్ట్ మిస్సయ్యేలా చేసింది అతడే. తెలుగులో ఒక కాలంలో కెకె ఎన్నో హిట్స్ పాడాడు. ఖుషీలో ‘ఏ మేరా జహా... ఏ మేరి ఆషియా’ పెద్ద హిట్టు. వెంకటేష్ ‘వాసు’లో ‘పాటకు ప్రాణం పల్లవి అయితే’ నేటికీ వింటున్నారు. ‘ఘర్షణ’లో ‘చెలియ.. చెలియా’ కూడా. కెకె మాతృభాష మలయాళం. కాని పుట్టి పెరిగిందంతా ఢిల్లీలో. సంగీతం శాస్త్రీయంగా నేర్చుకో లేదు. అమ్మమ్మ దగ్గర తప్ప. కాని బాగా పాడేవాడు. బ్యాండ్స్‌లో పని చేయాలని ఉండేది. చదువు పూర్తి కాగానే 1991లో జ్యోతికృష్ణను వివాహం చేసుకున్నాడు. ఢిల్లీలో మొదట అతను జింగిల్స్ పాడేవాడు. అలాగే హోటల్స్‌లో బ్యాండ్స్‌లో పెర్ఫార్మ్ చేసేవాడు. ఆ సమయంలోనే ఢిల్లీకి వచ్చిన హరిహరన్ అతడు పాడుతున్న హోటల్లో అతడి పాట విని ‘ఇక్కడేం చేస్తున్నావ్. నువ్వు ఉండాల్సింది ముంబైలో’ అని చెప్పాడు. అయినా కూడా కెకెకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పాప్ సింగర్‌గానే ఉండాలని, ఆల్బమ్ రిలీజ్ చేయాలని ఉండేది. కాని భార్య అతణ్ణి ప్రోత్సహించింది. ఢిల్లీలో ఎంతకాలం ఉన్నా ఇంతే.. మనం ముంబై వెళ్దాం అంటే 1994లో ముంబైకి వచ్చాడు. అప్పటికే అతనికి విశాల్–శేఖర్ ద్వయంలోని విశాల్‌తో పరిచయం ఉంది. విశాల్ ‘మేచిస్’కు సంగీతం ఇస్తూ అందులో పెద్ద హిట్ అయిన ‘ఛోడ్ ఆయే హమ్ ఓ గలియా’ పాటలో ఒకటి రెండు లైన్లు ఇచ్చాడు. ఆ పాట హిట్ అయ్యింది. ఆ తర్వాత జింగిల్స్ పాడటం మొదలు పెట్టి జింగిల్స్ సింగర్‌గా చాలా బిజీ అయ్యాడు. 1994 నుంచి 1998 వరకూ నాలుగేళ్లలో 11 భాషల్లో 3,500 జింగిల్స్ పాడాటంటే అది అతని గొంతు మహిమ. ఏఆర్. రహెమాన్ కూడా జింగిల్స్ చేసేవాడు కాబట్టి వెంటనే కెకెను పాటల్లోకి తెచ్చాడు. ‘ప్రేమదేశం’, ‘మెరుపుకలలు’ (తమిళం) సినిమాల్లో పాడించాడు. 1999లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో ‘తడప్ తడప్ కే’... పాట సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. సల్మాన్‌ఖాన్‌కు పాడటంతో కెకెకు ఇక తిరుగు లేకుండాపోయింది. 1999లోనే సోనీ అతనితో ‘పల్’ అనే ఆల్బన్ తెచ్చింది. ఆ ఆల్బమ్ కూడా హిట్. కెకె మొత్తం పది భారతీయ భాషల్లో 700 పాటలు పాడాడు. వందల సంగీత ప్రదర్శనలు చేశాడు. అతడు అయితే స్టూడియోలో ఉంటాడు. లేదంటే ఇంట్లో. ఎక్కడా తిరగడానికి ఇష్టపడడు. కొడుకు నకుల్ కృష్ణ, కూతురు తామ్రకృష్ణ అతడి లోకం తెలుగులో చిరంజీవికి ‘దాయి దాయి దామ్మా’, తరుణ్‌కు ‘అయామ్ వెరీ సారీ’, పవన్ కల్యాణ్‌కు ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’, అల్లు అర్జున్‌కు ‘ఫీల్ మై లవ్’– ‘ఉప్పెనంత ఈ ప్రేమకు’, మహేశ్ బాబుకు ‘అవును నిజం’... ఎన్నో హిట్స్ కెకె ఖాతాలో ఉన్నాయి. సెవన్బైజి బృందావన్ కాలనీలో పాడిన ‘తలచి తలచి చూస్తే’ పాటకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ‘గుర్తుకొస్తున్నాయి’ పాటకు కూడా. ఒక మంచి గాయకుడు దూరమయ్యాడు. పాడుతూ పాడుతూ నేలకొరిగిపోయాడు. అతని గొంతు మాత్రమే గడ్డ కట్టింది. పాడిన పల్లవి చరణాలు ప్రవహిస్తూనే ఉంటాయి. -
KK Singer Death: సింగర్ కేకే మృతిపై అక్షయ్, ఆర్ రెహమాన్ ఆవేదన
ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మంగళవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన హాఠాన్మరణం సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. సిద్ధూ మూసేవాలా హత్యోదంతం జరిగిన రెండు రోజులకే మరో ప్రముఖ గాయకుడి అకాల మరణం యావత్ సినిమా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఆయన మృతి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేకే మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కెరీర్లో కేకే కూడా ఒక భాగం. నేను చేసిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో పాటలకు స్వరాన్ని అందించారు. Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK — A.R.Rahman (@arrahman) June 1, 2022 ఆయన ఆలపించిన ‘తూ బోలా జైసే’ పాట వల్లే ఎయిర్ లిఫ్ట్ మూవీ క్లైమాక్స్ చక్కగా వచ్చింది. గత రాత్రి జరిగిన ఘటన నిజంగా షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ సింగర్ విశాల్ దడ్లానీ తీవ్ర దిగ్భ్రాంతీ వ్యక్తం చేస్తున్నారు. కేకే మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆయన వరుస ట్వీట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రలకు, సన్నిహితలకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘స్నేహితులకు, మీడియా మిత్రలకు నా విన్నపం ఏంటంటే. కేకే గురించి మాట్లాడమని గాని, స్టేట్మెంట్ ఇవ్వమని గాని నన్ను అడగకండి ప్లీజ్. ఎందుకంటే ప్రస్తుతం ఆయన గురించి నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. నాకంత శక్తి కూడా లేదు’ అంటూ రాసుకొచ్చారు. A request to friends from the media. Please don't call me for statements about #KK. I can't speak about him in the past tense, I simply don't have the strength for that. 🙏🏽 — VISHAL DADLANI (@VishalDadlani) June 1, 2022 వీరితో పాటు పలువకు బాలీవుడ్ హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా కేకే 1968లో ఢిల్లీలో జన్మించారు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా వంటి తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కలతాలోని నజ్రుల్ మంచ్ వద్ద మంగళవారం రాత్రి ప్రదర్శన ఇచ్చిన అనంతరం కేకే అస్వస్థతకు గురి కాగా, ఆయన్ను సీఎంఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు. కాని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించడం తెలిసిందే. కేకే మృతిని అసహజ మరణం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. So sad to hear about KK’s death. He sang the first song of my first film. A great friend since then. Why so early, KK, why? But you have left behind a treasure of a playlist. Very difficult night. ॐ शांति। Artists like KK never die. pic.twitter.com/MuOdAkEOJv — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 31, 2022 When beautiful voices are stopped in full flow, the universe loses a lifeline. In shock over the tragic deaths of two singing legends #sidhumoosewala & #KK. Numbed at the unfathomable loss 🙏 #RIPLegends. #RIPKK #RIPLegend #KKPassesAway #KrishnakumarKunnath #SidhuMooseWalaDeath pic.twitter.com/j7POeYmMBq — Suniel Shetty (@SunielVShetty) June 1, 2022 View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
రూ.కోటి ఆఫర్ చేసినా పాడని కేకే!
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53) మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన ఆయన మే 31 రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత గుండెపోటుతో మరణించారు. వేలాది యాడ్స్‌కు సైతం తన గొంతును సవరించిన ఆయన పెళ్లి పేరంటాల్లో మాత్రం పాడేందుకు నో చెప్పారట. 2008లో హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇప్పటివరకు ఏదైనా ఆఫర్స్‌కు నో చెప్పారా? అన్న ప్రశ్నకు కేకే స్పందిస్తూ.. 'అవును, పెళ్లి కార్యక్రమాల్లో పాడమని అడిగితే కుదరదని చెప్పేశా. కోటి రూపాయలిస్తామన్నారు, అయినా సరే పాడనని కుండ బద్ధలు కొట్టేశా. పైసల కోసం నేను నటించలేను. కొన్ని సంవత్సరాల క్రితం ఓ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది కానీ పాయింట్ బ్లాక్‌లో నో చెప్పాను' అని చెప్పుకొచ్చారు. కాగా కేకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ సహా పలు భాషల్లో ఆలపించారు. చదవండి: ఎవరీ కేకే, ఆయనకంటే మేమే బాగా పాడతామన్న సింగర్.. నెట్టింట ట్రోలింగ్ సింగర్ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు! సీక్రెట్ ఎంగేజ్మెంట్, కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన పూర్ణ -
కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా?
సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. కానీ ఆయన గొంతు సవరించుకుని పాడే పాటలకు దేశమే ఫిదా అయింది. సౌత్ నుంచి నార్త్ దాకా ఎన్నో భాషల్లో పాటలు పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రేమగీతాల కంటే విరహ గీతాలతోనే బాగా పాపులర్ అయ్యారు. కానీ అర్ధాంతరంగా ఆయన గొంతు మూగబోయింది. సింగర్ కేకే అలియాస్ కృష్ణకుమార్ కున్నాత్ (53) మంగళవారం రాత్రి కోల్‌కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. కేకే మృతి చెందడానికి కొన్ని గంటల ముందు బెంగాలీకి చెందిన సింగర్ రూపాంకర్ బగ్చీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అసలు కేకే ఎవరు? ఆయన్ను కీర్తిస్తున్నారెందుకు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? అంటూ ఫేస్బుక్ లైవ్‌లో మండిపడ్డాడు. దీంతో ఈయన శాపనార్థాలే కేకే మృతికి కారణమయ్యాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఫేస్బుక్ లైవ్‌లో రూపాంకర్ మాట్లాడుతూ.. 'కోల్‌కతాలో కేకే షో ఉందనగానే ఎక్కడలేని ఎగ్జయిట్మెంట్ కనిపిస్తోంది. నేను, అనుపమ్ రామ్, సోమత, ఎమాన్ చక్రవర్తి, ఉజ్జయినీ ముఖర్జీ, కాక్టస్, ఫాజిల్స్, రూపమ్ ఇస్లామ్.. ఇంకా మరెందరో కోల్‌కతాకు చెందిన ఆర్టిస్టులు కేకే కంటే బాగా పాడతారు. మరి మా గురించి మీరెందుకు అంత ఎగ్జయిట్ అవరు? కారణమేంటో చెప్పండి. అసలు కేకే ఎవరు? అలాంటి వాళ్లకంటే మేము చాలా చాలా బాగా పాడతాం. నేను పైన చెప్పిన వారందరూ కేకే కంటే ఉత్తమంగా ఆలపించేవాళ్లే. దయచేసి ప్రాంతీయ గాయకులను ప్రోత్సహించండి. బెంగాలీవాసులుగా మసులుకోండి' అని చెప్తూ లైవ్ ముగించాడు. ఈ లైవ్ జరిగిన కాసేపటికే కేకే మరణించడంతో అతడి ఫ్యాన్స్ రూపాంకర్పై ఫైర్ అవుతున్నారు. 'మరీ అంత అసూయనా, మీ శాపనార్థాల వల్లే ఆయన ఉసురు పోయింది', 'నిన్ను జైల్లో వేయాలి' అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రూపాంకర్ స్పందిస్తూ.. తాను కేవలం బెంగాలీ సంగీత సాహిత్యాన్ని ఆదరించకుండా పోతున్న ధోరణిపైనే ఆవేదన వ్యక్తం చేశానని కానీ అందరూ కేకే గురించి అన్నమాటలనే పట్టించుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. సింగర్ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు! -
సింగర్ కేకే మృతికి చిరంజీవి, మహేశ్ బాబు నివాళి
ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం యవత్ దేశంలోని సంగీతాభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మృతిపై అన్ని పరిశ్రమలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా ఆయన మృతి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కేకే మరణ వార్త నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. అద్భుతమైన గాయకుడు, గొప్ప వ్యక్తి. కేకే నా కోసం ‘ఇంద్ర’లోని ‘దాయి దాయీ దామా’ పాట పాడారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక’ అంటూ చిరంజీవి నివాళులు అర్పించారు. చదవండి: సింగర్ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు! Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and a great soul.He sang ‘Daayi Daayi Daama’ from ‘Indra’ for me. My heartfelt condolences to his family & near and dear ones. May his soul rest in peace! #RIPKK — Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2022 అలాగే మహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి హీరోలు కేకే మృతికి సంతాపం తెలియజేశారు. ‘కేకే అకాల మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన ఒక గొప్ప గాయకుడు. అతని కుటుంబానికి, సన్నిహితులకు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’ అంటూ మహేశ్ సంతాపం ప్రకటించారు. అలాగే రామ్ చరణ్, పవన్ కల్యాణ్‌లు కూడా కేకే మృతి నివాళులు అర్పించారు. చదవండి: విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్ Shocked and saddened by KK's untimely demise! One of our finest singers... Heartfelt condolences to his family and loved ones. May his soul rest in peace 🙏🙏 — Mahesh Babu (@urstrulyMahesh) June 1, 2022 ‘కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం’ అంటూ నటుడు పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. With a heavy heart, I extend my condolences to KK ‘s family and fans 🙏 Your voice will remain in our hearts forever. Rest in peace KK 🙏 — Ram Charan (@AlwaysRamCharan) June 1, 2022 -
Singer KK Photos: సింగర్ కేకే జ్ఞాపకాలు.. అరుదైన ఫొటోలు
-
సింగర్ కేకే మరణంపై అనుమానాలు!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే(53) మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేకే హఠాన్మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన పాల్గొన్న స్టేజ్ షో దగ్గరి సీసీ పుటేజ్‌ని స్వాదీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. సింగర్ కేకేది అసహజ మరణం అని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. సరైన వసతులు లేకపోవడం వల్లే కేకే మరణించారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేకే ముఖంపై గాయాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. (చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి..) కాగా, కోల్‌కతాలో ఒక ప్రదర్శన కోసం వెళ్లిన కేకే మంగళవారం అర్థరాత్రి అకస్మాత్తుగా చనిపోయారు. ప్రదర్శన అనంతరం హోటల్ గదిలోకి వెళ్లిన కేకే.. గుండెపోటుకు గురవడంతో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకేగా ప్రసిద్దుడైన ఆయన ఎమోషనల్ సాంగ్స్‌కు పెట్టింది పేరుగా మారాడు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో ఏన్నో పాటలు పాడారు. తెలుగులో 20కి పైగా సూపర్ హిట్ సాంగ్స్‌తో సినీ ప్రియుల మనసు గెలుచుకున్నాడు. ఫీల్ మై లవ్(ఆర్య), చెలియ చెలియా(ఘర్షణ), దాయి దాయి దామ్మా(ఇంద్ర) ఏ మేరా జహా(ఖుషి)వంటి పలు పాటలను ఆయన ఆలపించాడు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.అక్షయ్ కుమార్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. -
సింగర్ కేకే హఠాన్మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు